India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కవిత 2006లో ‘తెలంగాణ జాగృతి’ ఏర్పాటు చేసి ఉమ్మడి APలో తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. బతుకమ్మతో వాడవాడలా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 2019లో ధర్మపురి అర్వింద్ (BJP) చేతిలో ఓడిపోయారు. 2020, 22లో NZB జిల్లా స్థానిక సంస్థల MLCగా విజయం సాధించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై 2024 MAR నుంచి AUG వరకు తిహార్ జైల్లో ఉన్నారు.
TG: కవిత మాటలతో ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగినట్లు తేలిపోయిందని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. ‘కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న KCR అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే. వాటాల పంపకాల్లో తేడాతోనే అంతర్గత కుమ్ములాట జరుగుతోంది. ఎవరి వాటా ఎంతనేది CBI విచారణలో తేలుతుంది. వేగవంతంగా విచారణ చేయకుండా సాగదీస్తే BJP, BRS ఏకమయ్యాయని నిరూపితమవుతుంది’ అని వ్యాఖ్యానించారు.
TG: BRS అధినేత కేసీఆర్ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నాకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె పార్టీలో ఉంటూ కీలక నేతలపై ఆరోపణలు చేస్తే తీవ్ర నష్టం కలుగుతుందని లీడర్లు అధినేతకు చెప్పినట్లు సమాచారం. కవిత సస్పెన్షన్‌తో పార్టీ లైన్ దాటితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు పంపినట్లైంది.
TG: BRS MLC కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. బీసీ కాన్సెప్ట్ ప్రధానాంశంగా ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ పేరుతో దీపావళికి లాంచ్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో ఇంటిపక్కనే మూడంతస్తుల భవనం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ‘TRS’ పేరూ పరిశీలనలో ఉందని, ఇప్పటికే ఈ పేరుకు ప్రాచుర్యం ఉండటంతో జనాల్లోకి వెళ్లడం సులభం అని భావిస్తున్నారట.
TG: కవితను BRS సస్పెండ్ చేసింది కానీ బహిష్కరించలేదు. సస్పెండ్ చేస్తే మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొంత కాలం తర్వాత వారిలో మార్పు వచ్చి, వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తివేయొచ్చు. గతంలో BRS పార్టీ గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఈటల రాజేందర్, ఆలె నరేంద్ర, రెహమాన్ లాంటి కీలక నేతలను బహిష్కరించింది. బహిష్కరిస్తే తిరిగి పార్టీలోకి వచ్చేందుకు అవకాశం ఉండదు.
TG: MLC కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు BRS ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా హరీశ్ రావుపైనే అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీశ్, సంతోష్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు కలశంపై కొబ్బరికాయను ఉంచి పూజిస్తారు. ఈ ఆచారాన్ని కలశ స్థాపన అంటారు. పూజ తర్వాత ఆ కొబ్బరికాయను ఓ వస్త్రంలో చుట్టి ఇంట్లోనే కడుతుంటారు. అలా చేయనివారు దాన్ని పారుతున్న నీటిలో/దగ్గర్లోని జలాశయాల్లో నిమజ్జనం చేయవచ్చని పండితులు సూచిస్తున్నారు. పీఠంపై ఉంచిన బియ్యంతో పాటు కొబ్బరికాయను కూడా బ్రాహ్మణులకు ఇవ్వొచ్చని అంటున్నారు. బ్రాహ్మణులు ఆ కొబ్బరికాయను ‘పూర్ణాహుతి’కి వాడతారు.
TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అల్వాల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, జనగాం, భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ తెలిపింది.
మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా తెరకెక్కిన ‘సైయారా’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.581కోట్లు(గ్రాస్) రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో భారత సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన లవ్ స్టోరీగా నిలిచినట్లు వెల్లడించారు. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్నట్లు తెలిపారు. భారీ విజయం అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు.
TG: ఎమ్మెల్సీ కవితపై వేటు వేసేందుకు BRS పార్టీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా నోట్ విడుదల చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో BRS నేతలు మీడియా ముందుకు రానున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారని కవిత నిన్న సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.