India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
TG: మేడారంలో గోవింద రాజు, పగిడిద్ద రాజు గద్దెల మార్పు అంశంతో ప్రభుత్వానికి, మంత్రులు సీతక్క, సురేఖకు ఎలాంటి సంబంధం లేదని పూజారుల సంఘం ప్రకటించింది. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలాలను ముట్టుకోకుండా ఈ మార్పు జరుగుతుందని పేర్కొంది. భక్తుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా దేవతల గద్దెలు ఒక్కో దిక్కున ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
AP: ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి TDP, జనసేన, YCP మద్దతుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘తెలుగు జాతికి నేడు చీకటి రోజు. తెలుగు బిడ్డ(సుదర్శన్ రెడ్డి) పోటీ పడితే, RSS వాదికి ఓటు వేయించిన 3 పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు. మత పిచ్చి మోదీకి మోకాళ్లు ఒత్తడమే వారి లక్ష్యం. BJPకి ఓటు వేసినందుకు YCP సిగ్గుపడాలి. కేసులకు భయపడి మోదీకి జగన్ దత్తపుత్రుడిగా అవతారం ఎత్తారు’ అని ట్వీట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోనే హీరోయిన్ నయనతార-చిరు మధ్య ఓ మెలోడీ సాంగ్ తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో చిరంజీవి తాజా లుక్ SMలో వైరల్ అవుతోంది. వింటేజ్ లుక్‌లో మెగాస్టార్ అదిరిపోయారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కల్వకుంట్ల కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు నారా లోకేశ్ స్పందించారు. ‘కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిది’ అని వ్యాఖ్యానించారు. తాను KTRను వివిధ సందర్భాల్లో కలిశానని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. NDA అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్‌ను అడగాలని మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.
లద్దాక్‌లోని సియాచిన్ సెక్టార్ బేస్ క్యాంపులో విషాదం జరిగింది. డ్యూటీలో ఉన్న మహర్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు మంచులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, రెస్క్యూ టీమ్స్ 5 గంటల పాటు కష్టపడి కెప్టెన్‌ను రక్షించాయి. ప్రాణాలు కోల్పోయిన సైనికులు గుజరాత్, యూపీ, ఝార్ఖండ్‌కు చెందిన వారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సియాచిన్ సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఓలీ <<17657494>>రాజీనామాతో<<>> నేపాల్ తదుపరి PM ఎవరన్న చర్చ మొదలైంది. కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సివిల్ ఇంజినీర్, ర్యాపర్ అయిన షా 2022లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మేయర్ అయ్యారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ SMలో యాక్టివ్‌గా ఉండే షాకు యువత మద్దతు ఉంది. ఆయన PMగా బాధ్యతలు చేపట్టాలని ఆన్‌లైన్ క్యాంపెయిన్ కూడా మొదలైంది. కాగా కేవలం కాఠ్‌మాండూలోనే 18 మంది ఆందోళనకారులు మరణించారు.
కొన్ని రోజులుగా జైలులో సూర్యరశ్మి తాకట్లేదని కన్నడ హీరో దర్శన్ కోర్టుకు తెలిపారు. తాను ఫంగస్‌తో బాధపడుతున్నానని, తన దుస్తులు స్మెల్ వస్తున్నాయని వాపోయారు. బయటకు వెళ్లేందుకు అనుమతివ్వాలని లేదా విషం ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణను సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని గత నెలలో <<17401764>>దర్శన్<<>> బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
AP: అనంతపురం పట్టణంలో రేపు ‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ సభకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో రద్దీ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చినట్లు తెలిపారు. రేపు హాలిడే ఇస్తున్న కారణంగా రెండో శనివారమైన ఈ నెల 13న పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేస్తాయన్నారు.
1.హిమాలయ దేశం నేపాల్లో నెలకొన్న అవినీతి, దానికి పరిష్కారం లేకపోవడంపై ఆ దేశ Zen Z(యువత) ‘అసహనం’తో ఉంది. 2.కొందరు నేతలు కుటుంబాలతో విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడిపే వీడియోలు ఇటీవల వైరలవగా ప్రజా ధనంతో పాలకుల జల్సాలా? అనే ‘ఆవేదన’ వ్యక్తమైంది. 3.దేశంలో రిజిస్టర్ కాలేదని SM సైట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో తమ గొంతును పాలకులు అణిచివేశారనే ‘ఆగ్రహం’తో నిరసన జ్వాల నియంత్రణ తప్పి కార్చిచ్చులా దహిస్తోంది.
Sorry, no posts matched your criteria.