News November 3, 2025

కోయంబత్తూర్‌లో PG విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

image

కోయంబత్తూర్(TN) ఎయిర్ పోర్టు సమీపంలో PG విద్యార్థిని గ్యాంగ్ రేప్‌కి గురైంది. నిన్న సాయంత్రం ఆమె ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. రాత్రి 11గ.లకు ఎయిర్‌పోర్టు దగ్గర కారులో వారు ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి అద్దాలు పగులగొట్టారు. ప్రియుణ్ని తీవ్రంగా కొట్టారు. ఆమెను దూరంగా షెడ్లోకి లాక్కెళ్లి రేప్ చేశారు. పోలీసులు బాధితుల్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

News November 3, 2025

జూబ్లీహిల్స్‌కు పాక్‌కు లింక్ పెట్టడం సరికాదు: కిషన్ రెడ్డి

image

TG: రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌కు పాకిస్థాన్‌కు <<18176289>>లింక్<<>> పెట్టడం సరికాదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఫ్రీ బస్సు ఒక్కటే. జూబ్లీహిల్స్‌లో BJPకి మంచి స్పందన వస్తోంది. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం BJPకే ప్లస్. KCR రెండేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజల మధ్యకు రాని ఆయన మళ్లీ CM ఎలా అవుతారు?’ అని మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.

News November 3, 2025

మల్లె తోటల్లో ఆకులు రాల్చడం.. దేని కోసం?

image

మల్లె తోటల్లో మంచి దిగుబడి కోసం.. నవంబర్ నుంచి చెట్లకు నీరు పెట్టకుండా ఆకులు రాలేటట్లు చేయాలి. అలాగే కొందరు రైతులు మల్లె తోటల్లో గొర్రెలను మంద కడతారు. దీని వల్ల గొర్రెలు ఆకులను తింటాయి. ఫలితంగా మొక్కలకు కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే గొర్రెల ఎరువు వల్ల కూడా భూసారం పెరుగుతుంది. తర్వాత కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 నుంచి 15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి.

News November 3, 2025

రాబోయే 2 గంటల్లో వర్షం: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. ఈ సమయంలో 40-50kmph వేగంతో గాలులు వీస్తాయని, చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది.

News November 3, 2025

శీతాకాలం అతిథుల రాక మొదలైంది: పవన్

image

AP: పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథులైన ఫ్లెమింగ్ పక్షుల రాక మొదలైందని Dy.CM పవన్ అన్నారు. ‘ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్‌ను మారుస్తాం. ఫ్లెమింగోలు ఆహారం, విశ్రాంతి కోసం అక్టోబరులో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోతాయి. వాటికి ఇబ్బందులు కలగకుండా కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈసారి 3 రోజుల పండుగతో సరిపెట్టకుండా ఎకో టూరిజాన్ని విస్తరిస్తాం’ అని పవన్ చెప్పారు.

News November 3, 2025

ముంబైలో 70KMల అండర్ గ్రౌండ్ టన్నెల్: MMRDA

image

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ముంబై రోడ్లపై ప్రయాణమంటే అక్కడి వారికి రోజూ నరకమే. దాన్నుంచి తప్పించేందుకు MMRDA ఏకంగా 70KM మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ మార్గాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్టును రూపొందిస్తోంది. మూడు ఫేజ్‌లుగా నిర్మాణం జరగనుంది. అక్కడ నిర్మిస్తున్న అంతర్గత టన్నెల్ మార్గాలకు వేరుగా దీన్ని నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రయాణం సాఫీ అవుతుంది.

News November 3, 2025

ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM

image

TG: SLBC టన్నెల్ పనులపై BRS నేతలు రాజకీయాలు చేయడం తగదని CM రేవంత్ అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ మన్నేవారిపల్లిలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘SLBC పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. పదేళ్లలో 10kms కూడా పూర్తి చేయలేదు. కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారు’ అని విమర్శించారు.

News November 3, 2025

₹లక్ష కోట్లతో రీసెర్చ్ ఫండ్.. ప్రారంభించిన మోదీ

image

టెక్ రెవల్యూషన్‌కు భారత్ సిద్ధంగా ఉందని PM మోదీ అన్నారు. ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో ESTIC-2025 కాంక్లేవ్‌ను ప్రారంభించారు. ₹లక్ష కోట్లతో రీసెర్చ్, డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ (RDI) స్కీమ్ ఫండ్‌ను లాంచ్ చేశారు. ‘ఈ ₹లక్ష కోట్లు మీకోసమే. మీ సామర్థ్యాలను పెంచేందుకు, కొత్త అవకాశాలు సృష్టించేందుకు ఉద్దేశించినవి. ప్రైవేటు సెక్టార్‌లోనూ రీసెర్చ్‌ను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.

News November 3, 2025

ఆటిజం‌కు చికిత్స ఇదే..

image

ప్రపంచంలోని ప్రతి 68 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం అంటారు. దీనికి చికిత్స లేదు కానీ చిన్న వయసునుంచే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల మార్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఉంటాయి. వీటితో పాటు తల్లిదండ్రులే శిక్షకులుగా మారాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 3, 2025

‘SSMB29’ టైటిల్ ఇదేనా?

image

సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో తీస్తోన్న ‘SSMB29’ సినిమా టైటిల్ ప్రకటనకు దర్శకధీరుడు రాజమౌళి HYDలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూవీ టైటిల్‌ను ‘వారణాసి’గా ఫిక్స్ చేశారని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈవెంట్‌ను నవంబర్ 16న నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. ఇందులో 3 నిమిషాల కంటెంట్‌తో టైటిల్ గ్లింప్స్ వీడియోను సైతం రిలీజ్ చేస్తారని సమాచారం. ఈవెంట్‌పై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.