News September 2, 2025

వరద బాధితులకిచ్చే పరిహారం పెంపు

image

TG: భారీ వర్షాలు, వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం రూ.4 లక్షల నుంచి <<17585460>>రూ.5 లక్షలకు<<>> పెంచింది. అలాగే పశువులు, జంతువుల యజమానులకు ఇచ్చే పరిహారాన్ని కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆవులు, గేదెలు వంటి పాలిచ్చే జంతువులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.37,500 నుంచి రూ.50,000కి, మేకలు, గొర్రెలు వంటి చిన్న జంతువులకు రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

News September 2, 2025

ఓన్లీ కాలింగ్ ప్లాన్ తెచ్చేలా ఆదేశించొచ్చుగా!

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకులు జీరో-బ్యాలెన్స్ ఖాతాలను అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అదేవిధంగా TRAI కూడా అన్ని టెలికం కంపెనీలకు ఓన్లీ కాలింగ్ రీఛార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంచాలని ఆదేశించాలని నెటిజన్లు కోరుతున్నారు. డేటా అవసరం లేకపోయినా చాలామంది సీనియర్ సిటిజన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నారని, రూ.100తో ఓన్లీ కాలింగ్ ప్లాన్ తీసుకొస్తే బాగుంటుందని డిమాండ్ నెలకొంది. మీరేమంటారు?

News September 2, 2025

కడపలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేశ్

image

AP: దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా సి.కె.దిన్నె MPP హైస్కూలులో అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్‌ను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. కమలాపురం, జమ్మలమడుగు, కడపలో మరో 5 కిచెన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. వీటి ద్వారా 12 వేల మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. డిసెంబర్ నాటికి కడప జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు భోజనం అందిస్తామని లోకేశ్ ప్రకటించారు.

News September 2, 2025

వెయిట్‌లిఫ్టింగ్‌తో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

image

మహిళల ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే వెయిట్‌లిఫ్టింగ్ కూడా వ్యాయామంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది బోన్స్‌ను హెల్తీగా ఉంచి ఎముకల సాంద్రతను పెంచుతుంది. వెయిట్‌లిఫ్టింగ్‌ తర్వాత శరీరంలో ఆక్సిజన్ వినియోగం పెరిగి వర్కవుట్ తర్వాత కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఎండార్ఫిన్‌ హార్మోన్‌ను విడుదల చేసి మీ మానసిక ఆరోగ్య స్థితిని పెంచుతుంది.

News September 2, 2025

ఇంటర్ అర్హతతో 48 పోస్టులు

image

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ 48 డేటా ఎంట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం గల అభ్యర్థులు ఈ నెల 4వరకు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. వెబ్‌సెట్: https://icsil.in/

News September 2, 2025

ఇంటర్వ్యూలో ఎలా రాణించాలి?(2/1)

image

గ్రూప్స్, సివిల్స్‌తోపాటు కార్పొరేట్ సెక్టార్‌లో ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూ చాలా కీలకం. ఇందులో ఎలా రాణించాలంటే..
* నిటారుగా కూర్చోవాలి. బిగుసుకుపోకూడదు. అదే సమయంలో లెక్కచేయనట్లుగా కనిపించకూడదు.
* మీలో ఆత్మవిశ్వాసం కనిపించాలి. మీ బలాల గురించి చెప్పాలిగానీ బలహీనతల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
* మీ అనుభవాలు, సామర్థ్యాల గురించి అతిశయోక్తులు చెప్పొద్దు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి.

News September 2, 2025

ఇంటర్వ్యూలో ఎలా రాణించాలి?(2/2)

image

* ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సమాధానం ఇవ్వండి. లేదంటే మరోసారి ప్రశ్నను అడిగి తెలుసుకోండి. జవాబు తెలియకపోతే తెలియదనే చెప్పండి.
* ఇంటర్వ్యూ నిర్వహించే సభ్యులతో మొండిగా వాదించొద్దు. ఏదైనా తప్పు ఉంటే ఒప్పుకోండి.
* అదే సమయంలో జోక్స్ వేస్తూ మాట్లాడొద్దు. ఏ విషయమైనా సాగదీత ధోరణి సరికాదు.
* ప్రస్తుతం మీరేం చేస్తున్నారనే ప్రశ్నకు క్లుప్తంగా ఆన్సరివ్వాలి. దాని గురించి ఎక్కువగా చర్చించకూడదు.

News September 2, 2025

తల్లి అనారోగ్యానికి గురైతే బిడ్డకు పాలివ్వొచ్చా?

image

పుట్టిన బిడ్డకు 6నెలలు వచ్చే వరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అయితే తల్లి అనారోగ్యానికి గురైతే పాలివ్వొచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. తల్లికి సీజనల్ వ్యాధులు సోకినా బిడ్డను దూరంగా ఉంచకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే నవజాత శిశువుకు తల్లి పాలు ఇవ్వడం ముఖ్యం. అవి బిడ్డకు రోగనిరోధకశక్తిని ఇస్తాయి. తల్లిజ్వరం బిడ్డకు సోకదు. అయితే ఈ సమయంలో తల్లి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి.

News September 2, 2025

మహిళలూ ఈ లక్షణాలున్నాయా?

image

మహిళల్లో అవయవాల పనితీరును సమన్వయపరిచే హార్మోన్లలో ఈస్ట్రోజన్ ఒకటి. ఇది తగ్గడం వల్ల మహిళల్లో నెలసరి అస్తవ్యస్తం, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, తలనొప్పి, చర్మం పొడిబారడం, అధికబరువు వంటి సమస్యలు వస్తాయి. ఈస్ట్రోజన్ పెరగాలంటే టోఫు, సోయా, బఠానీలు, ఆప్రికాట్స్, బ్రొకొలీ, కాలీఫ్లవర్, ఫ్లాక్స్, గుమ్మడి సీడ్స్, పెసర మొలకలు తినాలి. తక్కువ బరువు ఉన్నా, అవసరానికి మించి వ్యాయామం చేసినా ఈస్ట్రోజన్ తగ్గుతుంది.

News September 2, 2025

గాయత్రీ మంత్ర పఠనం.. మోక్షానికి మార్గం

image

గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు. రోజూ కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఓంకార ధ్యానం ద్వారా లభించే ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ మంత్ర పఠనం వల్ల ఆరోగ్యం, తేజస్సు, అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయని అంటున్నారు. ‘గాయత్రీ మంత్రం మనసును శుద్ధి చేసి, సదాలోచనలను, జ్ఞానాన్ని అందిస్తుంది. జనన మరణాల చక్రం నుంచి విముక్తి కలిగించి, మోక్షానికి మార్గం చూపుతుంది’ అని సూచిస్తున్నారు.