India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోపీచంద్-కావ్యా థాపర్ జంటగా నటించిన విశ్వం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం అక్టోబర్ 11న విడుదలై పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిశోర్, ప్రగతి, నరేశ్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు.
IPL-2025కు ముందు కీలకమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. పది జట్లు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. స్టార్ ప్లేయర్లను వదులుకున్న కొన్ని టీమ్‌ల నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించగా, మరికొన్ని యంగ్ టాలెంట్‌కు పట్టం కట్టాయి. రిటెన్షన్‌లో నిలిచిన ప్లేయర్లను టీమ్‌ల వారీగా పైన ఫొటోల్లో చూడవచ్చు. త్వరలోనే జరిగే మెగా వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్‌లు విస్మరించారని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులు, ఇతర మైనారిటీలపై జరిగిన దాడిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామన్నారు. ఇండియాతో బలమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
APలోని మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. TGలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
దీపావళి సందర్భంగా స్టార్ క్రికెటర్లు తమ కుటుంబాలతో ఘనంగా వేడుకలు చేసుకున్నారు. ధోనీ- సాక్షి, బుమ్రా-సంజన, కృనాల్ పాండ్య-పంఖూరి శర్మ, హార్దిక్ పాండ్య తన కొడుకుతో సందడి చేశారు. బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తమ భార్య, పిల్లలతో ఒకేచోట కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా BJP MLA దేవేందర్ సింగ్ రాణా(59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్‌కు ఈయన సోదరుడు. దేవేందర్ మృతిపై J&K Dy.cm సురేందర్, PDF చీఫ్ ముఫ్తీ, BJP నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈయన 2014లో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి MLAగా గెలిచారు. తర్వాత బీజేపీలో చేరి తాజాగా 30,472 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
నిన్న రిలీజైన ‘క’ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. ‘సినిమాల్లో ఎవరికైనా విజయం వస్తే హిట్ కొట్టాడు అంటారు. నాకు హిట్ వస్తే హిట్ కొట్టేశామ్ అంటున్నారు. సక్సెస్ కంటే మీరు నాపైన చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతను మాటల్లో చెప్పలేను. ఇందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
US ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతుగా ప్రచారం చేయడంపై ఎలాన్ మస్క్ స్పందించారు. ‘మార్స్‌పై మానవ కాలనీల స్థాపనకు మస్క్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి ఆయన రిప్లై ఇస్తూ.. ‘నిజమే. ట్రంప్ గెలిస్తే మార్స్‌పైకి చేరుకోవడంతోపాటు అక్కడ జీవనం, ప్రయోగాలకు వీలవుతుంది. అందుకే పాలిటిక్స్‌లో చురుగ్గా ఉంటున్నా’ అని రాసుకొచ్చారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా COO ప్రవీణా రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్(MCX) MD, CEOగా బాధ్యతలు చేపట్టారు. ఈమె నియామకానికి ‘సెబీ’ ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఆమెకు 30ఏళ్ల అనుభవం ఉంది. కోటక్ మహీంద్రా, సిటీ బ్యాంక్, HSBC బ్యాంకుల్లో పని చేశారు. NPCIలో బిజినెస్ స్ట్రాటజీ, మార్కెటింగ్ తదితర విభాగాలను పర్యవేక్షించారు.
రిషభ్ పంత్‌ను DC అట్టిపెట్టుకోకపోవడం, జట్టు కూర్పుపై కో ఓనర్ పార్థ్ జిందాల్ స్పందించారు. ‘ఎవరు కావాలో మాకు తెలుసు. అనుభవం, యంగ్ ప్లేయర్ల కలయికతో అక్షర్, కుల్దీప్, స్టబ్స్, పొరెల్‌ను రిటైన్ చేసుకున్నాం. ఇందుకు హ్యాపీగానే ఉన్నాం. మాకు రెండు RTM కార్డులున్నాయి. గతంలో ఢిల్లీకి ఆడిన ఆటగాళ్లను కొనసాగించుకునే అవకాశం ఉంది. మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.