News May 7, 2025

రాష్ట్రంలో బార్ల లైసెన్సు ఫీజులు తగ్గింపు

image

AP: టూరిజం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం బార్ల లైసెన్స్ ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించింది. బార్ల లైసెన్స్‌ ఫీజు రూ.5 లక్షలు, 3, 5 స్టార్ హోటళ్ల రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించేసింది. నాన్ రిఫండబుల్ ఛార్జీని రూ.20 లక్షలుగా పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

News May 7, 2025

IPL: టాస్ గెలిచిన పంజాబ్

image

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. PBKS టీమ్‌లోకి మ్యాక్సీ, ఒమర్‌‌‌జాయ్ రాగా, KKR తరఫున పావెల్ డెబ్యూ చేస్తున్నారు.

PBKS: ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, శ్రేయస్, ఇంగ్లిస్, శశాంక్, వధేరా, మ్యాక్స్‌వెల్, ఒమర్‌జాయ్, జాన్‌సెన్, చాహల్, అర్ష్‌దీప్
KKR: గుర్బాజ్, నరైన్, రహానె, వెంకటేశ్ అయ్యర్, రింకూ, రసెల్, పావెల్, వైభవ్, చేతన్, హర్షిత్, వరుణ్ చక్రవర్తి

News May 7, 2025

జగన్ ఏ ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు: షర్మిల

image

AP: 15 ఏళ్లుగా పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగలేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ YS షర్మిల అన్నారు. జగన్ CM అయ్యాక నిర్వాసితులను విభజించారని, R&R ప్యాకేజీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 95వేల కుటుంబాలకు సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలయజ్ఞంలో ఏ ప్రాజెక్టునూ జగన్ పూర్తి చేయలేదని విమర్శించారు. గతంలో మోదీ రాజధానిలో మట్టి వేసి వెళ్లారని, ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు.

News May 7, 2025

మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తాం: నారాయణ

image

AP: రాబోయే మూడేళ్లలో రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. రూ.64 వేల కోట్లతో రాజధాని అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ‘రాజధాని కోసం రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ భూముల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ సిటీ కడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో జగన్ తుగ్లక్ పాలనతో అమరావతి పనులు నిలిచిపోయాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News May 7, 2025

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీని వచ్చే నెల 9న 2D, 3D వెర్షన్‌లో రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించారు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. 1990 మే 9న విడుదలైన ఈ మూవీ అప్పట్లోనే దాదాపు రూ.15 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

News May 7, 2025

ఇక సెలవు.. ముగిసిన పోప్ అంత్యక్రియలు

image

రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్(88) అంత్యక్రియలు ముగిశాయి. ఈనెల 21న ఆయన కన్నుమూయగా ఇవాళ వాటికన్ సిటీలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సుమారు 2.50 లక్షల మంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, US, ఫ్రాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షులు ట్రంప్, మేక్రాన్, జెలెన్‌స్కీ, బ్రిటన్ ప్రిన్స్ విలియం వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు.

News May 7, 2025

అన్ని రంగాల్లో పెరుగుతున్న మహిళల పాత్ర: మోదీ

image

దేశంలో అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరుగుతోందని ప్రధాని మోదీ కొనియాడారు. 15వ ఎడిషన్ రోజ్‌గార్ మేళాలో 51,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన అనంతరం ఆయన ప్రసంగించారు. 90 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 10 కోట్ల మంది మహిళలు చేరారని పేర్కొన్నారు. ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. అన్ని రంగాల్లో యువతకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

News May 7, 2025

అప్పుడు లోకల్ ట్రైన్లలో ప్రయాణించా: శ్రుతి హాసన్

image

తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక విడాకులు తనను ఎంతో బాధించాయని హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపారు. దీంతో అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారిగా తలకిందులైందని చెప్పారు. ‘వారు విడిపోయాక నేను అమ్మతో చెన్నై నుంచి ముంబై వెళ్లిపోయా. అప్పటివరకు బెంజ్ కార్లలో తిరిగిన నేను లోకల్ ట్రైన్లలో ప్రయాణించా. ఇండస్ట్రీకి వచ్చాక నాన్నతో కలిసి ఉంటున్నా. సినిమాల్లో నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

News May 7, 2025

వాటికన్ సిటీలోనూ ట్రంప్, జెలెన్‌స్కీ చర్చలు

image

పోప్ ఫ్రాన్సిస్ అంతిమ సంస్కారాలు వాటికన్ సిటీలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన US అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ పోప్‌ పార్థివ‌దేహానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత వారు అక్కడే చర్చలు జరిపినట్లు ఓ ఫొటో SMలో వైరలవుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే అంశంపై వీరిద్దరు పలుమార్లు భేటీ అయ్యారు.

News May 7, 2025

ప్రజల ఆకాంక్షలు తీర్చడమే మా లక్ష్యం: రేవంత్ రెడ్డి

image

TG: రాష్ట్రంలోని రైతులకు రూ.20వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని భారత్ సమ్మిట్ కార్యక్రమంలో తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని, అందుకోసం అనేక పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తదితర నేతలు పాల్గొన్నారు.