News September 2, 2025

కొత్త నోట్ల నాణ్యతపై నెట్టింట చర్చ!

image

RBI తీసుకొచ్చిన కొత్త రూ.10, 20, 50 నోట్ల మన్నికపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ కొత్త నోట్లు త్వరగా పాడైపోతున్నాయని, పాత నోట్లలాగా మన్నికగా లేవని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. నాణ్యతలోపం వల్ల తయారైన ఆరేళ్లకే చిరిగిపోవడం, రంగు వెలిసిపోవడం వంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు. ఓల్డ్ మోడల్ నోట్లు ఇప్పటికీ చెక్కుచెదరలేవని గుర్తుచేస్తున్నారు. మీకూ ఈ సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి. SHARE IT

News September 2, 2025

కొందరు నా కుర్చీకే ఎసరు పెడతామంటారు: సీఎం రేవంత్

image

TG: ఈ తరానికి వైఎస్ ఒకరే, కేవీపీ ఒకరే ఉంటారని సీఎం రేవంత్ కొనియాడారు. కేవీపీ రామచంద్రరావులాంటి వారు తనకు ఎక్కడా కనిపించలేదని ప్రశంసించారు. ‘కేవీపీలా ఉండాలంటే సర్వం త్యాగం చేయాలి. కానీ కొందరు నా దగ్గరికి వచ్చి కేవీపీలా ఉంటానంటారు. ఎవరినైనా మొదటి వారం ఆఫీస్ లోపలికి రానిస్తే, రెండో వారం నా కుర్చీలోనే కూర్చుంటామంటారు. ఇది నా అనుభవంతో చెబుతున్నా’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

News September 2, 2025

లిక్కర్ కేసు.. బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేయగా రేపు ఆయన తరఫు లాయర్ వాదనలు విననుంది. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ పైనా విచారణను రేపటికి వాయిదా వేసింది.

News September 2, 2025

తల్లి కాబోతున్న హీరోయిన్

image

హీరోయిన్ పార్వతి మెల్టన్ తల్లి కాబోతున్నారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇవి చూసిన అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా వెన్నెల, జల్సా, దూకుడు, శ్రీమన్నారాయణ, మధుమాసం వంటి సినిమాలతో పార్వతి ప్రేక్షకులను అలరించారు. 2012లో వ్యాపారవేత్త షంసు లాలానిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలయ్యారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నారు.

News September 2, 2025

సుగాలి ప్రీతి కేసు ఏంటంటే?

image

AP: <<17594800>>సుగాలి ప్రీతి<<>> 2017లో స్కూల్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. అయితే ఆమెను హత్యాచారం చేశారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2019లోనే ఈ కేసును అప్పటి YCP ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో దర్యాప్తు చేయడం తమవల్ల కాదంటూ కోర్టుకు CBI తెలిపింది. కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలని ప్రీతి తల్లి పార్వతి డిమాండ్‌తో మరోసారి సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.

News September 2, 2025

BREAKING: సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

image

AP: రాష్ట్రంలో సంచలనం రేపిన <<17548354>>సుగాలి ప్రీతి<<>> కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై పవన్ సైతం స్పందించారు. తాజా పరిణామాల నడుమ కేసును సీబీఐకి అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించినా దర్యాప్తు ముందుకు సాగలేదు.

News September 2, 2025

T20Iల్లో టాప్ వికెట్ టేకర్‌గా రషీద్ ఖాన్

image

అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన అవతరించారు. ఇప్పటివరకు రషీద్ 165 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టిమ్ సౌతీ(164)రికార్డును బద్దలు కొట్టారు. షార్జాలో UAEతో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించారు. వీరిద్దరి తర్వాత ఇష్ సోధి(150), షకీబ్ (149), ముస్తాఫిజుర్(142), రషీద్(135), హసరంగ(131), జంపా(130), అడైర్(128), ఇషాన్ ఖాన్(127) ఉన్నారు.

News September 2, 2025

అఫ్గాన్‌లో మరోసారి భూకంపం

image

అఫ్గానిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. జలాలాబాద్‌కు 34కి.మీ దూరంలో 5.5 తీవ్రతతో భూమి కంపించినట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలేమీ ఇంకా తెలియరాలేదు. కాగా నిన్న సంభవించిన భారీ <<17592698>>భూకంపం<<>> ధాటికి అఫ్గాన్‌లో 1400 మంది మరణించిన విషయం తెలిసిందే.

News September 2, 2025

VIRAL: 1954 నుంచి ఖైరతాబాద్ గణేశుడు

image

ఎంతో ప్రఖ్యాతి చెందిన ఖైరతాబాద్ గణేశుడిని 1954 నుంచి ప్రతిష్ఠిస్తున్నారు. తొలి ఏడాది ఒక్క అడుగుతో మొదలు పెట్టి ప్రస్తుతం 69 అడుగుల ఎత్తులో రూపొందించారు. గత 72 ఏళ్లలో వివిధ రూపాల్లో, ఎత్తుల్లో ప్రతిష్ఠించగా.. కొన్నేళ్ల నుంచి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. 2020లో కరోనా వల్ల 9 అడుగులే పెట్టి 2021 నుంచి మళ్లీ విగ్రహం ఎత్తును పెంచారు. ఇన్నేళ్లలోని గణనాథుల్లో కొన్నింటిని పైఫొటోల్లో చూడొచ్చు.

News September 2, 2025

వరద బాధిత జిల్లాలకు రూ.200కోట్లు విడుదల

image

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సాయం కింద రూ.200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్రంగా ప్రభావితమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్, ADB, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్లకు రూ.10 కోట్ల చొప్పున, ఇతర జిల్లాలకు రూ.5 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ నిధులను రోడ్లు&వంతెనల మరమ్మతులు, విద్యుత్ పునరుద్ధరణ, వరద బాధితులకు ఉపశమనం&పునరావాసం కోసం ఉపయోగించనున్నారు.