News November 1, 2024

బాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యం: అంబటి

image

AP: సీఎం చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైందని YCP నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టును సరైన సమయంలో పూర్తి చేయలేకపోయామన్నారు. ‘పోలవరం సెకండ్ ఫేజ్‌ను నాశనం చేసేందుకు బాబు కంకణం కట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం పోలవరానికి అన్యాయం చేస్తోంది. దీనిని భూస్థాపితం చేసేందుకు కుట్ర పన్నుతోంది. ప్రాజెక్టు పూర్తి చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.

News November 1, 2024

రోహిత్ ఫ్లాప్ షో కంటిన్యూ..!

image

న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో హిట్‌మ్యాన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులోనూ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచారు. కేవలం 18 బంతులు ఎదుర్కొని 18 రన్స్ చేసి ఔటయ్యారు. గత ఐదు ఇన్నింగ్సుల్లో రోహిత్ ప్రదర్శన ఇలా ఉంది. 18(18), 8(16), 0(9), 52(63), 2(16). వీటిలో ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉంది. కాగా మూడో టెస్టులో NZ 235 పరుగులకు ఆలౌటైంది.

News November 1, 2024

ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. మానవత్వం ఉంది: చంద్రబాబు

image

AP: దేశంలో రూ.4 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మానవత్వం ఉందని చెప్పారు. ‘సిలిండర్‌కు చెల్లించిన డబ్బులను 48 గంటల్లోనే రీఫండ్ చేస్తాం. అసలు సిలిండర్‌కు ముందే డబ్బు కట్టే పనిలేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు పూర్వవైభవం తీసుకువస్తాం. వారికి రివాల్వింగ్ ఫండ్, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News November 1, 2024

రిపబ్లికన్ల ఫారిన్ పాలసీ డిఫరెంట్

image

అమెరికా ఫస్ట్ నినాదంలో పనిచేసే ట్రంప్ విదేశీ దిగుమతులపై సార్వత్రిక సుంకం 20% విధించాలన్న అతని ప్రణాళికలు ట్రేడ్ వార్‌కు దారి తీయ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఇక వాతావ‌ర‌ణ మార్పుల‌ను లైట్ తీసుకొనే ట్రంప్ బైడెన్ తెచ్చిన ప‌ర్యావ‌ర‌ణ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు నిలిపివేసి మాస్కో శాంతి ఒప్పందానికి అంగీక‌రించేలా కీవ్‌పై ఒత్తిడి తేవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

News November 1, 2024

విద్యార్థులకు కొత్త డైట్ ప్లాన్: సీఎం రేవంత్

image

TG: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్‌లో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో కొత్త డైట్‌ను తీసుకురావాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సీఎంను కలిసి పలువురు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

News November 1, 2024

రవీంద్ర జడేజా సరికొత్త ఘనత

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త ఘనత సాధించారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ఇప్పటివరకు జడ్డూ 315 వికెట్లు తీశారు. ఈ క్రమంలో మాజీ ఫాస్ట్ బౌలర్లు జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ (311) లను ఆయన అధిగమించారు. అగ్ర స్థానంలో అనిల్ కుంబ్లే (619) కొనసాగుతున్నారు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (533), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) ఉన్నారు.

News November 1, 2024

తప్పు చేసిన వారిని వదలను: చంద్రబాబు

image

AP: నాయకుడు ప్రజల మనసుల్లో అభిమానం సంపాదించుకోవాలని CM చంద్రబాబు అన్నారు. నాయకులు వస్తే చెట్లు కొట్టడం, పరదాలు కట్టడం వంటివి ఉండకూడదని చెప్పారు. ఈదుపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. గత ఐదేళ్లు స్వేచ్ఛ లేని జీవితాన్ని అనుభవించాం. నేను రాజకీయ కక్ష సాధింపులు చేయను. కానీ తప్పు చేసిన వాళ్లను వదలను’ అని ఆయన స్పష్టం చేశారు.

News November 1, 2024

ఎంత దారుణం.. అవతరణ దినం నిర్వహించరా?: రోజా

image

చంద్రబాబు సీఎం అవడం వల్ల APకి అవతరణ దినం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ‘వైసీపీ పాలనలో NOV 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం ఘనంగా నిర్వహించాం. కూటమి ప్రభుత్వం దీనిని నిర్వహించకపోవడం ఎంత దారుణం. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవహేళన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? భావితరాలకు ఏం చెప్తారు? 6 కోట్ల ఆంధ్రులను అవమానించినందుకు పవన్, బాబు క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

News November 1, 2024

NTR మునిమనవడిపై నారా భువనేశ్వరి ట్వీట్

image

నందమూరి నాలుగో తరం హీరో రామ్‌కు నారా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. ‘YVS చౌదరి తదుపరి ప్రాజెక్ట్‌తో మా రామ్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడని తెలుపడానికి సంతోషంగా ఉంది. నా సోదరుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ మనవడిగా, లెజెండరీ ఎన్టీఆర్ గారి మునిమనవడిగా, ఆయన మా కుటుంబ వారసత్వాన్ని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది’ అని ట్వీట్ చేశారు.

News November 1, 2024

తిప్పేసిన స్పిన్నర్లు.. కివీస్ 235 ఆలౌట్

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు రవీంద్ర జడేజా, సుందర్ స్పిన్ మ్యాజిక్‌తో కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆ జట్టులో విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) అర్ధ సెంచరీలతో రాణించారు. జడేజా 5, వాషింగ్టన్ సుందర్ 4, ఆకాశ్ ఒక వికెట్ తీశారు.