News November 1, 2024

ఉ.కొరియా సైనికుల శవాలు బ్యాగుల్లో వెళ్తాయి: US

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులను పంపడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బలగాలను ఉపసంహరించుకోవాలని ఐరాసలోని US డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ హెచ్చరించారు. లేదంటే వారి శవాలు బ్యాగ్‌లలో తిరిగెళ్తాయని స్పష్టం చేశారు. వెస్ట్రన్ కంట్రీస్ ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నప్పుడు మాస్కోకు ఉ.కొరియా మద్దతు ఇస్తే తప్పేంటని రష్యా రాయబారి వాసిలీ నెజెంబియా ప్రశ్నించారు.

News November 1, 2024

మేం హ్యాపీ.. RR రిటెన్షన్‌పై రాహుల్ ద్రవిడ్

image

రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితాపై ఆ జట్టు హెడ్ కోచ్ ద్రవిడ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘సమర్థుడైన కెప్టెన్ సంజూ శాంసన్, యంగ్ ప్లేయర్లు యశస్వి, పరాగ్, ధ్రువ్, సీనియర్లు సందీప్ శర్మ, హెట్‌మెయిర్‌ను అట్టిపెట్టుకున్నాం. వీరు జట్టును ముందుకు తీసుకెళ్తారు. మూడేళ్లుగా నిలకడగా ఆడుతున్నాం. ఇందుకు చాలా మంది ఆటగాళ్లు కృషి చేశారు. ఇప్పుడు కొత్త టీమ్‌తో పయనించడానికి సిద్ధమవుతున్నాం’ అని పేర్కొన్నారు.

News November 1, 2024

ఝార్ఖండ్‌లో బిజీగా భట్టి విక్రమార్క

image

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పండగవేళ సైతం ఎన్నికల హడావుడిలో బిజీగా గడిపారు. ఝార్ఖండ్‌లో త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దీంతో ఆయన దీపావళి వేళ అక్కడి నేతలతో కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఝార్ఖండ్‌లో నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ నవంబర్ 20న ఎన్నికలున్నాయి.

News November 1, 2024

INDvsNZ: నేటి నుంచి చివరి టెస్టు

image

భారత్, న్యూజిలాండ్ మధ్య 3 టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ వాంఖడే వేదికగా ఈరోజు 9.30amకు ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్ ఇది కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అటు రోహిత్‌ సేన ఇందులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. సీనియర్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలం.

News November 1, 2024

OTTలోకి వచ్చేసిన ‘విశ్వం’ మూవీ

image

గోపీచంద్-కావ్యా థాపర్ జంటగా నటించిన విశ్వం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం అక్టోబర్ 11న విడుదలై పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిశోర్, ప్రగతి, నరేశ్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు.

News November 1, 2024

IPL రిటెన్షన్: టీమ్‌ల వారీగా జాబితాలు ఇవే(PHOTOS)

image

IPL-2025కు ముందు కీలకమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. పది జట్లు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. స్టార్ ప్లేయర్లను వదులుకున్న కొన్ని టీమ్‌ల నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించగా, మరికొన్ని యంగ్ టాలెంట్‌కు పట్టం కట్టాయి. రిటెన్షన్‌లో నిలిచిన ప్లేయర్లను టీమ్‌ల వారీగా పైన ఫొటోల్లో చూడవచ్చు. త్వరలోనే జరిగే మెగా వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News November 1, 2024

హిందువులపై దాడిని ఖండిస్తున్నా: ట్రంప్

image

అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్‌లు విస్మరించారని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులు, ఇతర మైనారిటీలపై జరిగిన దాడిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామన్నారు. ఇండియాతో బలమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

News November 1, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. TGలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News November 1, 2024

దీపావళి వేడుకల్లో క్రికెటర్లు

image

దీపావళి సందర్భంగా స్టార్ క్రికెటర్లు తమ కుటుంబాలతో ఘనంగా వేడుకలు చేసుకున్నారు. ధోనీ- సాక్షి, బుమ్రా-సంజన, కృనాల్ పాండ్య-పంఖూరి శర్మ, హార్దిక్ పాండ్య తన కొడుకుతో సందడి చేశారు. బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తమ భార్య, పిల్లలతో ఒకేచోట కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

News November 1, 2024

J&K బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

image

జమ్మూకశ్మీర్‌‌లోని నగ్రోటా BJP MLA దేవేందర్ సింగ్ రాణా(59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్‌కు ఈయన సోదరుడు. దేవేందర్ మృతిపై J&K Dy.cm సురేందర్, PDF చీఫ్ ముఫ్తీ, BJP నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈయన 2014లో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి MLAగా గెలిచారు. తర్వాత బీజేపీలో చేరి తాజాగా 30,472 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.