News September 3, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

☛ ఈ నెల 5న మాదాపూర్ హైటెక్స్‌లో 5వేల మంది గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
☛ 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్
☛ గిరిజన గ్రామాల్లో బీటీ రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.700 కోట్లు మంజూరు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
☛ చెరువులు, పార్కుల ఆక్రమణ/కబ్జాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులోకి హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ 1070

News September 3, 2025

అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్: రింకూ సింగ్

image

భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని రింకూ సింగ్ వెల్లడించారు. ‘అవకాశం వస్తే అన్ని ఫార్మాట్లలో రాణించగలననే నమ్మకం ఉంది. టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ఒక్క ఫార్మాట్‌కే పరిమితం కావాలనుకోవట్లేదు. నేను సిక్సులు కొడితే ఫ్యాన్స్ ఇష్టపడతారని తెలుసు. కానీ రంజీల్లో కూడా నా సగటు (55) బాగుంది. రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News September 3, 2025

ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్!

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించాలని కంపెనీ యాజమాన్యాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కంపెనీలన్నీ ఒకే ధరకు సరఫరా చేయాలని సూచించారు. దీనిపై సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో త్వరలో సమావేశమై ధరలను ఫైనల్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన ఈ పథకానికి సహకారం అందించడం తమ అదృష్టమని మంత్రులతో అన్నారు.

News September 3, 2025

నేను చాలా యాక్టివ్‌గా ఉన్నా: ట్రంప్

image

సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ వింటున్నానని, అవన్నీ అవాస్తవాలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. గత వారం రోజులుగా తాను గోల్ఫ్ ఆడుతూ చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వైట్ హౌస్‌లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాగా కొద్ది రోజులుగా ట్రంప్ బహిరంగంగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ‘<<17563031>>ట్రంప్ ఈజ్ డెడ్<<>>’ అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

News September 3, 2025

వైసీపీ ఎమ్మెల్యేలకు ఇదే నా విజ్ఞప్తి: స్పీకర్

image

AP: చంద్రబాబుకు ధైర్యముంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడాలన్న <<17591420>>సజ్జల<<>> కామెంట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. ‘పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని కొంతమంది మాట్లాడుతున్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నా విజ్ఞప్తి. సభకు రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి. స్పీకర్‌గా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తా’ అని ట్వీట్ చేశారు.

News September 3, 2025

APPLY: రూ.1,40,000 జీతంతో 248 పోస్టులు

image

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC) 248 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, JE, సీనియర్ అకౌంటెంట్, సూపర్‌వైజర్(IT), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. వయసు 30 ఏళ్లకు మించకూడదు. పోస్టులను బట్టి డిగ్రీ/బీ.టెక్/సీఏ చదివి ఉండాలి. జీతం పోస్టులను బట్టి నెలకు రూ.27,000-రూ.1,40,000 వరకు ఉంటుంది. వచ్చే నెల 1లోగా nhpcindia సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 3, 2025

కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి!

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తయినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. మిగతా ప్లేయర్లందరికీ ఇండియాలోనే టెస్టులు జరగగా, ఆయనకు మాత్రమే విదేశాల్లో నిర్వహించారని పేర్కొన్నాయి. ఇటీవల రోహిత్ శర్మ, గిల్, సిరాజ్, బుమ్రా తదితర ఆటగాళ్లకు బెంగళూరులో ఫిట్‌నెస్ టెస్టులు <<17575424>>జరిగిన<<>> సంగతి తెలిసిందే. ఈ నెలలో నిర్వహించే సెకండ్ ఫేజ్‌లో మిగతా ప్లేయర్లనూ పరీక్షించనున్నారు.

News September 3, 2025

అమరావతి.. ఆ 1,800 ఎకరాల సేకరణకు నిర్ణయం

image

AP: అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించింది. అయితే ఆయా భూముల మధ్యలో ఉన్న 1,800 ఎకరాలను ఇచ్చేందుకు 80 మంది రైతులు ఇష్టపడలేదు. దీంతో నిర్మాణాలకు ఇబ్బంది కలుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా వాటిని సేకరించాలని CRDA నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించాలని కోరినా రైతులు అంగీకరించకపోవడంతో ల్యాండ్ అక్విజిషన్ (భూ సేకరణ) చేయాలని డిసైడ్ అయింది.

News September 3, 2025

‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశానికి చీఫ్ గెస్ట్‌గా సీఎం రేవంత్

image

TG: CM రేవంత్ ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, గిరిజన నియోజకవర్గాలు, ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా 1000 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తోంది.

News September 3, 2025

నాకు లాంగ్ హనీమూన్ కావాలి: జాన్వీ కపూర్

image

తన పెళ్లి, హనీమూన్ గురించి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను ఇంతకుముందు చెప్పినట్లే నా పెళ్లి తిరుపతిలోనే జరుగుతుంది. అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లాడతా. వివాహ తంతు త్వరగా ముగిసేలా చూసుకుంటా. కానీ హనీమూన్ మాత్రం చాలా లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం వీర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్.