News May 8, 2025

ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు

image

✒ చెరువుల్లో తవ్విన మట్టిని ఉచితంగా పొలాలకు తీసుకెళ్లేందుకు రైతులకు అనుమతి
✒ ఏటా పంట కాల్వలకు మరమ్మతులు చేయాలని నిర్ణయం
✒ టీటీడీలో అర్బన్ డిజైన్ ప్లానింగ్ సెల్ ఏర్పాటు
✒ జలవనరుల శాఖలో కంపెనీల చట్టం కింద జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
✒ పర్యాటక ప్రాజెక్టుల్లో ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాలు అందించేందుకు ఆమోదం

News May 8, 2025

‘ఆపరేషన్ సిందూర్’ను సమర్థించిన EU

image

ఉగ్రస్థావరాలపై భారత్ దాడులను సమర్థిస్తూ పలు దేశాలు తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి యూరోపియన్ యూనియన్ చేరింది. ‘ఆపరేషన్ సిందూర్‌’కు మద్దతిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. చట్టబద్ధంగా పౌరులను రక్షించడం బాధ్యత అని వెల్లడించింది. పాక్, భారత్ మధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. యూరోపియన్ యూనియన్ ఐరోపాలోని 27 సభ్య దేశాల సమూహం.

News May 8, 2025

ఏంటీ చిల్లర పనులు.. పాక్‌పై విమర్శలు!

image

భారత్ చేస్తున్న దాడులను నేరుగా ఎదుర్కోవడం చేతకాక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తోంది పాకిస్థాన్. తాజాగా భారత సైనిక కాలనీలపై పాక్ దాడి చేసిందంటూ ఓ పాత వీడియోను కొందరు పోస్టులు చేస్తున్నారు. అయితే, ఈ వీడియో ఇండోనేషియాకు చెందినదని, ఇప్పటిది కాదని ‘PIB FACTCHECK’ వెల్లడించింది. దీంతో మనల్ని ఎదుర్కోలేక ఇలాంటి చిల్లర పనులు చేస్తోందంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు.

News May 8, 2025

ఆ మూవీకి పారితోషికం వద్దన్నా: ఆమిర్

image

2022లో విడుదలైన లాల్ సింగ్ చడ్డా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆమిర్ ఖాన్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆ సినిమాకు భారీ నష్టాలు రావడంతో ఈ హీరో తన పారితోషికం తీసుకోలేదట. సినిమా నష్టంలో తాను భాగం పంచుకోవాలని ఇలా చేశాడట. అయితే తన వ్యక్తిగత నిర్ణయాన్ని సాకుగా చూపి ఇతర సినిమాలకు ఇలా చేయకూడదని ఆమిర్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

News May 8, 2025

సన్‌స్క్రీన్ ఎన్నిసార్లు అప్లై చేయాలి..?

image

చర్మసంరక్షణలో సన్‌స్క్రీన్‌ది కీలకపాత్ర. వేసవిలో ప్రతిరోజూ సన్‌స్క్రీన్ రాసుకోవడం ముఖ్యం. ఇది చర్మానికి రక్షణను ఇచ్చి ట్యానింగ్, వృద్ధాప్యఛాయలు రాకుండా చూస్తుంది. ఎక్కువసేపు ఎండలో ఉండేవారు 2 గంటలకొకసారి సన్‌స్క్రీన్ రాసుకోవాలి. వేసవిలో వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్‌ వాడాలి. ప్రస్తుతం ఇంట్లో వాడే వివిధ రకాల లైట్ల వల్ల కూడా చర్మానికి హాని కలుగుతోంది. కాబట్టి ఇంట్లో ఉన్నా సన్‌స్క్రీన్ వాడటం మంచిది.

News May 8, 2025

డేటింగ్ వార్తలను కన్ఫర్మ్ చేసిన సమంత?

image

నటి సమంత డైరెక్టర్ రాజ్ నిడిమూరుతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సమంత ఇన్‌స్టా పోస్ట్ ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. తను నిర్మించిన ‘శుభం’ రేపు రిలీజవుతున్న నేపథ్యంలో రాజ్‌తో ఉన్న పిక్స్ షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు ‘లాంగ్ జర్నీ తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాం. న్యూ బిగినింగ్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సమంత తన లవ్ రిలేషన్‌ను అఫీషియల్ చేశారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News May 8, 2025

పాక్ రాడార్లపై దాడికి భారత్ వాడిన డ్రోన్లు ఇవే!

image

ఈ ఉదయం పాకిస్థాన్ <<16347211>>ఎయిర్ డిఫెన్స్ రాడార్లపై<<>> భారత్ అటాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్‌‌కు వాడినట్లు భావిస్తోన్న HAROP డ్రోన్లను భారత్ ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకొంది. ఇవి లక్ష్యాలని గుర్తించడానికే కాకుండా మిసైల్స్ గానూ పనిచేయగలవు. ఆటోమేటిక్ ఆపరేట్ సిస్టమ్ వీటి సొంతం. వాటి సామర్థ్య పరిధి 1000KM. కాగా వీటిని వాడినట్లు భారత్ అధికారికంగా ప్రకటించలేదు.

News May 8, 2025

పాక్ క్రికెటర్లకు PCB ఆదేశాలు

image

భారత్‌తో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ఆ దేశ క్రికెటర్లను రావల్పిండి నుంచి తిరిగి రావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) జరుగుతోంది. భారత్, పాక్ సరిహద్దులో రావల్పిండి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లాహోర్, ముల్తాన్, కరాచీ, రావల్పిండి వేదికల్లో PSL మ్యాచులు జరుగుతున్నాయి.

News May 8, 2025

సందీప్ శర్మ స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్

image

గాయంతో దూరమైన సందీప్ శర్మ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ మరో ప్లేయర్‌ను రీప్లేస్ చేసింది. దక్షిణాఫ్రికా పేసర్ బర్జర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. గత సీజన్‌లోనూ RR తరఫున ఆడిన బర్జర్ 6 మ్యాచుల్లో 7 వికెట్లు తీశారు. కాగా సందీప్ శర్మ వేలి గాయంతో దూరమయ్యారు. మరో ప్లేయర్ నితీశ్ రాణా స్థానంలో SA బ్యాటర్ ప్రిటోరియస్‌ను తీసుకుంది.

News May 8, 2025

అమెరికా జర్నలిస్టు మృతికి సిందూర్‌తో న్యాయం

image

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఆపరేషనల్ హెడ్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతం అంతర్జాతీయ సమాజ హితానికై చేసిన చర్యగా భారత ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. 1999లో IC 814 హైజాక్ సూత్రధారి రౌఫ్ ఆ తర్వాత భారత్ సహా ప్రపంచంపై పలు దాడులకు తెగబడ్డాడు. Wall Street Journal (USA) జర్నలిస్టు డేనియల్ పర్ల్ కిడ్నాప్, హత్య ఇందులో ఒకటి. నాడు ప్రపంచమే దిగ్భ్రాంతి చెందిన ఈ దారుణానికి సిందూర్‌తో నేడు న్యాయం జరిగిందని ఆర్మీ చెబుతోంది.