India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తేది: నవంబర్ 1, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:15 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ తేది: నవంబర్ 1, శుక్రవారం
✒ అమావాస్య: సాయంత్రం 6.16 గంటలకు
✒ స్వాతి: తెల్లవారుజామున 3.30 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 6.59-8.46 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 8.24-9.10 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.13-12.59 గంటల వరకు
➢సైనికులతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు
➢దేశ వ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు
➢IPL: రిటెన్షన్ ప్లేయర్ల జాబితా విడుదల
➢రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
➢ఏపీలో రెన్యువబుల్ ఎనర్జీ జోన్లు
➢AP: మద్యం ధరల నిర్ణయంపై టెండర్ కమిటీ: మంత్రి కొల్లు
➢అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చు: మంత్రి నిమ్మల
➢TG: 2025లో జనంలోకి కేసీఆర్: KTR
➢తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు
అమెరికా-భారత్ జాతీయ భద్రతా సలహాదారులు జేక్ సలవిన్- అజిత్ ధోవల్ మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ సంభాషణలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చించినట్టు తెలిపింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత కొనసాగింపు సహా ప్రాంతీయ భదత్రా పరిణామాలను వీరు విశ్లేషించారు. భారత్-చైనా మధ్య తూర్పు లద్దాక్‌లో డిస్ఎంగేజ్మెంట్ పూర్తయ్యాక ఈ భేటీ జరగడం గమనార్హం.
AP: ప్రపంచంలో తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్ లాంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించరని మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదన్నారు. పోలవరం ఎత్తుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చని చురకలంటించారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది జగన్ కాదా అని నిలదీశారు.
బాలీవుడ్ ప్రేమజంట అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీపావళి పార్టీలో తాను సింగిల్ అంటూ అర్జున్ చేసిన <<14479913>>వ్యాఖ్యలు<<>> ఇందుకు బలం చేకూర్చాయి. ఈ నేపథ్యంలో మలైకా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘హృదయాన్ని ఒక్క సెకను తాకితే అది జీవితాంతం ఆత్మను తాకవచ్చు’ అని ఆమె రాసుకొచ్చారు. దీనికి అర్థమేమిటి? తన లవ్ లైఫ్ గురించేనా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
AP: దీపావళి పండుగ రోజున కాకినాడ జిల్లాలో ఘర్షణ చెలరేగింది. కాజులూరు(మ) సలపాకలో ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకోగా, ముగ్గురు చనిపోయారు. పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వాగ్వాదం దాడి చేసుకునే వరకూ వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అత్యాచారానికి గురైన 11 ఏళ్ల బాలిక గర్భం దాల్చడంతో ఆమె 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు బాంబే హైకోర్టు అనుమతించింది. బాలిక కడుపు ఇన్ఫెక్షన్ల వల్ల ఉబ్బిందని తల్లిదండ్రులు మొదట భావించారు. అయితే ముంబైలోని ఓ ఆస్పత్రి వైద్యులు ప్రెగ్నెన్సీ నిర్ధారించారు. దీంతో గుర్తు తెలియని నిందితుడిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. DNA పరీక్ష కోసం పిండం నుంచి శాంపిల్స్ సేకరించాలని కోర్టు ఆదేశించింది.
హీరోయిన్ అమీజాక్సన్ రెండోసారి తల్లి కాబోతున్నారు. తన భర్త ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి బేబి బంప్‌తో ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవల హాలీవుడ్ నటుడు వెస్ట్‌విక్‌ను ఆమె పెళ్లాడారు. కాగా గతంలో జార్జ్ పనాయోటౌ అనే వ్యక్తితో డేటింగ్ చేసిన అమీ ఓ బాబుని కన్నారు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోకుండా విడిపోయారు. ఎవడు, ఐ, రోబో-2 లాంటి సినిమాలతో ఈ బ్రిటిష్-ఇండియన్ యాక్టర్ పాపులర్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.