News September 3, 2025

గణపతి నిమజ్జనాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: TG పోలీస్

image

❃ విగ్రహం ఎత్తును బట్టి నిర్దేశించిన రూట్లలో మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలి.
❃ నిర్ణీత ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలి.
❃ పోలీస్, మున్సిపల్/పంచాయతీ సిబ్బంది సాయం తీసుకోవాలి.
❃ చెరువులు, నీటి కుంటల్లోకి దిగొద్దు. భారీ విగ్రహాల కోసం క్రేన్ వాడాలి.
❃ వాహనాలను నడిపేందుకు నిపుణులైన డ్రైవర్లను నియమించుకోవాలి.

News September 3, 2025

GSTలో నేడు మార్పులు.. అమలు ఎప్పుడంటే?

image

ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సవరించే శ్లాబులు, రేట్లను కేంద్రం ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చే యోచనలో ఉంది. రేట్లు ఇలా మారే అవకాశం ఉంది.
*టెక్స్‌టైల్ ఉత్పత్తులు, ట్రాక్టర్లపై 12% నుంచి 5%
*చెప్పులు, డైరీ ఉత్పత్తులు, ఫ్రూట్ జ్యూస్, హ్యాండ్ బ్యాగ్స్, ప్రాసెస్డ్ కాఫీ 12% నుంచి 5%
*ఏసీలు, టీవీలు, సిమెంట్ 28% నుంచి 18%
*1500 cc లగ్జరీ కార్లు, 300 cc బైకులు, పొగాకు ఉత్పత్తులు 28% నుంచి 40%

News September 3, 2025

కన్న కూతురు, అన్న కూతురు దూరం!

image

TG: హరీశ్ రావు, సంతోశ్ రావులపై అవినీతి ఆరోపణలు చేసిన కవితను నిన్న BRS సస్పెండ్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న KCR అన్న కూతురు రమ్యా రావు సైతం గతంలో పార్టీకి దూరమయ్యారు. స్వయాన కేసీఆరే ఆమెకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అయితే కుటుంబ కలహాలతో రమ్య తెలంగాణ ఆవిర్భావానికి ముందే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆమె KCR, సంతోశ్ రావులపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేయడం అప్పట్లో సంచలనమైంది.

News September 3, 2025

52 ఏళ్ల మహిళ 26 ఏళ్లుగా నమ్మించింది.. చివరకు!

image

UPలో 52 ఏళ్ల మహిళ 26 ఏళ్లుగా నమ్మించడంతో ప్రియుడు చంపేశాడు. ఫరూఖాబాద్‌కు చెందిన మహిళకు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మైన్‌పురికి చెందిన అరుణ్ కుమార్ ఆమెకు పరిచయమయ్యాడు. ఆమె ఫొటో ఫిల్టర్స్ వాడి 26 ఏళ్ల యువతిగా అతడిని నమ్మించింది. కొన్ని రోజులకు వీరిద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విసుగెత్తిపోయిన ఆ యువకుడు ఆమెను ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.

News September 3, 2025

బీటెక్ అర్హతతో 1,534 పోస్టులు

image

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL)లో కాంట్రాక్టు ప్రాతిపదికన 1,534 పోస్టులకు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలున్నాయి. బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఈ/ఎంటెక్‌లో 55% మార్కులతో పాసైన, 29ఏళ్లలోపు వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి ₹23K నుంచి ₹1.20L వరకు జీతం ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://www.powergrid.in/<<>>

News September 3, 2025

10,277 ఉద్యోగాలు.. దరఖాస్తుల సవరణకు ఇవాళే లాస్ట్

image

ఐబీపీఎస్ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-CSA(xv) 10,277 క్లర్క్ పోస్టుల దరఖాస్తుల సవరణకు ఇవాళే చివరి తేదీ. అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు ఏవైనా వివరాలు తప్పుగా ఎంటర్ చేస్తే ఇవాళ రా.11.59లోపు మార్పులు చేసుకోవచ్చు. అభ్యర్థులకు అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో ప్రిలిమ్స్, నవంబర్ 29న మెయిన్స్ నిర్వహిస్తారు. కాగా ఈ ఉద్యోగాలకు గత నెల 28తో దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే.
వెబ్‌సైట్: <>https://ibpsreg.ibps.in/<<>>

News September 3, 2025

ఏకాదశి రోజు తులసి చెట్టుని ఎందుకు పూజించాలి?

image

ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఏకాదశి నాడు ఈ మొక్కను పూజిస్తే విష్ణువు సంతోషించి తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని ప్రతీతి. వివాహిత స్త్రీలు తులసి పూజ చేస్తే వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు, దాంపత్య ఆనందం కలుగుతాయని నమ్ముతారు. ఏకాదశి నాడు తులసి దానం చేయడం వలన అష్టైశ్వర్యాలు పెరుగుతాయని విశ్వాసం.

News September 3, 2025

టాబ్లెట్లను విరిచి వేసుకుంటున్నారా?

image

స్కోర్ లైన్ లేని టాబ్లెట్‌లను విరిచి వేసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘వైద్యుల సూచన లేకుండా ఏ టాబ్లెట్‌ను విరిచి వేసుకోవద్దు. టాబ్లెట్‌ను విరిస్తే దాని పనితీరు దెబ్బతినడంతో పాటు హానికరంగా మారే అవకాశముంది. డ్రగ్ రక్తంలో ఒకేసారి రిలీజై డోస్ ఎక్కువ అవ్వొచ్చు లేదా ఇన్ఎఫెక్టీవ్‌గా మారొచ్చు. కడుపులో ఇరిటేషన్ వచ్చే ఛాన్సుంటుంది. ఒకవేళ వైద్యులు సూచిస్తే పిల్ కట్టర్‌ వాడాలి’ అని సూచిస్తున్నారు.

News September 3, 2025

పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు ప్రభుత్వం ఆమోదం: TPSA

image

TG: గ్రామ పంచాయతీలను గ్రేడింగ్ చేసి క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు (TPSA) పి.మధుసూదన్ వెల్లడించారు. పంచాయతీ సెక్రటరీల పదోన్నతులకు అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

News September 3, 2025

బంగారం ధరలు ALL TIME RECORD

image

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,06,970కు చేరింది. కాగా 9 రోజుల్లో రూ.5,460 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.98,050 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.900 పెరిగి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.