News May 7, 2025

రోజూ గుడ్డు తింటున్నారా?

image

ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గుడ్డులో 6-7 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా కణజాల మరమ్మతులో సాయం చేస్తుంది. ఇందులోని కోలిన్ మెదడుకు మేలు చేస్తుంది. పచ్చసొన కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇది తినడం వల్ల ఊబకాయ ప్రమాదం తగ్గుతుంది. గుడ్లలోని విటమిన్ డి, కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

News May 7, 2025

భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం: ప్రపంచ బ్యాంకు

image

భారత్‌లో 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో 17.1కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి, 37.8కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ‘గత దశాబ్దకాలంలో ఇండియాలో చాలావరకు పేదరికం తగ్గింది. అత్యంత పేదరికం 16.2% నుంచి 2.3 శాతానికి పడిపోయింది. రూరల్‌లో 18.4% నుంచి 2.8%, అర్బన్‌లో 10.7% నుంచి 1.1%కి చేరింది’ అని పేర్కొంది. భారత్ లోయర్-మిడిల్-ఇన్‌కమ్ క్యాటగిరీలోకి వచ్చిందని తెలిపింది.

News May 7, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 37 మంది మృతి?

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో కాల్పుల మోత మోగుతోంది. వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు భారీ కూంబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 37 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐదు రోజులుగా భద్రతా దళాలు ఇక్కడ అడవిని జల్లెడ పడుతున్నాయి.

News May 7, 2025

సభ రద్దు ప్రచారం ఫేక్: BRS

image

TG: పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రేపు వరంగల్‌లో జరగనున్న BRS రజతోత్సవ సభ రద్దు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని BRS పార్టీ ఖండించింది. SMలో వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని, సభ యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రజల నుంచి వస్తున్న అపూర్వమైన ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీలు ఫేక్ ప్రచారాలకు ఒడిగట్టాయని మండిపడింది. ఈ సభతో ఆ రెండు జాతీయ పార్టీలు భూస్థాపితం కావడం ఖాయమని తేల్చి చెప్పింది.

News May 7, 2025

పెద్దిరెడ్డి కుటుంబం ముఠామేస్త్రిలా వ్యవహరిస్తోంది: రాంప్రసాద్ రెడ్డి

image

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూములకు సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ‘రాయలసీమలో ఆయన కుటుంబం ముఠామేస్త్రిలా వ్యవహరిస్తోంది. మదనపల్లి ఫైల్స్ పేరుతో సినిమా తీయొచ్చు. మాధవరెడ్డి అరెస్టుతో ఆ కేసు కొలిక్కి వచ్చింది. ఆలస్యమైనా తప్పులు చేసిన వారిని జైలుకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జగన్‌కు రాజ్ కసిరెడ్డి అత్యంత సన్నిహితుడు’ అని మంత్రి అన్నారు.

News May 7, 2025

వచ్చే సీజన్‌పై ధోనీ దృష్టి: రాయుడు

image

IPL: ఈ సీజన్‌లో CSK ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు స్పందించారు. ‘చెన్నై దారుణంగా ఆడుతోంది. అయితే దీని నుంచి చాలా నేర్చుకునే అవకాశం ఉంది. భవిష్యత్‌పై దృష్టి పెట్టకపోతే ఇదే జరుగుతుంది. ఇక నుంచి మేనేజ్‌మెంట్ చాలా అప్రమత్తంగా ఉంటుంది. గేమ్ ఎంతలా మారిపోయిందో ధోనీ కూడా అర్థం చేసుకున్నారు. వచ్చే సీజ‌న్‌కు టీమ్‌ను బలోపేతం చేయడంపై ధోనీ ఇప్పటికే ఆలోచన మొదలుపెట్టుంటారు’ అని వ్యాఖ్యానించారు.

News May 7, 2025

BRS సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది: KTR

image

TG: రేపు నిర్వహించనున్న బీఆర్ఎస్ వరంగల్ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చారిత్రక సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

News May 7, 2025

ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం

image

పహల్గామ్ ఉగ్రదాడి నుంచి బయటపడ్డ మహారాష్ట్ర వాసి శ్రీజిత్ NIAకి కీలక సమాచారం ఇచ్చారు. తన కుమార్తె డాన్స్ వీడియోలో ఇద్దరు అనుమానితులను ఆయన గుర్తించారు. దీంతో ఆ దిశగా NIA విచారణ చేపట్టింది. దాడికి ముందు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు తేల్చింది. బైసరన్ లోయలో ఇద్దరు అనుమానితులను గుర్తించగా, దాడికి పాల్పడిన వారిలో వారు ఉన్నట్లు అనుమానిస్తోంది.

News May 7, 2025

BRS సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది: KTR

image

TG: రేపు నిర్వహించనున్న బీఆర్ఎస్ వరంగల్ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చారిత్రక సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

News May 7, 2025

రాష్ట్రంలో బార్ల లైసెన్సు ఫీజులు తగ్గింపు

image

AP: టూరిజం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం బార్ల లైసెన్స్ ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించింది. బార్ల లైసెన్స్‌ ఫీజు రూ.5 లక్షలు, 3, 5 స్టార్ హోటళ్ల రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించేసింది. నాన్ రిఫండబుల్ ఛార్జీని రూ.20 లక్షలుగా పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.