India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిశ్రక్ గ్రామంలో దీపావళి పండుగను జరుపుకోరు. రావణాసురుడు ఇక్కడే పుట్టారని ఇక్కడి ప్రజలు నమ్మడమే ఇందుకు కారణం. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఇక్కడే పుట్టి లంకకు వెళ్లి రాజ్యాన్ని పాలించారని నమ్ముతుంటారు. ఇక్కడి పురాతన శివలింగాన్ని రావణుడు, ఆయన తండ్రి విశ్రవసుడు పూజించారనేది స్థానిక కథనం. దీపావళి రోజున బాణసంచా కాల్చడానికి బదులు రావణుడి ఆత్మశాంతి కోసం యజ్ఞాలు చేస్తుంటారు.
➦క్లాసెన్ రూ.23 కోట్లు
➦రూ.21 కోట్లు: విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్
➦రూ.18కోట్లు: రుతురాజ్ గైక్వాడ్, జడేజా, బుమ్రా, పాట్ కమిన్స్, రషీద్ ఖాన్, సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు Xలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. చంద్రబాబు నేతృత్వంలో అమరావతి ఐటీ సిటీగా బలపడి హైదరాబాద్‌ను అధిగమిస్తుందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘చంద్రబాబు సాధించాలనే తపన ఉన్న లీడర్ కానీ HYD స్వంతగానే అభివృద్ధి చెందింది. గతంతో పోలిస్తే ఐటీలో బెంగళూరును దాటేసింది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు’ అని అన్నారు.
➢ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ రూల్ అమలు
➢రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు తగ్గింపు
➢SBI క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలు 3.75శాతానికి పెంపు
➢ICICI క్రెడిట్ కార్డు ఫీజు, క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ విధానంలో మార్పులు(నవంబర్ 15 నుంచి అమలు)
➢ఇండియన్ బ్యాంక్ ఎఫ్‌డీ స్కీమ్ గడువు Nov 30 వరకు పెంపు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు Nov 5న పోలింగ్ జరగనుంది. అమెరికన్లు నేరుగా అధ్యక్షుడికి ఓటు వేయరు కాబట్టి <<14452559>>ఎలక్టర్లను<<>> ఎన్నుకుంటారు. పోలింగ్ తరువాత అధ్యక్ష అభ్యర్థి గెలుపుపై స్పష్టత వచ్చినా Dec 16న ఎలక్టర్లు కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకుంటారు. ఇది అమెరికా అధ్యక్షుడి అసలైన ఎన్నిక. అనంతరం ఈ ఫలితాలను Jan 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు.
కొందరు ఆటగాళ్లు రిటెన్షన్లలో బంపరాఫర్ కొట్టేశారు. వారిలో అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), పరాగ్ (రూ.14 కోట్లు), జురేల్ (రూ.14 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ (రూ.11 కోట్లు), రింకూ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), స్టబ్స్ (రూ.10 కోట్లు), పాటీదార్ (రూ.11 కోట్లు), పతిరణ (రూ.13 కోట్లు), దూబే (రూ.12 కోట్లు) ఉన్నారు.
1963 కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఆర్మీకి ప్యానల్ మీటర్లు సరఫరా చేయడానికి TP గోపాలన్ నంబియార్ బ్రిటిష్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ (BPL)ను స్థాపించారు. అనంతరం ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని సంస్థ ప్రారంభించింది. దీంతో 1990 దశకంలో ప్రతి ఇంటా మనకు BPL టీవీలు కనిపించేవి. అలా ప్రతి ఇంట్లో వస్తువు స్థాయికి సంస్థ ఎదిగింది. నెలలో 10 లక్షల TVల విక్రయంతో BPL అప్పట్లో సంచలనం సృష్టించింది.
టీమ్‌ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. కెప్టెన్ డుప్లిసెస్, మ్యాక్స్‌వెల్, గ్రీన్‌లను సైతం వేలంలోకి వదిలేసింది. రూ.37 కోట్లు వెచ్చించి ముగ్గురిని రిటైన్ చేసుకుంది. కాగా ఐపీఎల్ 2024లో రూ.7కోట్లకు సిరాజ్‌ను RCB కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన సిరాజ్ 15 వికెట్లు తీసి 496 పరుగులిచ్చారు. మరి మెగా వేలంలో ఈ హైదరాబాదీ పేసర్ ఎంత పలుకుతాడో కామెంట్ చేయండి.
మహారాష్ట్రలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో BRS పోటీ చేస్తుందా? అన్న ప్రశ్నకు #AskKTRలో KTR వివరించారు. ‘ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉంది’ అని బదులిచ్చారు. అటు HYDలో నెలరోజులు 144 సెక్షన్ పెట్టడం షాకింగ్ అంశమని, రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ డిజాస్టర్ అని ఆయన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
Sorry, no posts matched your criteria.