India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొందరికి చిన్న వయసులోనే ముడతలు వచ్చి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. పోషకాహారం తీసుకుంటే నవ యవ్వనంతో మెరిసిపోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘టమాటాలు తీసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది. బ్లూ చెర్రీ, గ్రీన్ టీతో కొత్త చర్మకణాలు ఉత్పత్తి అవుతాయి. పెరుగు తింటే చర్మం ఎర్రగా మారదు. బాదం, పిస్తా వంటివి తింటే చర్మ సమస్యలు తగ్గుతాయి. నీళ్లు ఎక్కువగా తాగితే యవ్వనంగా కనిపిస్తారు’ అని అంటున్నారు.
AP: నిరుపయోగంగా ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను మెంటల్ ఆసుపత్రిగా మార్చడం మంచిదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సలహా ఇచ్చారు. ఆ భవనంలో పెచ్చులు ఊడాయని తెలిసిందన్నారు. ఈ ప్యాలెస్‌ను ఏం చేస్తే మంచిదో ప్రజలే చెప్పాలని ఆయన కోరారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో క్షత్రియ సేవా సమితి విశాఖలో అశోక్ గజపతిరాజును సత్కరించింది.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై నార్సింగి PSలో మరోసారి కేసు నమోదైంది. జూన్ 30న రాజ్ తరుణ్ అనుచరులతో కలిసి తన కుటుంబసభ్యులపై దాడి చేశారని మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కను చంపారని ఆరోపించారు. ఈ ఘటనలో తన తండ్రి గాయపడినట్లు తెలిపారు. ఇది సైబరాబాద్ సీపీ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాలతో నార్సింగి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
AP: రైతులకు యూరియా కూడా ఇవ్వలేని అధ్వాన స్థితిలో కూటమి పాలన ఉందని YCP చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ‘బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సీజన్‌లో సాగయ్యే పంటల విస్తీర్ణం, ఎంత మొత్తంలో ఎరువుల పంపిణీ చేయాలనేది ఏటా జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకొచ్చింది? మా పాలనలో ఈ సమస్య రాలేదు. ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడిన TRS దాదాపు పదేళ్లు అధికారంతో వర్థిల్లింది. ఆ పార్టీ పేరు చెప్పగానే KCR, హరీశ్‌రావు, KTR, కవితే గుర్తొచ్చేవారు. అలాంటి పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. BRSగా రూపాంతరం చెందడం, 2023 ఎన్నికల్లో ఓటమి పార్టీ రూపురేఖల్ని మార్చింది. ఆపై పలువురు MLAలు BRSను వీడగా, ఇప్పుడు KCR కూతురే దూరమవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
TG: ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో ట్వీట్ చేశారు. ‘నిజం మాట్లాడినందుకు నాకు దక్కిన బహుమతి ఇదే అయితే.. తెలంగాణ ప్రజల కోసం వంద రెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం. సత్యమేవ జయతే. జై తెలంగాణ’ అని రాసుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్‌గానే ఆమె ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
TG: బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో హరీశ్ రావు పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. గతంలో హరీశ్‌ను పొగిడిన వారు, ఇప్పుడు విమర్శిస్తున్నారని చెప్పారు. <<17599925>>కవిత<<>> రివర్స్ గేర్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. రేవంత్ కాళ్లు మొక్కి హరీశ్ సరెండర్ అయ్యారంటూ నీచమైన ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. దీని వెనుక ఏం జరిగిందో తెలియట్లేదని, ఇది పద్ధతి కాదన్నారు.
TG: మహా జాతరలోపు మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రూ.236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. భక్తుల సందర్శనార్థం అమ్మవార్ల గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా ఆ మేరకు డిజైన్లు మార్చాలని సూచించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
AP: గుంటూరు బ్రాడీపేటలో దివ్యాంగ సర్టిఫికెట్లపై జగన్ ఫొటోలు దర్శనమివ్వడం కలకలం రేపింది. ప్రభుత్వం మారి ఏడాదైనా సచివాలయం సిబ్బంది జగన్ ఫొటోలతోనే ధ్రువపత్రాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది మీడియాలో వైరల్ కావడంతో పైఅధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే వాటిని వెనక్కి తీసుకొని లబ్ధిదారులకు కొత్త సర్టిఫికెట్లు జారీ చేశారు. సదరు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
TG: BRS అనే పాములో కాలకూట విషం ఉందని CM రేవంత్ ధ్వజమెత్తారు. ‘రూ.లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పంపకాల్లో తేడాలొచ్చి కొట్టుకుంటున్నారు. దోపిడీ సొమ్ము ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. వాళ్లలో వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారు. మంత్రగాడి దగ్గరికి వెళ్లి మీ పంచాయితీ తేల్చుకోండి. BRSను ప్రజలే బొందపెట్టారు. చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేముంది’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.