India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నివేదా థామస్, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ‘35 చిన్న కథ కాదు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత రానా ప్రకటించారు. ‘ఈ టీచర్స్ డేని 35 చిన్న కథ కాదు చిత్రంతో సెలబ్రేట్ చేసుకుందాం’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా గతేడాది సెప్టెంబర్ 6న రిలీజైన ఈ మూవీకి ‘గద్దర్ ఉత్తమ బాలల చిత్రం’ అవార్డు వరించింది.
జియో, ఎయిర్‌టెల్ సిగ్నల్స్ రాక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఒకప్పటి రోజులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇంట్లో ఏదో ఒకచోటే సిగ్నల్ ఉండటం, అక్కడే నిలబడి ఫోన్ వాడటం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వీడియోలేమో ‘లోడింగ్.. లోడింగ్’ అంటున్నాయి. గ్రామాలను పక్కనపెడితే హైదరాబాద్ వంటి నగరాల్లోనూ నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఫోన్లు కలవడం లేదని చాలామంది వాపోతున్నారు. మీరేమంటారు?
AP: విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వైజాగ్‌కు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటుకు అనుగుణమైన పాలసీని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
అఫ్గానిస్థాన్‌లో సంభవించిన <<17587630>>భూకంప ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 1,411 మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 3,124 మంది గాయపడ్డారని, 5,412 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత కునార్ ప్రావిన్సులోని ఆసదాబాద్, నుర్గల్, ఛౌకే, వాటాపూర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
TG: బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కవిత రేపు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్‌లోని జాగృతి ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయడంపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
TG: ఐదు నెలల కమీషన్ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం ఈనెల 5న బంద్‌కు పిలుపునిచ్చింది. గత ఐదు నెలలుగా డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం రూ.5 వేలు, కమీషన్ రూ.300 పెంచాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.
ట్విటర్ వేదికగా ఆగస్టు నెలలో అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల జాబితాలో ప్రధాని మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక జులైలో మూడో స్థానంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా రెండో ర్యాంకుకు ఎగబాకారు. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకూ X డేటా, ఇండియాలోని యూజర్ల పోస్ట్స్ నంబర్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు. వీరి తర్వాత విజయ్, పవన్, గిల్, రాహుల్ గాంధీ, కోహ్లీ, మహేశ్‌బాబు, ధోనీ, రజినీకాంత్ ఉన్నారు.
TG: ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని డైవర్షన్ చేసేందుకు కవితను సస్పెండ్ చేశారని ఎంపీ డీకే అరుణ అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అధికారంకోసం పంచాయితీ జరుగుతోందన్నారు. BRS, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ‘1070’ను అందుబాటులో తీసుకొచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే వెంటనే ఈ నంబర్‌కు సమాచారాన్ని అందించవచ్చని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, చెట్లు నేలకూలడం, వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినా హైడ్రా సేవల కోసం సంప్రదించవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు మరో 3 నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు.
AP: విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మారీటైమ్ రంగంలోని బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్, ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీ లేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. పలు కంపెనీల సీీఈవోలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.