News September 3, 2025

ఫోన్ ట్యాపింగ్ చేయించిందే హరీశ్, సంతోష్: కవిత

image

TG: ప్రెస్‌మీట్ తర్వాత మీడియా చిట్‌చాట్‌లో కవిత సంచలన కామెంట్స్ చేశారు. ‘మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వచ్చాయి. కానీ హరీశ్, సంతోష్‌లకు రాలేదు. KTRకు సంబంధించినవారి ఫోన్లూ ట్యాప్ అయ్యాయి. ట్యాపింగ్ చేయించిందే హరీశ్, సంతోష్, శ్రవణ్ రావు’ అని తెలిపారు. ఇక తన లేఖను ఓ టీవీ ఛానెల్‌కు లీక్ చేసిందే సంతోష్ రావు అని, కాంగ్రెస్ నేతలకూ ఆయనే పంపించాడని కవిత ఆరోపించారు.

News September 3, 2025

కవిత రాజీనామాతో రాష్ట్ర ప్రజలకు ఏమీ రాదు: బండి సంజయ్

image

TG: ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌, BRS నాయకులు కుమ్మక్కై కవిత ఎపిసోడ్ తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి 2 పార్టీలు డ్రామా ఆడుతున్నాయి. కవిత రాజీనామాతో రాష్ట్ర ప్రజలకు ఏమీ రాదు. కాళేశ్వరం అవినీతి గురించి మొదటి నుంచీ చెబుతున్నాం. ఇప్పుడు దాన్నే కవిత ప్రస్తావిస్తున్నారు. ఆమె వద్ద ఆధారాలు ఉంటే CBIకి ఇవ్వాలి’ అని అన్నారు.

News September 3, 2025

ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచింది: KTR

image

TG: ఎన్నికల సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ చెప్పి మరీ నిజాయితీగా మోసం చేశారని ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో అద్భుతాలు సాధించిందన్నారు. కానీ 21 నెలల కాంగ్రెస్ పాలనతో ఏ వర్గమూ సంతోషంగా లేదని విమర్శించారు. యూరియా సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

News September 3, 2025

చలాన్ కోసం కాదు.. రక్షణ కోసం హెల్మెట్ వాడండి: పోలీసులు

image

చాలామంది చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నాణ్యతలేని హెల్మెట్లను వాడి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రక్షణనిచ్చే నాణ్యమైన హెల్మెట్లను వాడాలని TG పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. ‘ISI మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే వాడండి. నాసిరకం హెల్మెట్లతో రక్షణ ఉండదు. చలాన్ తప్పించుకునేందుకు కాకుండా రక్షణ కోసం మంచి హెల్మెట్ వాడండి. హెల్మెట్ మీ రక్షణ కవచమని గుర్తుంచుకోండి’ అని పేర్కొన్నారు.

News September 3, 2025

కవిత KCR విడిచిన బాణం కావొచ్చు: మహేశ్ గౌడ్

image

TG: అవినీతిపై ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ విడిచిన బాణం <<17599925>>కవిత<<>> కావొచ్చని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌పై కవిత స్టాండ్ ఎందుకు మారిందో అర్థం కావడం లేదన్నారు. బాణం హరీశ్ రావు వైపు ఎందుకు తిరిగిందో తెలియడం లేదని సెటైర్లు వేశారు. ఇవాళ కవిత కొన్ని సత్యాలు, అసత్యాలు మాట్లాడారని అన్నారు. ఆమెకు తెలియకుండానే బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు.

News September 3, 2025

లిక్కర్ స్కాం.. చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు

image

AP: లిక్కర్ స్కాం కేసులో తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(ఏ38), చిత్తూరులోని YCP నేత విజయానందరెడ్డి ఇళ్లలో సిట్ తనిఖీలు చేస్తోంది. గత ఎన్నికల్లో చిత్తూరు MLA అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డిని ఇటీవల విజయవాడకు పిలిపించిన సిట్ 2రోజులు ప్రశ్నించింది. ఆ సమయంలో చెప్పిన సమాధానాలు, ఆయన ఇంటి అడ్రస్సులో CBR ఇన్‌ఫ్రా కంపెనీ ఉండటంతో వాటి ఆధారంగా సోదాలు జరుగుతున్నాయి.

News September 3, 2025

కవిత ప్రశ్న.. సమాధానం ఎక్కడ..?

image

ఇవాళ ప్రెస్‌మీట్‌లో అనేక ఆరోపణలు, అంశాలు ప్రస్తావించిన కవిత ఓ ప్రశ్న కూడా సంధించారు. అది అందర్నీ ఆలోచనలో పడేసింది. ‘నా ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలు తగులబెట్టిన BRS కార్యకర్తలు KCRపై CBI దర్యాప్తు చేయిస్తామని రేవంత్ అంటే ఎందుకు నిరసన తెలపలేదు’ అని ప్రశ్నించారు. ఉద్యమ పార్టీ BRSకి ఎన్నో నిరసనలు, ఆందోళనలు చేసిన చరిత్ర ఉంది. ఆ పార్టీ ఇప్పుడు ఎందుకు సరిగా స్పందించలేదని ప్రజలూ సమాధానం కోసం చూస్తున్నారు.

News September 3, 2025

ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా రజా

image

ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రజా అగ్రస్థానంలో నిలిచారు. 302 పాయింట్లతో ఆయన టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. టాప్-5లో ఒమర్జాయ్, మహ్మద్ నబీ, మెహిదీ హసన్, బ్రేస్‌వెల్ ఉన్నారు. భారత్ నుంచి టాప్-10లో రవీంద్ర జడేజా(9) ఒక్కరే ఉన్నారు. బ్యాటర్ల జాబితాలో గిల్, రోహిత్ టాప్-2లో ఉన్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

News September 3, 2025

రేవంత్, హరీశ్ కుమ్మక్కయ్యారని ముందే చెప్పా: రఘునందన్

image

TG: రేవంత్, హరీశ్ కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పానని BJP ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కవిత కొత్తగా చెప్పిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎపిసోడ్‌లో BRS బడా నేతల అవినీతి బయటపెడితే బాగుంటుందన్నారు. మరోవైపు KCRకు కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదని, పార్టీయే ముఖ్యమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కవిత అంశంపై స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని గుర్తుచేశారు.

News September 3, 2025

రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘కొత్త లోక’

image

‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ‘కొత్త లోక’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. లో బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఫస్ట్ వీక్‌లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. డొమినిక్ అరుణ్ రూపొందించిన ఈ మూవీని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. గత నెల 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. హీరోయిన్‌కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ.