News November 3, 2025

కాలేజీల బంద్ కొనసాగిస్తాం: ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్

image

TG: కాలేజీల <<18182444>>బంద్<<>> కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్ రమేశ్ నాయుడు అన్నారు. ‘నిరసన ఉద్ధృతం చేస్తాం. రేపటి నుంచి జరిగే డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తాం. మాకు రావాల్సిన బకాయిల్లో సగం వెంటనే విడుదల చేయాలి. NOV 8న HYDలో సభ, 11న 10L మంది విద్యార్థులతో ఛలో HYD పేరుతో నిరసన చేపడతాం. ప్రభుత్వం మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది’ అని ఆరోపించారు.

News November 3, 2025

నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – కట్టడికి సూచనలు

image

ట్రైకోడెర్మావిరిడె/సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 2 కేజీల మందును.. 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండితో కలిపి నీడలో పొరలు పొరలుగా ఒక కుప్పగా వేసుకోవాలి. దానిపై గోనెకప్పి బెల్లం కలిపిన నీటిని ఒక వారం పాటు చల్లాలి. దీని వల్ల దానిలో శిలీంద్రబీజాలు/బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా తయారైన దానిని పశువుల ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇది నేలసారాన్ని పెంచి తెగుళ్ల ఉద్ధృతిని తగ్గిస్తుంది.

News November 3, 2025

చెత్త పనులు చేయడం వైసీపీకి పరిపాటిగా మారింది: మంత్రి లోకేశ్

image

AP: డ్రగ్స్ సరఫరా చేస్తున్న YCP స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డిని ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘డ్రగ్స్ వద్దని ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే YCP పాత వాసనలు వదులుకోవట్లేదు. చెత్త పనులు చేయడం, రాష్ట్రంలో ఏదో అయిపోతుందంటూ హడావుడి చేయడం పరిపాటిగా మారింది. YCP ఫేక్ పార్టీ అని అనేది అందుకే. ఆ పార్టీ నడిపేది స్టూడెంట్ వింగ్ కాదు, డ్రగ్స్ వింగ్’ అని ఆరోపించారు.

News November 3, 2025

ఇతిహాసాలు క్విజ్ – 55 సమాధానాలు

image

1. అయోధ్య నగరాన్ని ‘మను చక్రవర్తి’ నిర్మించారు.
2. విచిత్రవీర్యుని తండ్రి ‘శంతనుడు’.
3. కృష్ణుడు గోవర్ధన గిరిని ‘ఏడు’ రోజులు ఎత్తి పట్టుకున్నాడు.
4. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలను ‘చక్రాలు’ అని అంటారు.
5. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడాన్ని‘మోక్షం’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 3, 2025

APPLY NOW: CCIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) 14 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, పీజీ(ఎకనామిక్స్), బీటెక్, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. నెలకు రూ.60వేలు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://cci.gov.in

News November 3, 2025

WWC: ప్లేయర్లకు డైమండ్​ నెక్లెస్​ల బహుమతి!

image

మహిళల వన్డే ప్రపంచ కప్​ విజేతగా నిలిచిన భారత ప్లేయర్లకు సూరత్(గుజరాత్) వ్యాపారవేత్త, MP గోవింద్​ ఢోలకియా స్పెషల్​ గిఫ్టులను ప్రకటించారు. భారతీయులు గర్వపడేలా అమ్మాయిలు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని, వారికి వజ్రాల ఆభరణాలు, ఇళ్లకు అమర్చేందుకు సోలార్​ ప్యానెళ్లను గిఫ్ట్​గా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విజయం మన దేశానికి కొత్తవెలుగులు తెచ్చిందని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

News November 3, 2025

పెట్టుబడులు రాకుండా YCP కుట్రలు: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా YCP కుట్రలు చేస్తోందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. అన్ని కుట్రలు ఛేదించి సరైన టైమ్‌లో వాస్తవాలను బయటపెడతామన్నారు. ‘అభివృద్ధి కోసం ముందుకొస్తే కలిసికట్టుగా ముందుకెళ్దాం. పెట్టుబడులకు YCP సిఫార్సులను అంగీకరిస్తాం. ఆ పార్టీ సిఫార్సు చేసిన పెట్టుబడులకు వారికే క్రెడిట్ ఇస్తాం. ఎలక్షన్స్ టైమ్‌లోనే రాజకీయాలు.. తర్వాత రాష్ట్రాభివృద్ధే ధ్యేయం’ అని స్పష్టం చేశారు.

News November 3, 2025

‘చక్ దే ఇండియా2’ తీయాలని డిమాండ్.. కారణమిదే

image

18 ఏళ్ల కిందటి ‘చక్ దే ఇండియా’ గుర్తుందా? ప్లేయర్‌గా గెలవని హాకీ వరల్డ్ కప్‌ను కోచ్‌గా కబీర్ ఖాన్(షారుఖ్) సాధించడమే కథ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహిళల WC సాధించడంలో కోచ్ అమోల్ మజుందార్‌‌ది కీలక పాత్ర. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 11 వేల రన్స్ చేసినా ఆయన ఇంటర్నేషనల్ డెబ్యూ చేయలేదు. కోచ్‌గా తన కల నెరవేర్చుకున్న అమోల్ కథతో చక్ దే2 తీయాలని నెటిజన్లు కోరుతున్నారు. మీరేమంటారు?

News November 3, 2025

CII సమ్మిట్‌లో రూ.2లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు: మంత్రి లోకేశ్

image

AP: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ‘సమ్మిట్‌కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. 410కి పైగా ఒప్పందాలు జరగనున్నాయి. వీటి విలువ రూ.2లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఒప్పందాల వల్ల 9లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందుతారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది’ అని ప్రెస్‌మీట్‌లో వివరించారు.

News November 3, 2025

మరో 6 నెలలు కాల్పుల విరమణ: మావోయిస్టు పార్టీ

image

TG: రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత మే నెలలో ప్రకటించిన కాల్పుల విరమణను మరో ఆరు నెలలు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించింది.