News September 3, 2025

బ్యాంక్‌లో కొలువు కొట్టేయాలంటే..?

image

బ్యాంకు ఉద్యోగాలకు ఏడాది పొడవునా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. మరి ఆ జాబ్ కొట్టాలంటే అర్థమెటిక్, రీజనింగ్‌‌, ఆంగ్లంలో పట్టు ఉంటే సరిపోదు. పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాలి. ప్రణాళిక ప్రకారం చదవాలి. ప్రాక్టీస్‌లో గ్యాప్ ఇవ్వొద్దు. వీక్ టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయగలగాలి. మ్యాథ్స్ క్వశ్చన్స్‌కి జవాబులు తేవడం సులువే! కానీ జాబ్ రావాలంటే.. ఫాస్ట్‌గా ఆన్సర్ చేయడం చాలా ముఖ్యం.

News September 3, 2025

విద్యార్థులకు రూ.12,000.. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

AP: పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం NMMS పేరుతో నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12వేల చొప్పున అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షకు రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు సాయం అందనుంది. పూర్తి వివరాలకు <>వెబ్‌సైట్‌<<>>ను సంప్రదించండి.

News September 3, 2025

ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల.. మీ పేరు చెక్ చేసుకోండి

image

తెలంగాణ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తుది ఓటర్ జాబితాను విడుదల చేసింది. ఓటర్లు ఇక్కడ <>క్లిక్<<>> చేసి తమ ఓటును చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు గతనెల 31న వాటిని పరిశీలించారు. అనంతరం ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. ఈ జాబితా ప్రకారమే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనుంది.

News September 3, 2025

పలు జిల్లాల్లో వరుసగా 3 రోజులు సెలవులు

image

TG: ఈ వారంలో పలు జిల్లాల్లో వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 5న మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రాష్ట్రమంతా పబ్లిక్ హాలిడే ఉంది. మరుసటి రోజు శనివారం గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో HYD, సికింద్రాబాద్, RR, మేడ్చల్‌లో సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఉంటుందని పేర్కొంది. ఇక 7న ఆదివారం వస్తోంది. అటు ఏపీలో 5న సెలవు ఉంది.

News September 3, 2025

తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర ఒడిశాతో పాటు ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్ వైపుగా కదిలే అవకాశముందని APSDMA ట్వీట్ చేసింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు కృష్ణా పరీవాహకంలో వరద తగ్గుముఖం పట్టిందని, గోదావరి పరీవాహకంలో స్వల్పంగా పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News September 3, 2025

కేంద్ర క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జీఎస్టీ శ్లాబుల మార్పులపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆక్వా రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే ట్రంప్ విధించిన సుంకాల వల్ల ప్రభావం పడే వస్తువుల విషయంలోనూ చర్చించనున్నారు. రైతులు, ఉద్యోగులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News September 3, 2025

ట్రాఫిక్ సమస్యను తీర్చిన ‘సింగపూర్ మోడల్’!

image

ఇండియాలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. 1975లో ఇలాంటి సమస్యే సింగపూర్‌లో ఎదురవగా వినూత్న ఆలోచనతో పరిష్కరించారు. నగరంలోని రద్దీ ఉండే ప్రాంతాలను ‘నియంత్రిత మండలం’గా గుర్తించి, ఇందులో ప్రవేశానికి ప్రత్యేక లైసెన్స్, నెలవారీ రుసుము పెట్టారు. సింగిల్‌గా కాకుండా కారులో నలుగురు ఉంటే ఆ లైసెన్స్ అక్కర్లేదు. దీంతో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గి ట్రాఫిక్ సజావుగా సాగింది.

News September 3, 2025

లిక్కర్ స్కాం.. డొల్ల కంపెనీల వివరాలు వెలుగులోకి

image

AP: లిక్కర్ స్కాం కేసులో సిట్ సోదాల్లో డొల్ల కంపెనీల వివరాలు బయటపడుతున్నాయి. రికార్డుల్లో ఉన్న కంపెనీ, అక్కడున్న కంపెనీ పేరు ఒకటి కాదని తెలుస్తోంది. HYDలో భీం స్పేస్ ఆఫీసుకు వెళ్తే ఇషా ఇన్‌ఫ్రా పేరుతో బోర్డు ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీని డైరెక్టర్లుగా సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న ఉన్నారని తెలిపింది. ఇటీవల ఎన్నికల్లో పట్టుబడిన రూ.8cr తనవే అని ప్రద్యుమ్న క్లెయిమ్ చేసినట్లు వార్తలొచ్చాయి.

News September 3, 2025

ఆ వెబ్‌సైట్లలో నా ఫొటోలు తొలగించండి: సోనాక్షి సిన్హా

image

అనుమతి లేకుండా ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో తన ఫొటోలు పెట్టడంపై హీరోయిన్ సోనాక్షి సిన్హా ఫైరయ్యారు. యాక్టర్‌గా పలు బ్రాండ్ల డ్రెస్సులు, జ్యువెలరీని ధరించి క్రెడిట్స్‌తో ఫొటోలు పోస్ట్ చేసినంత మాత్రాన, ఆ ఫొటోలను ఆయా సైట్లు వాడుకోవడం సరికాదన్నారు. వెంటనే తొలగించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బొద్దుగుమ్మ సుధీర్ బాబు ‘జటాధార’ సినిమాలో నటిస్తున్నారు.

News September 3, 2025

సోషల్ మీడియాలో బయో మార్చుకున్న కవిత

image

TG: బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత Xలో బయోను మార్చుకున్నారు. ఇంతకుముందు కామారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి ఫౌండర్ అని ఉండేది. తాజాగా మాజీ ఎంపీ, జాగృతి ఫౌండర్ అని మార్చారు. రెండు రోజుల తర్వాత ఆమె భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ప్రెస్‌మీట్‌లో తెలిపారు.