India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో యూరియా సమస్య గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ‘టన్ను ఆయిల్ ఫామ్ గెలలకు రూ.25వేల మద్దతు ధరతో పాటు వాటిపై దిగుమతి సుంకాన్ని 44% పెంచాలి. వ్యవసాయ యంత్రాలు, మైక్రో ఇరిగేషన్ పరికరాలపై 12% GSTని మినహాయించాలి. పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాలపై సబ్సిడీ పెంచి యూరియాతో సమాన ధరకు అందివ్వాలి’ అని ఢిల్లీ పర్యటనలో తుమ్మల కోరారు.
పొరపాటున వేరొకరికి డబ్బులు పంపిస్తుంటాం. అలాంటి సమయంలో వేగంగా స్పందించి కంప్లైంట్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ట్రాన్సాక్షన్ ఐడీ, తేదీ, ఎమౌంట్ చెప్పాలి. అలాగే NPCI <
TG: ప్రెస్‌మీట్ తర్వాత మీడియా చిట్‌చాట్‌లో కవిత సంచలన కామెంట్స్ చేశారు. ‘మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వచ్చాయి. కానీ హరీశ్, సంతోష్‌లకు రాలేదు. KTRకు సంబంధించినవారి ఫోన్లూ ట్యాప్ అయ్యాయి. ట్యాపింగ్ చేయించిందే హరీశ్, సంతోష్, శ్రవణ్ రావు’ అని తెలిపారు. ఇక తన లేఖను ఓ టీవీ ఛానెల్‌కు లీక్ చేసిందే సంతోష్ రావు అని, కాంగ్రెస్ నేతలకూ ఆయనే పంపించాడని కవిత ఆరోపించారు.
TG: ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, BRS నాయకులు కుమ్మక్కై కవిత ఎపిసోడ్ తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి 2 పార్టీలు డ్రామా ఆడుతున్నాయి. కవిత రాజీనామాతో రాష్ట్ర ప్రజలకు ఏమీ రాదు. కాళేశ్వరం అవినీతి గురించి మొదటి నుంచీ చెబుతున్నాం. ఇప్పుడు దాన్నే కవిత ప్రస్తావిస్తున్నారు. ఆమె వద్ద ఆధారాలు ఉంటే CBIకి ఇవ్వాలి’ అని అన్నారు.
TG: ఎన్నికల సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ చెప్పి మరీ నిజాయితీగా మోసం చేశారని ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో అద్భుతాలు సాధించిందన్నారు. కానీ 21 నెలల కాంగ్రెస్ పాలనతో ఏ వర్గమూ సంతోషంగా లేదని విమర్శించారు. యూరియా సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
చాలామంది చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నాణ్యతలేని హెల్మెట్లను వాడి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రక్షణనిచ్చే నాణ్యమైన హెల్మెట్లను వాడాలని TG పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. ‘ISI మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే వాడండి. నాసిరకం హెల్మెట్లతో రక్షణ ఉండదు. చలాన్ తప్పించుకునేందుకు కాకుండా రక్షణ కోసం మంచి హెల్మెట్ వాడండి. హెల్మెట్ మీ రక్షణ కవచమని గుర్తుంచుకోండి’ అని పేర్కొన్నారు.
TG: అవినీతిపై ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ విడిచిన బాణం <<17599925>>కవిత<<>> కావొచ్చని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌పై కవిత స్టాండ్ ఎందుకు మారిందో అర్థం కావడం లేదన్నారు. బాణం హరీశ్ రావు వైపు ఎందుకు తిరిగిందో తెలియడం లేదని సెటైర్లు వేశారు. ఇవాళ కవిత కొన్ని సత్యాలు, అసత్యాలు మాట్లాడారని అన్నారు. ఆమెకు తెలియకుండానే బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు.
AP: లిక్కర్ స్కాం కేసులో తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(ఏ38), చిత్తూరులోని YCP నేత విజయానందరెడ్డి ఇళ్లలో సిట్ తనిఖీలు చేస్తోంది. గత ఎన్నికల్లో చిత్తూరు MLA అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డిని ఇటీవల విజయవాడకు పిలిపించిన సిట్ 2రోజులు ప్రశ్నించింది. ఆ సమయంలో చెప్పిన సమాధానాలు, ఆయన ఇంటి అడ్రస్సులో CBR ఇన్‌ఫ్రా కంపెనీ ఉండటంతో వాటి ఆధారంగా సోదాలు జరుగుతున్నాయి.
ఇవాళ ప్రెస్‌మీట్‌లో అనేక ఆరోపణలు, అంశాలు ప్రస్తావించిన కవిత ఓ ప్రశ్న కూడా సంధించారు. అది అందర్నీ ఆలోచనలో పడేసింది. ‘నా ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలు తగులబెట్టిన BRS కార్యకర్తలు KCRపై CBI దర్యాప్తు చేయిస్తామని రేవంత్ అంటే ఎందుకు నిరసన తెలపలేదు’ అని ప్రశ్నించారు. ఉద్యమ పార్టీ BRSకి ఎన్నో నిరసనలు, ఆందోళనలు చేసిన చరిత్ర ఉంది. ఆ పార్టీ ఇప్పుడు ఎందుకు సరిగా స్పందించలేదని ప్రజలూ సమాధానం కోసం చూస్తున్నారు.
ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రజా అగ్రస్థానంలో నిలిచారు. 302 పాయింట్లతో ఆయన టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. టాప్-5లో ఒమర్జాయ్, మహ్మద్ నబీ, మెహిదీ హసన్, బ్రేస్‌వెల్ ఉన్నారు. భారత్ నుంచి టాప్-10లో రవీంద్ర జడేజా(9) ఒక్కరే ఉన్నారు. బ్యాటర్ల జాబితాలో గిల్, రోహిత్ టాప్-2లో ఉన్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.