News September 2, 2025

విధేయుడి వైపే నిలబడ్డ గులాబీ బాస్!

image

TG: కవిత వర్సెస్ హరీశ్ ఎపిసోడ్‌లో గులాబీ బాస్ KCR.. హరీశ్ వైపే నిలబడ్డారు. ఆరోపణలు చేసి 24 గంటలు గడవకముందే కవితను సస్పెండ్ చేశారు. కన్న కూతురైనా పార్టీ తర్వాతే అనే స్పష్టమైన సంకేతాలు కేడర్‌కు పంపారు. పార్టీకి హరీశ్ వెన్నుపోటు పొడుస్తారని గతంలో ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. కానీ అవేమీ లెక్కచేయని ఆయన.. కేసీఆరే తన అధినేత అని కుండబద్దలు కొట్టారు. అదే విధేయత ఇప్పుడు అధినేత తనవైపు నిలబడేలా చేసింది.

News September 2, 2025

పంట నష్టంపై 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలి: మంత్రి తుమ్మల

image

TG: వర్షాలు, వరదలతో నష్టపోయిన పంట వివరాలపై 5 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అటు నిన్న ఒక్కరోజే 9వేల మెట్రిక్ టన్నుల(MT) యూరియా రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. ఇవాళ మరో 5వేల MTలు, వారం రోజుల్లో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా డిమాండ్‌కు తగ్గట్లుగా యూరియా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News September 2, 2025

కవిత కల్లోలాన్ని వివరిస్తున్న వేమన పద్యం

image

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా
విశ్వదాభిరామ వినురవేమ
—–
భావం: చెప్పులో రాయి ఉంటే నడకలో, చెవి చుట్టూ ఈగ శబ్దం చేస్తుంటే ఇబ్బందులు తప్పదు. కంట్లో నలుసు, కాలి ముల్లు మనకు గుచ్చుతూనే ఉంటాయి. అలాగే ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా మన ఇంట్లో పోరుతో మనకు బాధ ఎక్కువ.

News September 2, 2025

మరోసారి బోయపాటితో అల్లు అర్జున్ సినిమా?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీనుతో ‘సరైనోడు-2’ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అల్లు అరవింద్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. బాలకృష్ణతో బోయపాటి తీస్తున్న ‘అఖండ-2’ హిట్ అయితే బన్నీ-బోయపాటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

News September 2, 2025

MLCగా తప్పుకోనున్న కవిత?

image

BRS తనను సస్పెండ్ చేయడంతో ఆ పార్టీతో సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంపై జాగృతి నేతలతో కవిత చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీతో ఉన్న ఏకైక రిలేషన్ MLC పదవి నుంచి తప్పుకుంటారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో BRS తరఫున 2022లో MLCగా ఎన్నికైన కవిత పదవీకాలం 2028సం. వరకు ఉంది. కానీ ఇప్పుడు పార్టీ ఇచ్చిన పదవిలో ఉంటే విమర్శలు వస్తాయని ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు.

News September 2, 2025

కవిత ఎలా రియాక్ట్ అవుతారో?

image

TG: BRS నుంచి తనను సస్పెండ్ చేయడంపై కవిత ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె, ఇకపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తారా? లేక సైలెంట్‌గా ఉంటారా? అనేది ఆసక్తికరం. అయితే కవిత తీరు చూస్తుంటే మౌనంగా ఉండబోరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త పార్టీ పెట్టి, రాబోయే రోజుల్లో BRSపై బాణాలు ఎక్కుపెట్టే అవకాశం ఉందంటున్నారు. మీరేమంటారు?

News September 2, 2025

కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్సే: పల్లా

image

TG: పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బీఆర్ఎస్ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు. ‘పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవు. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ఉంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినందుకే ఆమెపై వేటు వేశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 2, 2025

‘సినిమా చెట్టు’కు పునర్జన్మ!

image

ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా కుమారదేవం గ్రామంలో ఉన్న ‘సినిమా చెట్టు’ తిరిగి జీవం పోసుకుంటోంది. 145 ఏళ్లనాటి ఈ వృక్షం గతేడాది గోదావరి వరదల వల్ల కూలిపోయింది. రోటరీ క్లబ్ ఈ చెట్టు పునర్జీవం కోసం చేసిన ప్రయత్నాలతో మళ్లీ చిగురించింది. భవిష్యత్తులో ఇక్కడ సినిమా షూటింగ్స్ జరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవత, బొబ్బిలి రాజా, సీతారామయ్య గారి మనుమరాలు సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది.

News September 2, 2025

కవిత పొలిటికల్ జర్నీ

image

TG: కవిత 2006లో ‘తెలంగాణ జాగృతి’ ఏర్పాటు చేసి ఉమ్మడి APలో తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. బతుకమ్మతో వాడవాడలా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 2019లో ధర్మపురి అర్వింద్ (BJP) చేతిలో ఓడిపోయారు. 2020, 22లో NZB జిల్లా స్థానిక సంస్థల MLCగా విజయం సాధించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై 2024 MAR నుంచి AUG వరకు తిహార్ జైల్లో ఉన్నారు.

News September 2, 2025

‘కాళేశ్వరం’ అవినీతికి KCR బాధ్యత వహించాల్సిందే: TPCC చీఫ్

image

TG: కవిత మాటలతో ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగినట్లు తేలిపోయిందని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. ‘కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న KCR అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే. వాటాల పంపకాల్లో తేడాతోనే అంతర్గత కుమ్ములాట జరుగుతోంది. ఎవరి వాటా ఎంతనేది CBI విచారణలో తేలుతుంది. వేగవంతంగా విచారణ చేయకుండా సాగదీస్తే BJP, BRS ఏకమయ్యాయని నిరూపితమవుతుంది’ అని వ్యాఖ్యానించారు.