News September 3, 2025

యూరియా సమస్య ఎందుకొచ్చింది: జగన్

image

AP: రైతులకు యూరియా కూడా ఇవ్వలేని అధ్వాన స్థితిలో కూటమి పాలన ఉందని YCP చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ‘బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సీజన్‌లో సాగయ్యే పంటల విస్తీర్ణం, ఎంత మొత్తంలో ఎరువుల పంపిణీ చేయాలనేది ఏటా జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకొచ్చింది? మా పాలనలో ఈ సమస్య రాలేదు. ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.

News September 3, 2025

ఎలాంటి TRS ఎలా అయిపోయింది..

image

ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడిన TRS దాదాపు పదేళ్లు అధికారంతో వర్థిల్లింది. ఆ పార్టీ పేరు చెప్పగానే KCR, హరీశ్‌రావు, KTR, కవితే గుర్తొచ్చేవారు. అలాంటి పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. BRSగా రూపాంతరం చెందడం, 2023 ఎన్నికల్లో ఓటమి పార్టీ రూపురేఖల్ని మార్చింది. ఆపై పలువురు MLAలు BRSను వీడగా, ఇప్పుడు KCR కూతురే దూరమవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News September 3, 2025

సత్యమేవ జయతే: కవిత

image

TG: ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో ట్వీట్ చేశారు. ‘నిజం మాట్లాడినందుకు నాకు దక్కిన బహుమతి ఇదే అయితే.. తెలంగాణ ప్రజల కోసం వంద రెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం. సత్యమేవ జయతే. జై తెలంగాణ’ అని రాసుకొచ్చారు. బీఆర్ఎస్‌ నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్‌గానే ఆమె ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

News September 3, 2025

కవిత.. ఇది పద్ధతి కాదు: నిరంజన్ రెడ్డి

image

TG: బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో హరీశ్ రావు పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. గతంలో హరీశ్‌ను పొగిడిన వారు, ఇప్పుడు విమర్శిస్తున్నారని చెప్పారు. <<17599925>>కవిత<<>> రివర్స్ గేర్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. రేవంత్ కాళ్లు మొక్కి హరీశ్ సరెండర్ అయ్యారంటూ నీచమైన ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. దీని వెనుక ఏం జరిగిందో తెలియట్లేదని, ఇది పద్ధతి కాదన్నారు.

News September 3, 2025

రూ.236.2 కోట్ల‌తో మేడారం అభివృద్ధికి మాస్ట‌ర్ ప్లాన్: సురేఖ

image

TG: మహా జాతరలోపు మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రూ.236.2 కోట్ల‌తో మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. భక్తుల సందర్శనార్థం అమ్మవార్ల గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురాగా ఆ మేర‌కు డిజైన్లు మార్చాలని సూచించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

News September 3, 2025

కూటమి పాలనలో జగన్ ఫొటోతో సర్టిఫికెట్లు!

image

AP: గుంటూరు బ్రాడీపేటలో దివ్యాంగ సర్టిఫికెట్లపై జగన్ ఫొటోలు దర్శనమివ్వడం కలకలం రేపింది. ప్రభుత్వం మారి ఏడాదైనా సచివాలయం సిబ్బంది జగన్ ఫొటోలతోనే ధ్రువపత్రాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది మీడియాలో వైరల్ కావడంతో పైఅధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే వాటిని వెనక్కి తీసుకొని లబ్ధిదారులకు కొత్త సర్టిఫికెట్లు జారీ చేశారు. సదరు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

News September 3, 2025

చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం లేదు: CM రేవంత్

image

TG: BRS అనే పాములో కాలకూట విషం ఉందని CM రేవంత్ ధ్వజమెత్తారు. ‘రూ.లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పంపకాల్లో తేడాలొచ్చి కొట్టుకుంటున్నారు. దోపిడీ సొమ్ము ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. వాళ్లలో వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారు. మంత్రగాడి దగ్గరికి వెళ్లి మీ పంచాయితీ తేల్చుకోండి. BRSను ప్రజలే బొందపెట్టారు. చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేముంది’ అని అన్నారు.

News September 3, 2025

బ్యాంక్‌లో కొలువు కొట్టేయాలంటే..?

image

బ్యాంకు ఉద్యోగాలకు ఏడాది పొడవునా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. మరి ఆ జాబ్ కొట్టాలంటే అర్థమెటిక్, రీజనింగ్‌‌, ఆంగ్లంలో పట్టు ఉంటే సరిపోదు. పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాలి. ప్రణాళిక ప్రకారం చదవాలి. ప్రాక్టీస్‌లో గ్యాప్ ఇవ్వొద్దు. వీక్ టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయగలగాలి. మ్యాథ్స్ క్వశ్చన్స్‌కి జవాబులు తేవడం సులువే! కానీ జాబ్ రావాలంటే.. ఫాస్ట్‌గా ఆన్సర్ చేయడం చాలా ముఖ్యం.

News September 3, 2025

విద్యార్థులకు రూ.12,000.. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

AP: పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం NMMS పేరుతో నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12వేల చొప్పున అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షకు రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు సాయం అందనుంది. పూర్తి వివరాలకు <>వెబ్‌సైట్‌<<>>ను సంప్రదించండి.

News September 3, 2025

ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల.. మీ పేరు చెక్ చేసుకోండి

image

తెలంగాణ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తుది ఓటర్ జాబితాను విడుదల చేసింది. ఓటర్లు ఇక్కడ <>క్లిక్<<>> చేసి తమ ఓటును చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు గతనెల 31న వాటిని పరిశీలించారు. అనంతరం ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. ఈ జాబితా ప్రకారమే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనుంది.