India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్‌లో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో కొత్త డైట్‌ను తీసుకురావాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సీఎంను కలిసి పలువురు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త ఘనత సాధించారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ఇప్పటివరకు జడ్డూ 315 వికెట్లు తీశారు. ఈ క్రమంలో మాజీ ఫాస్ట్ బౌలర్లు జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ (311) లను ఆయన అధిగమించారు. అగ్ర స్థానంలో అనిల్ కుంబ్లే (619) కొనసాగుతున్నారు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (533), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) ఉన్నారు.
AP: నాయకుడు ప్రజల మనసుల్లో అభిమానం సంపాదించుకోవాలని CM చంద్రబాబు అన్నారు. నాయకులు వస్తే చెట్లు కొట్టడం, పరదాలు కట్టడం వంటివి ఉండకూడదని చెప్పారు. ఈదుపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. గత ఐదేళ్లు స్వేచ్ఛ లేని జీవితాన్ని అనుభవించాం. నేను రాజకీయ కక్ష సాధింపులు చేయను. కానీ తప్పు చేసిన వాళ్లను వదలను’ అని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు సీఎం అవడం వల్ల APకి అవతరణ దినం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ‘వైసీపీ పాలనలో NOV 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం ఘనంగా నిర్వహించాం. కూటమి ప్రభుత్వం దీనిని నిర్వహించకపోవడం ఎంత దారుణం. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవహేళన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? భావితరాలకు ఏం చెప్తారు? 6 కోట్ల ఆంధ్రులను అవమానించినందుకు పవన్, బాబు క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
నందమూరి నాలుగో తరం హీరో రామ్‌కు నారా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. ‘YVS చౌదరి తదుపరి ప్రాజెక్ట్‌తో మా రామ్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడని తెలుపడానికి సంతోషంగా ఉంది. నా సోదరుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ మనవడిగా, లెజెండరీ ఎన్టీఆర్ గారి మునిమనవడిగా, ఆయన మా కుటుంబ వారసత్వాన్ని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది’ అని ట్వీట్ చేశారు.
టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు రవీంద్ర జడేజా, సుందర్ స్పిన్ మ్యాజిక్‌తో కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆ జట్టులో విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) అర్ధ సెంచరీలతో రాణించారు. జడేజా 5, వాషింగ్టన్ సుందర్ 4, ఆకాశ్ ఒక వికెట్ తీశారు.
స్టాక్ మార్కెట్లకు నేటి సాయంత్రం ముహూరత్ ట్రేడింగ్‌తో కొత్త ఏడాది ప్రారంభంకానుంది. NSE, BSEలో సాయంత్రం 6 నుంచి 7 వరకు ట్రేడింగ్ జరగనుంది. పండుగ సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్‌లో కొత్తగా పెట్టే పెట్టుబడులు రాబోయే రోజుల్లో అధిక రాబడులు ఇస్తాయని ఇన్వెస్టర్లు విశ్వసిస్తారు. దీర్ఘకాలంలో వృద్ధికి అవకాశం ఉండి అందుబాటు ధరలో ఉన్న స్టాక్స్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై ఆ రాష్ట్ర BJP సెటైర్లు వేసింది. ఆయన వయసు 5ఏళ్లలోనే 7ఏళ్లు ఎలా పెరిగిందంటూ ప్రశ్నిస్తోంది. సోరెన్ 2019 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో తన వయసు 42ఏళ్లుగా పేర్కొన్నారు. కాగా ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్‌లో 49ఏళ్లుగా వెల్లడించారు. దీంతో ఆయన వయసులో వ్యత్యాసంపై BJP ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ మూవీ మరోసారి రష్యాలో రిలీజైంది. ప్రభాస్ బర్త్ డే వీక్ సందర్భంగా అక్కడి అభిమానుల కోసం ఈ చిత్రాన్ని మరోసారి రష్యన్ భాషలో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ మొదటిసారి విడుదలైనప్పుడు దాదాపు 1.64 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అంతం చేయదని AP హైకోర్టు వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ కామెంట్స్ చేసింది. పెళ్లయిన కూతురికి తన పేరెంట్స్ కుటుంబంలో సభ్యురాలు కాదనడాన్ని తప్పుబట్టింది. కారుణ్య నియామకాల్లో కుమారులను, కుమార్తెలను వేర్వేరుగా పరిగణించడం సరికాదంది. ఆడపిల్లలు పెళ్లయినా, కాకున్నా జీవితాంతం పేరెంట్స్ కుటుంబంలో భాగమేనని స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.