News November 1, 2024

300 అప్లికేషన్స్, 500 ఈమెయిల్స్.. ఎట్టకేలకు ఉద్యోగం

image

పుణేకు చెందిన ధ్రువ్ లోయా అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన కృషి సోషల్ మీడియాలో వైరలవుతోంది. USలోనే చదువుకున్న అతను జాబ్ కోసం 5 నెలల్లో 300 దరఖాస్తులు, 500కుపైగా ఈమెయిల్స్ పంపారు. 10 ఇంటర్వ్యూలకు కూడా హాజరవగా ఎట్టకేలకు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాలో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్టుగా కొలువు సాధించారు. ఈ విషయాన్ని అతను linkedinలో పోస్టు చేయగా అందరూ అభినందిస్తున్నారు.

News November 1, 2024

సర్వర్ డౌన్.. పెన్షన్ల పంపిణీకి బ్రేక్

image

ఏపీ వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఉదయం ఏడు గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయగా సర్వర్ సమస్య తలెత్తింది. అన్ని జిల్లాల్లో పంపిణీని సచివాలయ ఉద్యోగులు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి వాకబు చేస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే తిరిగి పంపిణీని ప్రారంభిస్తామని ఉద్యోగులు వారికి చెప్పి పంపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ సమాచారం అందిస్తున్నారు.

News November 1, 2024

OTTలోకి వచ్చేసిన విజయ్ ఆంటోనీ ‘హిట్లర్’

image

విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ‘హిట్లర్’ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ధన శేఖరన్ దర్శకత్వం వహించారు. రియా సుమన్, గౌతం వాసుదేవ్ కీలకపాత్రలు పోషించారు. కాగా ‘బిచ్చగాడు’తో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.

News November 1, 2024

‘No Shave November’ షురూ!

image

ప్రతి ఏడాది నవంబర్ వచ్చిందంటే ‘No Shave November’ ట్రెండ్ మొదలవుతుంది. చాలామంది దీన్ని స్టైల్‌ కోసం ఫాలో అవుతుంటారు. నిజానికి ఇది ఒక వరల్డ్ వైడ్ క్యాంపెయిన్. పురుషుల ప్రోస్టేట్&టెస్టిక్యులర్ క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఫండ్ రైజింగ్ కోసం ఈ క్యాంపెయిన్ 2009లో స్టార్ట్ అయ్యింది. ఈ రోజు నుంచి మీరూ ‘నో షేవ్ నవంబర్’ పాటిస్తున్నారా? కామెంట్ ద్వారా తెలియజేయండి.

News November 1, 2024

నువ్వా?నేనా?.. కమల vs ట్రంప్

image

అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేసే బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఈసారి డెమొక్రటిక్ పార్టీకి అండగా ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ విధానంపై కఠినంగా వ్యవహరిస్తానని ట్రంప్ చెప్పడంతో ప్రవాస ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటేసే ఛాన్స్ ఉంది. నిరుద్యోగం, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్-ఇరాన్ యుద్ధాలు కమల పార్టీకి దెబ్బకొట్టే అవకాశాలున్నాయి. తాను వస్తేనే US ఆర్థికవ్యవస్థ గాడిన పడుతుందని ట్రంప్ చెబుతున్నారు.

News November 1, 2024

Flipkartలో సరికొత్త మోసం?

image

Flipkartలో జరుగుతోన్న ఓ మోసాన్ని కేశవ్ అనే వ్యక్తి లేవనెత్తారు. Mokobora కంపెనీకి చెందిన సూట్‌కేస్ ధరను ఆండ్రాయిడ్, iOSలలోని Flipkart యాప్‌లో కంపేర్ చేశారు. ఆండ్రాయిడ్‌లో దీని ధర రూ.4819 ఉండగా, iOSలో రూ.5499 ఉంది. ఒకే కంపెనీ బ్యాగుకూ ఎందుకీ వ్యత్యాసమని ఆయన మండిపడ్డారు. దీనిపై Flipkart స్పందిస్తూ.. ‘వివిధ అంశాల ఆధారంగా ధరలను విక్రేత నిర్ణయించడంతో కొన్నిసార్లు వ్యత్యాసం ఉంటుంది’ అని పేర్కొంది.

News November 1, 2024

నాకంటే వారికే ఎక్కువ దక్కాలి: రోహిత్ శర్మ

image

ముంబై ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోగా రోహిత్ శర్మ కంటే బుమ్రా, సూర్య, పాండ్యకే ఎక్కువ మొత్తం ఇస్తోంది. దీనిపై రోహిత్ స్పందించారు. ‘నేను T20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాను. జాతీయ జట్టుకు ఆడేవారికి ఎక్కువ ప్రాధాన్యం దక్కాలని భావించా. నాకు ఇదే సరైన ప్లేస్’ అని చెప్పారు. కాగా, బుమ్రాకు రూ.18 కోట్లు, సూర్య, పాండ్యకు రూ.16.35 కోట్లు, రోహిత్ శర్మకు రూ.16.30 కోట్లు, తిలక్ వర్మకు రూ.8 కోట్లు దక్కాయి.

News November 1, 2024

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టీబీసీ కౌంటర్ వరకు భక్తులు క్యూలైన్‌లో ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 63987 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు లభించింది.

News November 1, 2024

కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

image

ఏపీలో నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు.
మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులుండగా ఇప్పటి వరకు 29.83 లక్షల మందికి పింఛన్లు అందించారు. పలు కారణాలతో ఇవాళ పెన్షన్ అందుకోలేని వారికి రేపు అందించనున్నారు. ఇటు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించేందుకు ఇవాళ CM చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు.

News November 1, 2024

IPL రిటెన్షన్లలో బ్యాటర్లదే పైచేయి

image

నిన్న IPL రిటెన్షన్ల ప్రక్రియ హాట్‌హాట్‌గా సాగింది. ఈ రిటెన్ష‌న్‌లో ఫ్రాంచైజీలు ఎక్కువగా బ్యాటర్లనే రిటైన్ చేసుకున్నాయి. మొత్తం 28 మంది బ్యాటర్లు రిటైన్ కాగా బౌలర్లు కేవలం 11 మంది రిటైన్ అయ్యారు. ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే ఏడుగురిని ఆయా జట్లు తమతో అట్టిపెట్టుకున్నాయి. అత్యధిక ధర కూడా బ్యాటర్లకే పలికిన విషయం తెలిసిందే.