India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుంది. వైజయంతి మూవీస్ నిర్మించనున్న ‘ఆకాశంలో ఒక తార’ అనే తెలుగు సినిమాలో వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు వెల్లడించాయి. కాగా, దుల్కర్ ‘లక్కీ భాస్కర్’, సాయి పల్లవి నటించిన ‘అమరన్’ నిన్న విడుదలైన విషయం తెలిసిందే.
AP: స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో ఉన్నామని టీడీపీ MLA గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉక్కు పరిశ్రమపై ఇప్పటికే ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడారని చెప్పారు. అవసరమైతే మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడుతామని తెలిపారు. భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందించే ఆలోచన ఉందని వెల్లడించారు. విశాఖకు మరిన్ని IT కంపెనీలు తీసుకొచ్చేలా మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని అన్నారు.
AP: సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 11 సీట్లు వచ్చినా వారికి నోళ్లు మూతపడడం లేదని విమర్శించారు. ‘ప్రతి ఒక్కరి కడుపు నింపేందుకే దీపం 2.0 పథకం తీసుకువచ్చాం. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఇప్పటికిప్పుడే అన్ని సమస్యలను తీర్చలేం. దీనిపై విమర్శలు చేయడం సరికాదు’ అని ఆయన హెచ్చరించారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 86/4 రన్స్ చేసింది. ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (18), విరాట్ కోహ్లీ (4) విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (31*), రిషభ్ పంత్ (1*) ఉన్నారు. కాగా అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) అర్ధ సెంచరీలతో రాణించారు.
IPL చరిత్రలో అత్యధికంగా సంపాదించిన ప్లేయర్ల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రమే రూ.200+ కోట్లు సంపాదించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. Mi ప్లేయర్ రోహిత్ రూ.210.9 కోట్లు, RCB ప్లేయర్ కోహ్లీ రూ.209.2 కోట్లు, CSK ప్లేయర్ MS ధోనీ రూ.192.84 కోట్లు, CSK ఆటగాడు జడేజా రూ.143.01 కోట్లు IPL ద్వారా పొందారు.
AP: సీఎం చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైందని YCP నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టును సరైన సమయంలో పూర్తి చేయలేకపోయామన్నారు. ‘పోలవరం సెకండ్ ఫేజ్‌ను నాశనం చేసేందుకు బాబు కంకణం కట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం పోలవరానికి అన్యాయం చేస్తోంది. దీనిని భూస్థాపితం చేసేందుకు కుట్ర పన్నుతోంది. ప్రాజెక్టు పూర్తి చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో హిట్‌మ్యాన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులోనూ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచారు. కేవలం 18 బంతులు ఎదుర్కొని 18 రన్స్ చేసి ఔటయ్యారు. గత ఐదు ఇన్నింగ్సుల్లో రోహిత్ ప్రదర్శన ఇలా ఉంది. 18(18), 8(16), 0(9), 52(63), 2(16). వీటిలో ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉంది. కాగా మూడో టెస్టులో NZ 235 పరుగులకు ఆలౌటైంది.
AP: దేశంలో రూ.4 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మానవత్వం ఉందని చెప్పారు. ‘సిలిండర్‌కు చెల్లించిన డబ్బులను 48 గంటల్లోనే రీఫండ్ చేస్తాం. అసలు సిలిండర్‌కు ముందే డబ్బు కట్టే పనిలేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు పూర్వవైభవం తీసుకువస్తాం. వారికి రివాల్వింగ్ ఫండ్, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా ఫస్ట్ నినాదంలో పనిచేసే ట్రంప్ విదేశీ దిగుమతులపై సార్వత్రిక సుంకం 20% విధించాలన్న అతని ప్రణాళికలు ట్రేడ్ వార్‌కు దారి తీయవచ్చని భావిస్తున్నారు. ఇక వాతావరణ మార్పులను లైట్ తీసుకొనే ట్రంప్ బైడెన్ తెచ్చిన పర్యావరణ చట్టాలను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మద్దతు నిలిపివేసి మాస్కో శాంతి ఒప్పందానికి అంగీకరించేలా కీవ్‌పై ఒత్తిడి తేవచ్చని అభిప్రాయపడుతున్నారు.
TG: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్‌లో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో కొత్త డైట్‌ను తీసుకురావాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సీఎంను కలిసి పలువురు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.