India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సబ్బులు, షాంపూలు, టూత్‌బ్రష్‌లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్‌తో పాటు సైకిళ్లపై గతంలో 18% GST ఉండగా ఇప్పుడు 5% శ్లాబులోకి తీసుకొచ్చారు. వెన్న, నెయ్యి, చీజ్, డెయిరీ ప్రొడక్ట్స్, ప్రీ ప్యాకేజ్డ్ నమ్‌కీన్, గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, న్యాప్‌కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% శ్లాబులో ఉండగా ఇప్పుడు 5శాతంలోకి తెచ్చారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలూ ఇందులోనే ఉన్నాయి.
* వ్యక్తిగత, టర్మ్, హెల్త్ బీమా పాలసీలు(18% to 0%)
* మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్(12 to 0)
* పెన్సిల్స్, క్రేయాన్స్, షార్ప్‌నర్స్, పాస్టల్స్(12 to 0)
* ఎక్సర్ సైజ్ బుక్స్, నోట్ బుక్స్(12 to 0)
* 33 ప్రాణాధార ఔషధాలు(12 to 0)
* ఎరేజర్స్(5 to 0)
* ఇండియన్ పరోటా, అన్ని రకాల బ్రెడ్లు
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని రద్దు చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులకు తక్కువ ధరకే హెల్త్, లైఫ్ ప్రీమియంలు లభించనున్నాయి. తద్వారా చాలామంది ఇన్సూరెన్స్‌లు తీసుకునే అవకాశం ఏర్పడనుంది. ఇక లగ్జరీ వస్తువులపై 40శాతం జీఎస్టీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది.
AP: కూటమి ప్రభుత్వం మరో 11 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించింది. ఆయా కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది బోర్డు డైరెక్టర్లను ఎంపిక చేసింది. వీరిలో బీసీలు 42, ఓసీలు 40, ఎస్సీలు 23, మైనార్టీలు 15 మందికి చోటు కల్పించింది.
APలోని హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఎండోమెంట్ చట్టాన్ని సవరించాలని VHP నేతలు CM చంద్రబాబును కోరారు. ఈ మేరకు అందించిన నమూనా డ్రాఫ్టును పరిశీలిస్తానని ఆయన సానుకూలంగా స్పందించినట్లు VHP కేంద్రీయ సంఘటనా కార్యదర్శి మిలింద్ పరాండే, కేంద్రీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు. CMను కలిసిన వారిలో భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేశారంటూ గతంలో జేపీ వెంచర్స్‌కు NGT రూ.18 కోట్లు జరిమానా విధించింది. ఆ ఫైన్‌ను 2 వారాల్లో చెల్లించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో NGT జరిమానాపై గతంలో విధించిన స్టేను ఎత్తేసింది. ఇసుక తవ్వకాలపై నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్‌ను SC స్వీకరించి విచారణ జరిపింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో తమ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. ప్లాట్‌ఫామ్ ఫీజులను భారీగా పెంచాయి. స్విగ్గీ దీన్ని మూడు రెట్లు పెంచుతూ ఆర్డర్‌కు రూ.15 చేసింది. GSTతో కలిపి ఈ అమౌంట్‌ను వసూలు చేయనుంది. జొమాటో 20% పెంచుతూ రూ.12 చేసింది. దీనికి GST అదనం. స్విగ్గీ నిత్యం 20 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తుండగా, జొమాటో 23-25 లక్షల వరకు చేస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా క్రికెటర్ ధోనీ బ్రాండ్ వాల్యూ తగ్గలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అత్యధిక బ్రాండ్లకు(43) అంబాసిడర్‌గా వ్యవహరించిన భారతీయ సెలబ్రిటీ ఆయనే అని TAM AdEx తెలిపింది. షారుఖ్(35), అమితాబ్(28), దీపికా(23) తర్వాతి స్థానాల్లో ఉన్నారని పేర్కొంది. కాగా TVయాడ్స్‌లో రోజులో ఎక్కువగా కనిపించే సెలబ్రిటీల్లో షారుఖ్, ధోనీ తొలి రెండు స్థానాల్లో ఉన్నారని వెల్లడించింది.
* తురకపాలెం <<17599008>>మరణాలపై<<>> మంత్రి సత్యకుమార్ ఫోకస్.. ఫీవర్, ఇన్ఫెక్షన్ కేసులపై ఆరా తీస్తున్న వైద్యబృందం
* టీటీడీ ఆసుపత్రుల్లో సేవ చేసేందుకు భక్తులకు అవకాశం: బీఆర్ నాయుడు
* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం: బొత్స సత్యనారాయణ
* ముగిసిన ఐపీఎస్ అధికారి సంజయ్ రెండో రోజు ACB కస్టడీ.. విజయవాడ జైలు అధికారులకు అప్పగింత
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ‘రేవంత్ వెనుక మోదీ, చంద్రబాబు ఉన్నారు. KCR గెలిస్తే దేశ రాజకీయాల్లోకి వస్తారని వారి భయం. కరెంట్, యూరియా ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ప్రతిపక్షంగా మా బాధ్యతను పూర్తిగా నిర్వహించడం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎక్కువగా ప్రశ్నించాల్సి ఉంది’ అని ఆయన అన్నారు.
Sorry, no posts matched your criteria.