News September 3, 2025

ట్రాఫిక్ సమస్యను తీర్చిన ‘సింగపూర్ మోడల్’!

image

ఇండియాలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. 1975లో ఇలాంటి సమస్యే సింగపూర్‌లో ఎదురవగా వినూత్న ఆలోచనతో పరిష్కరించారు. నగరంలోని రద్దీ ఉండే ప్రాంతాలను ‘నియంత్రిత మండలం’గా గుర్తించి, ఇందులో ప్రవేశానికి ప్రత్యేక లైసెన్స్, నెలవారీ రుసుము పెట్టారు. సింగిల్‌గా కాకుండా కారులో నలుగురు ఉంటే ఆ లైసెన్స్ అక్కర్లేదు. దీంతో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గి ట్రాఫిక్ సజావుగా సాగింది.

News September 3, 2025

లిక్కర్ స్కాం.. డొల్ల కంపెనీల వివరాలు వెలుగులోకి

image

AP: లిక్కర్ స్కాం కేసులో సిట్ సోదాల్లో డొల్ల కంపెనీల వివరాలు బయటపడుతున్నాయి. రికార్డుల్లో ఉన్న కంపెనీ, అక్కడున్న కంపెనీ పేరు ఒకటి కాదని తెలుస్తోంది. HYDలో భీం స్పేస్ ఆఫీసుకు వెళ్తే ఇషా ఇన్‌ఫ్రా పేరుతో బోర్డు ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీని డైరెక్టర్లుగా సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న ఉన్నారని తెలిపింది. ఇటీవల ఎన్నికల్లో పట్టుబడిన రూ.8cr తనవే అని ప్రద్యుమ్న క్లెయిమ్ చేసినట్లు వార్తలొచ్చాయి.

News September 3, 2025

ఆ వెబ్‌సైట్లలో నా ఫొటోలు తొలగించండి: సోనాక్షి సిన్హా

image

అనుమతి లేకుండా ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో తన ఫొటోలు పెట్టడంపై హీరోయిన్ సోనాక్షి సిన్హా ఫైరయ్యారు. యాక్టర్‌గా పలు బ్రాండ్ల డ్రెస్సులు, జ్యువెలరీని ధరించి క్రెడిట్స్‌తో ఫొటోలు పోస్ట్ చేసినంత మాత్రాన, ఆ ఫొటోలను ఆయా సైట్లు వాడుకోవడం సరికాదన్నారు. వెంటనే తొలగించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బొద్దుగుమ్మ సుధీర్ బాబు ‘జటాధార’ సినిమాలో నటిస్తున్నారు.

News September 3, 2025

సోషల్ మీడియాలో బయో మార్చుకున్న కవిత

image

TG: బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత Xలో బయోను మార్చుకున్నారు. ఇంతకుముందు కామారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి ఫౌండర్ అని ఉండేది. తాజాగా మాజీ ఎంపీ, జాగృతి ఫౌండర్ అని మార్చారు. రెండు రోజుల తర్వాత ఆమె భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

News September 3, 2025

రానున్న 2-3 గంటల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడుతుందని పేర్కొంది.

News September 3, 2025

యూరియా సమస్యను కేంద్ర మంత్రికి వివరించిన తుమ్మల

image

TG: రాష్ట్రంలో యూరియా సమస్య గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ‘టన్ను ఆయిల్ ఫామ్ గెలలకు రూ.25వేల మద్దతు ధరతో పాటు వాటిపై దిగుమతి సుంకాన్ని 44% పెంచాలి. వ్యవసాయ యంత్రాలు, మైక్రో ఇరిగేషన్ పరికరాలపై 12% GSTని మినహాయించాలి. పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాలపై సబ్సిడీ పెంచి యూరియాతో సమాన ధరకు అందివ్వాలి’ అని ఢిల్లీ పర్యటనలో తుమ్మల కోరారు.

News September 3, 2025

అనుకోకుండా వేరొకరికి డబ్బు పంపారా?

image

పొరపాటున వేరొకరికి డబ్బులు పంపిస్తుంటాం. అలాంటి సమయంలో వేగంగా స్పందించి కంప్లైంట్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ట్రాన్సాక్షన్ ఐడీ, తేదీ, ఎమౌంట్ చెప్పాలి. అలాగే NPCI <>వెబ్‌సైట్‌లోకి<<>> వెళ్లి UPI Transaction> Grievance Redressal> Incorrectly transferred to another accountపై క్లిక్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు. NOTE: డబ్బు పంపేముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.

News September 3, 2025

ఫోన్ ట్యాపింగ్ చేయించిందే హరీశ్, సంతోష్: కవిత

image

TG: ప్రెస్‌మీట్ తర్వాత మీడియా చిట్‌చాట్‌లో కవిత సంచలన కామెంట్స్ చేశారు. ‘మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వచ్చాయి. కానీ హరీశ్, సంతోష్‌లకు రాలేదు. KTRకు సంబంధించినవారి ఫోన్లూ ట్యాప్ అయ్యాయి. ట్యాపింగ్ చేయించిందే హరీశ్, సంతోష్, శ్రవణ్ రావు’ అని తెలిపారు. ఇక తన లేఖను ఓ టీవీ ఛానెల్‌కు లీక్ చేసిందే సంతోష్ రావు అని, కాంగ్రెస్ నేతలకూ ఆయనే పంపించాడని కవిత ఆరోపించారు.

News September 3, 2025

కవిత రాజీనామాతో రాష్ట్ర ప్రజలకు ఏమీ రాదు: బండి సంజయ్

image

TG: ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌, BRS నాయకులు కుమ్మక్కై కవిత ఎపిసోడ్ తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి 2 పార్టీలు డ్రామా ఆడుతున్నాయి. కవిత రాజీనామాతో రాష్ట్ర ప్రజలకు ఏమీ రాదు. కాళేశ్వరం అవినీతి గురించి మొదటి నుంచీ చెబుతున్నాం. ఇప్పుడు దాన్నే కవిత ప్రస్తావిస్తున్నారు. ఆమె వద్ద ఆధారాలు ఉంటే CBIకి ఇవ్వాలి’ అని అన్నారు.

News September 3, 2025

ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచింది: KTR

image

TG: ఎన్నికల సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ చెప్పి మరీ నిజాయితీగా మోసం చేశారని ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో అద్భుతాలు సాధించిందన్నారు. కానీ 21 నెలల కాంగ్రెస్ పాలనతో ఏ వర్గమూ సంతోషంగా లేదని విమర్శించారు. యూరియా సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.