News September 3, 2025

విషప్రచారాలు చేసేవాళ్లు అమరావతికి వచ్చి చూడండి: నారాయణ

image

AP: రాజధాని అమరావతి అత్యంత సురక్షిత నగరం అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కొండవీటి, పాలవాగులను విస్తరిస్తున్నామని, 3 రిజర్వాయర్లు పూర్తైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. విష ప్రచారాలు చేసే వాళ్లు ఇక్కడికొచ్చి చూసి మాట్లాడాలని సూచించారు. అమరావతిలో ఎలాంటి పనులు జరగట్లేదని, అంతా గ్రాఫిక్సే అని మాట్లాడుతున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

News September 3, 2025

నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడికి సూచనలు

image

2 కేజీల ట్రైకోడెర్మావిరిడె/సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మందును 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండితో కలిపి నీడలో పొరలు పొరలుగా ఒక కుప్పగా వేసుకోవాలి. దానిపై గోనెకప్పి బెల్లం కలిపిన నీటిని ఒక వారం పాటు చల్లాలి. దీని వల్ల దానిలో శిలీంద్రబీజాలు/బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా తయారైన దానిని పశువుల ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇది నేలసారాన్ని పెంచి తెగుళ్ల ఉద్ధృతిని తగ్గిస్తుంది.

News September 3, 2025

పంటలలో తెగుళ్ల నివారణకు సూచనలు

image

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.

News September 3, 2025

డీజేల దగ్గర డాన్స్ చేస్తున్నారా? జాగ్రత్త

image

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 37 ఏళ్ల యువకుడు వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఏ సంగీతమైనా నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే గుండెపై హానికర ప్రభావం పడుతుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.
Share it

News September 3, 2025

గర్భాశయ ఆరోగ్యం కోసం..

image

మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో గర్భాశయ ఆరోగ్యం చాలా ముఖ్యం. దీనికోసం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది వ్యర్థాలని బయటకు నెట్టి ఇన్‌ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉండే ఆహారాలు తీసుకుంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడకుండా చూస్తాయి. కణితులు ఏర్పడకుండా విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తినాలి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే గుమ్మడి, అవిసె గింజలు, నువ్వులు తీసుకోవాలి.

News September 3, 2025

ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రాకుండా ఉండాలంటే..

image

స్త్రీల జీవితంలో గర్భధారణ సమయం కీలకమైనది. అయితే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావడం తల్లీబిడ్డలకు ప్రమాదం అంటున్నారు వైద్యనిపుణులు. ముందునుంచే ఫిట్స్ ఉంటే గర్భందాల్చిన తర్వాత న్యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్‌లను సంప్రదించాలి. లేకపోతే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు ప్రెగ్నెన్సీలో ఫిట్స్ మెడికేషన్ మానేస్తారు. ఇలాచేస్తే తల్లీబిడ్డలకు ప్రమాదం. కాబట్టి డాక్టర్ సూచనలతో మందులను వాడాలి.

News September 3, 2025

ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం

image

TG: కవిత సస్పెన్షన్ నేపథ్యంలో BRS అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సంజయ్‌లతో భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్ తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నారు. అటు మరికాసేపట్లో కవిత మీడియాతో మాట్లాడనున్నారు.

News September 3, 2025

తొక్కిసలాట ఘటనపై తొలిసారి స్పందించిన విరాట్

image

RCB విన్నింగ్ పరేడ్‌లో జరిగిన దుర్ఘటనపై విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించారు. ‘జూన్ 4న జరిగిన హృదయ విదారక ఘటన ఎవరూ ఊహించనిది. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణంగా ఉండాల్సిన రోజు విషాదంగా మారిపోయింది. తొక్కిసలాటలో చనిపోయిన, గాయపడిన అభిమానుల కోసం ప్రార్థిస్తున్నా. ఈ నష్టం ఇప్పుడు మనలో ఒక భాగం. కలిసికట్టుగా, బాధ్యతాయుతంగా ముందుకు వెళ్దాం’ అని కోహ్లీ ఎమోషనల్ అయ్యారు.

News September 3, 2025

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారినట్లు APSDMA తెలిపింది. అది 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

News September 3, 2025

గణపతి నిమజ్జనాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: TG పోలీస్

image

❃ విగ్రహం ఎత్తును బట్టి నిర్దేశించిన రూట్లలో మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలి.
❃ నిర్ణీత ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలి.
❃ పోలీస్, మున్సిపల్/పంచాయతీ సిబ్బంది సాయం తీసుకోవాలి.
❃ చెరువులు, నీటి కుంటల్లోకి దిగొద్దు. భారీ విగ్రహాల కోసం క్రేన్ వాడాలి.
❃ వాహనాలను నడిపేందుకు నిపుణులైన డ్రైవర్లను నియమించుకోవాలి.