News November 3, 2025

US ఆంక్షల ఎఫెక్ట్.. చైనా మాస్టర్ ప్లాన్!

image

రష్యా ఆయిల్ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో చైనా తమ చమురు నిల్వలను భారీగా పెంచుకుంటోంది. 2025లో తొలి 9 నెలల్లో చైనా రోజుకు 11M బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇందులో 1-1.2M బ్యారెళ్లను నిల్వల కోసం దారి మళ్లించినట్లు వివరించింది. చమురు అవసరాల కోసం ఆ దేశం 70% విదేశాలపైనే ఆధారపడుతోంది. చైనా చమురు నిల్వల సామర్థ్యం 2 బిలియన్ బ్యారెళ్లకు పైగా ఉందని అంచనా.

News November 3, 2025

అడగడానికి ఇంకేం ప్రశ్నలే లేవా.. మీడియాపై సిద్దరామయ్య ఆగ్రహం

image

కర్ణాటకలో సీఎం మార్పు గురించి ఇటీవల జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా CM సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. ‘అడగడానికి ఇంకేం ప్రశ్నలు లేవా? ప్రజలు తమకు నచ్చిన దాని గురించి మాట్లాడుకోనీయండి. హైకమాండ్ ఎవరు? సోనియాగాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే చెప్పారా దీని గురించి’ అని ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానంతో మాట్లాడతానని తెలిపారు.

News November 3, 2025

సమీకృత వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలు

image

జనాభా పెరుగుదలకు సరిపడే ఆహారం ఉత్పత్తి చేయవచ్చు. కోళ్లు, మేకలు, పందులు, గొర్రెలు, పశువుల పెంపకం వల్ల వచ్చే వ్యర్థాలను సమర్థంగా వినియోగించి భూసారాన్ని పెంచవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకంతో సాగుకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. సమగ్ర వ్యవసాయం నుంచి వచ్చే గుడ్లు, పాలు, పుట్టగొడుగులు, కూరగాయలు, తేనే వల్ల రైతులకు నికర ఆదాయం లభిస్తుంది. సమగ్ర వ్యవసాయంతో ఏడాది పొడవునా ఉపాధి, రైతులకు ఆదాయం లభిస్తుంది.

News November 3, 2025

చెదిరిన కలలు, చెరిగిన జీవితాలు

image

21మంది చనిపోయిన మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్స్, ఉపాధి కోసం బయల్దేరిన కూలీలు, ఆస్పత్రిలో చికిత్స కోసం బస్సెక్కిన ఫ్యామిలీ, రైలు మిస్ కావడంతో బస్ అందుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక్కో కథ, కల. కానీ అవన్నీ ఒక్క ప్రమాదంతో కల్లలయ్యాయి. కంకర టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు అందరి జీవితాలకు రాళ్ల సమాధి కట్టింది.

News November 3, 2025

సుప్రీం కోర్టుకు రాష్ట్రాల CSలు క్షమాపణలు

image

వీధికుక్కల వ్యవహారంలో AP సహా పలు రాష్ట్రాల CSలు సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. అఫిడవిట్ల దాఖలు ఆలస్యానికి వారు క్షమాపణలు చెప్పారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు. తాము Oct 29నే అఫిడవిట్ ఇచ్చామని AP CS తెలిపారు. రాష్ట్రాల అఫిడవిట్ల ఆధారంగా స్ట్రే డాగ్స్ కోసం ఛార్ట్ రూపొందించాలని అమికస్ క్యూరీకి SC సూచించింది. కాగా కేసులో కుక్కకాటు బాధితులను ప్రతివాదులుగా చేర్చేందుకు కోర్టు అంగీకరించింది.

News November 3, 2025

శుభ కార్యాలు నిర్విఘ్నంగా జరగాలంటే..

image

యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యా పరశ్శతమ్|
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే||
‘విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడికి గణపతి సహా 100+ పరివార దేవతలున్నారు. ఆ పరివారంతో కలిసి ఆయన భక్తుల ఆటంకాలను, విఘ్నాలను నిత్యం తొలగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విఘ్న నివారకుడైన విష్వక్సేనుడిని నేను ఆశ్రయిస్తున్నాను’ అని దీనర్థం. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరగడానికి విష్వక్సేనుడిని పూజించాలని శాస్త్రవచనం. <<-se>>#NAMAMSARAM<<>>

News November 3, 2025

కుంకుమాది తైలంతో చర్మ సంరక్షణ

image

చర్మసమస్యలను నివారించడంలో కుంకుమాది తైలం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మాయిశ్చరైజర్, మసాజ్ క్రీమ్‌లతో కలిపి వాడుకోవచ్చు. ముడతలు, నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మొటిమలు ఉన్నవారు దీన్ని వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. బాదం, నువ్వులనూనెతో కలిపి అప్లై చేస్తే సీరంలాగా ఉపయోగపడుతుంది.

News November 3, 2025

చిరకాల విజయం తర్వాత కాబోయే భర్తతో స్మృతి

image

ప్రపంచకప్ విజయం తర్వాత భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన కాబోయే భర్త, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో కలిసి కప్పును పట్టుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఈనెలలోనే వీరిద్దరూ <<18043744>>పెళ్లి<<>> చేసుకోనున్నారు. కెరీర్‌లో అత్యున్నత విజయాన్ని సాధించిన ఈ సంతోష క్షణాన్ని ప్రియమైన వ్యక్తితో పంచుకోవడం అద్భుతంగా ఉందని అభిమానులు కొనియాడుతున్నారు.

News November 3, 2025

JEEలో కాలిక్యులేటర్‌ను అనుమతించం: NTA

image

IIT, NITలలో ప్రవేశాలకు నిర్వహించే JEE మెయిన్‌లో కాలిక్యులేటర్‌ను అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్పష్టం చేసింది. JEE-2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్లో CBTలో కంప్యూటర్ స్క్రీన్‌పై కాలిక్యులేటర్‌కు అవకాశం ఉంటుందని పేర్కొంది. దీనిపై తాజాగా స్పష్టత ఇస్తూ టెస్టులో కాలిక్యులేటర్‌ను నిషేధించినట్లు తెలిపింది. బులెటిన్లో తప్పు దొర్లినందుకు విచారం వ్యక్తం చేస్తూ తాజా సవరణ నోట్‌ను వెబ్సైట్లో ఉంచింది.

News November 3, 2025

ONGCలో 2,623 అప్రెంటీస్‌లు.. అప్లై చేశారా?

image

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అభ్యర్థులను విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/