News September 9, 2025

2035లో ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’: ఇస్రో ఛైర్మన్

image

ఇస్రో భవిష్యత్ కార్యాచరణ గురించి ఛైర్మన్ వి.నారాయణన్ కీలక విషయాలు వెల్లడించారు. ‘‘వచ్చే మూడేళ్లలో ప్రస్తుతం ఉన్న వాటి కంటే 3 రెట్లు అధికంగా శాటిలైట్స్‌ను కక్ష్యల్లో ప్రవేశపెడతాం. చంద్రయాన్-4, 5 మిషన్స్‌పై దృష్టిపెట్టాం. 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ స్థాపిస్తాం. 2028లో ఫస్ట్ మాడ్యూల్ పంపిస్తాం. 2040లో ఇండియా చంద్రుడిపై అడుగు పెడుతుంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ చేపడతాం’’ అని మీడియాకు తెలిపారు.

News September 9, 2025

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయండిలా..

image

ఈరోజుల్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆఫీస్, ఇల్లు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదు. కాబట్టి మహిళలు తమ చుట్టూ హెల్పింగ్ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిపనుల్లో కుటుంబసభ్యుల సాయం తీసుకోండి. ఆఫీస్‌లో వర్క్‌లోడ్ ఎక్కువైతే సహోద్యోగులతో పని పంచుకోండి. అవసరమైనప్పుడు మీరూ వారికి సాయపడాలి. ఇలా చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వీటితోపాటు కుటుంబంతో సరదాగా సమయం గడపడమూ ముఖ్యమే.

News September 9, 2025

కలర్ కరెక్ట్ చేద్దాం..

image

ముఖంపై వివిధకారణాల వల్ల మచ్చలు వస్తాయి. నుదురు, గడ్డంపై టాన్, బ్లాక్ సర్కిల్స్, పెదవుల చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటే కన్సీలర్, కలర్ కరెక్టర్ కలిపి అప్లై చెయ్యాలి. చర్మం కమిలినపుడు గ్రీన్ కరెక్టర్, కన్సీలర్ కలిపి వేయాలి. మొటిమలు తగ్గినపుడు ఉండే ఆరెంజ్ మచ్చలకు బ్లూ కరెక్టర్, నుదురు, గడ్డంపై లైట్ ఎల్లో మచ్చలకు పర్పుల్ కరెక్టర్ వాడాలి. లాస్ట్‌లో ఫౌండేషన్, పౌడర్ అద్దితే ముఖం మచ్చల్లేకుండా మెరిసిపోతుంది.

News September 9, 2025

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ‘అన్నదాత పోరు’

image

AP: యూరియా కొరత ఉందంటూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టింది. పలు జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించిన YCP నేతలు యూరియా కొరతపై అధికారులకు వినతులు సమర్పించారు. ‘యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేయాలి. బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి’ అని డిమాండ్ చేశారు.

News September 9, 2025

తండ్రి ఆస్తిలో వాటా కోరుతున్న హీరోయిన్ పిల్లలు!

image

హీరోయిన్ కరిష్మా కపూర్ పిల్లలు తమ తండ్రి సంజయ్ కపూర్ ఆస్తిలో వాటా కోరుతున్నారు. రూ.30,000 కోట్ల విలువ చేసే సోనా గ్రూపులో తమకూ హక్కు ఉందని వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా సంజయ్, కరిష్మా 2016లో విడిపోయారు. వీరిద్దరికీ సమీరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు సోనా గ్రూపును దక్కించుకునేందుకు సంజయ్ మూడో భార్య ప్రియా సచ్‌దేవ్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

News September 9, 2025

రామ్మోహన్ నాయుడు కుమారుడికి లోకేశ్ ఆశీస్సులు

image

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్, శ్రావ్య దంపతుల బిడ్డకు ఆయన ఆశీస్సులు అందజేశారు. బాబును ఎత్తుకుని ముద్దాడారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు రామ్మోహన్ కుమారుడికి ఆశీస్సులు అందించిన విషయం తెలిసిందే. 2017లో రామ్మోహన్, శ్రావ్య వివాహం చేసుకోగా 2021లో కూతురు(శివంకృతి) జన్మించింది. నెల క్రితం బాబు పుట్టాడు.

News September 9, 2025

BREAKING: నేపాల్ ప్రధాని రాజీనామా

image

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. <<17648801>>ఉద్రిక్త పరిస్థితుల<<>> నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది. కాగా వందలాది మంది నిరసనకారులు ఓలీ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పంటించారు.

News September 9, 2025

హనుమంతుడి విగ్రహాలు నారింజ రంగులో ఎందుకు?

image

హనుమంతుడు భక్తి తత్పరుడు. ఆయన విగ్రహాలు, జెండా అన్ని నారింజ రంగులోనే దర్శనమిస్తాయి. ఓరోజు సీతాదేవి నుదుటన ఆంజనేయుడు కుంకుమను గమనించాడు. అలా ఎందుకు పెట్టుకుంటారని అడిగాడు. అప్పుడు జానకీ దేవి ఆ సిందూరం శ్రీరాముని దీర్ఘాయువుని సూచిస్తుందని చెప్పింది. దీంతో హనుమంతుడు కూడా రాముడిపై అంతులేని ప్రేమతో తన దేహమంతటా ఆ సిందూరాన్ని పూసుకున్నాడు.

News September 9, 2025

కర్ణుడికి అలా ఎందుకు జరిగింది? (1/2)

image

మరణం తర్వాత కర్ణుడు స్వర్గానికి వెళ్లాడు. అక్కడ ఆయన దేన్ని తాకినా, అది బంగారంగా మారిపోసాగింది. ఆహారం తిందామన్నా ఇదే పరిస్థితి. దీంతో ‘నేనేం తప్పు చేశా’ అని బాధపడ్డాడు. అప్పుడు అశరీరవాణి ‘కర్ణా! నీవు దానశీలిగా ఎవరికి ఏం కావాలన్నా కాదనకుండా ఇచ్చావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, డబ్బు రూపేణా చేశావు. కానీ, ఒక్కసారైన అన్నదానం చేశావా? ఎవరి ఆకలినైనా తీర్చావా? అందుకే ఈ దుస్థితి’ అని పలికింది.

News September 9, 2025

కర్ణుడికి అలా ఎందుకు జరిగింది? (2/2)

image

తనకు కల్గిన దుస్థితి నుంచి విముక్తి కలిగించమని తండ్రి సూర్యుని వద్దకు వెళ్లి అడిగాడు కర్ణుడు. సూర్యుడి కోరిక మేరకు ఇంద్రుడు కల్పించుకొని కర్ణుడికి అవకాశం ఇచ్చాడు. భూలోకానికి వెళ్లి అన్నదానం చేయమన్నాడు. కర్ణుడు భూమ్మీదకు వెళ్లి అన్నదానం చేసి, మాతా పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి స్వర్గానికి వెళ్లాడు. అప్పుడే ఆయన ఆకలి తీరింది. అయితే కర్ణుడు భూమ్మీద గడిపిన ఈ 15 రోజుల కాలాన్నే మహాలయ పక్షమని అంటారు.