India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అభ్యర్థులను విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రాలో వర్షం పడుతోంది. రాబోయే 2 గంటల్లో అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా తమ అభిప్రాయం తెలిపేందుకు గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.

బిహార్ ఎన్నికల్లో ‘ఇండీ’ కూటమి ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామన్న విమర్శలను MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ‘2020లో 5 సీట్లు గెలిచాం. పోటీచేసిన మిగతా 14లో 9 MGB గెలిచింది. 2024లో కిషన్‌గంజ్ MP సీటులో 2 లక్షలకుపైగా ఓట్లు సాధించాం. మేం ఆ ఒక్క సీట్లో పోటీచేసినా BJP అనేక చోట్ల గెలిచింది’ అని తెలిపారు. గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయడానికే తమ పోటీ అన్నారు. ఈసారి MIM 24చోట్ల పోటీ చేస్తుంది.

భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా.. చిన్నచిన్న తప్పులు చేస్తుండటమే.. ‘మైక్రో చీటింగ్’. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు. ఇందులో చాలామందికి చెడు ఉద్దేశాలూ ఉండవని అంటున్నారు నిపుణులు. కానీ చిన్నచిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతిని దీర్ఘకాలంలో విడాకులకూ దారితీస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.

సీఏ(ఛార్టర్డ్ అకౌంటెన్సీ)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ రిజల్ట్స్ ICAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: <

కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అభిషేకించిన అన్నాన్ని ప్రసాదంగా పంచి పెడతారు. ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని వీక్షించి, ప్రసాదంగా కొంచెం అన్నాన్ని స్వీకరించడం వలన ఎలాంటి రోగాలైన పోతాయని, సమస్త పాపాలు నశించిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్తున్న భక్తులకిది మంచి అవకాశం.

CSIR-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NEERI) మద్రాస్ కాంప్లెక్స్ 3 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 7న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.31వేలతో పాటు HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.csircmc.res.in/

ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్స్‌ను చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారు. త్వరగా ఫుడ్ తింటారనే ‘స్క్రీన్ ఫీడింగ్’ చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఆలస్యంగా మాటలు రావడం, ఏకాగ్రత లోపించడం, తల్లిదండ్రులతో మానసిక అనుబంధం తగ్గడం వంటి తీవ్ర సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. భోజన సమయంలో మొబైల్‌ను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. మీరూ ఇలానే చేస్తున్నారా? COMMENT

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183462>>బస్సు<<>> ప్రమాదానికి టిప్పర్ అతివేగంతో పాటు ఓ గుంత కూడా కారణమని తెలుస్తోంది. చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్తున్న టిప్పర్ గుంతను తప్పించబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంతో ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో 50-60 టన్నుల కంకర బస్సుపై పడటంతో అందులోని ప్రయాణికులు ఊపిరాడక చనిపోయారు. బస్సులో కెపాసిటీకి మించి 72 మంది ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
Sorry, no posts matched your criteria.