India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తదితరులకు ఆయా ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చాయి. వీరందరిని వేలానికి వదిలేశాయి. దీంతో వీరందరూ వచ్చే నెలలో జరిగే మెగా వేలంలో ఉంటారు. వీరిలో కొందరు రూ.20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
AP: ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పర్యటించనున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్‌ను లబ్ధిదారులకు ఆయన అందిస్తారు. కాగా ఈ స్కీమ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. గ్యాస్ కనెక్షన్, రేషన్, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పథకం వర్తిస్తుందని తెలిపారు. వినియోగదారులు 1967 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
TG: వచ్చే ఏడాది నుంచి KCR ప్రజాక్షేత్రంలోకి వస్తారని KTR వెల్లడించారు. KCR ఆరోగ్యం, ఆయన బయటకు ఎందుకు రావడం లేదన్న ప్రశ్నకు #AskKTRలో స్పందించారు. ‘ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ప్రతిరోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా, 420 హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారు. 2025 నుంచి KCR ప్రజల్లోకి వస్తారు. కుదిరితే ఇంకా ముందే దిగుతారు’ అని చెప్పారు.
భారత నగల మార్కెట్ చరిత్రలో తొలిసారి వెండి అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ధనత్రయోదశి వేళ కస్టమర్లు బంగారం కన్నా దీనినే ఎక్కువ కొనుగోలు చేశారు. ‘గత సీజన్‌తో పోలిస్తే సిల్వర్ రేట్ 40% పెరిగినా అమ్మకాలు 30-35% ఎగిశాయి. ఇలాంటి డిమాండ్ మునుపెన్నడూ చూడలేదు. వ్యాపార ప్రయోజనం వల్ల సిల్వర్‌పై పెట్టుబడి ఓ మంచి అవకాశంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’ అని IBJA జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా తెలిపారు.
IPL-2025 కోసం తాము రిటెన్షన్ చేసుకున్న జట్టును LSG ప్రకటించింది. ఇప్పటివరకు ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌ను వదులుకుంది. నికోలస్ పూరన్‌ను అత్యధికంగా రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. రవి బిష్ణోయ్(రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్(రూ.11 కోట్లు), మోసిన్ ఖాన్(రూ.4 కోట్లు), ఆయుష్ బదోనీ(రూ.4కోట్లు) LSG రిటైన్ చేసుకుంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకుంది. రింకూ సింగ్ రూ.13 కోట్లు, వరుణ్ చక్రవర్తి రూ.12 కోట్లు, సునీల్ నరైన్ రూ.12 కోట్లు, రస్సెల్ రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లలో హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌కు రూ.4కోట్లు వెచ్చించింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ రూ.18 కోట్లు, పతిరణ రూ.13 కోట్లు, శివమ్ దూబే రూ.12 కోట్లు, జడేజా రూ.18 కోట్లు, ధోనీ రూ.4కోట్లు(అన్‌క్యాప్‌డ్ ప్లేయర్) వెచ్చించి అట్టిపెట్టుకుంది.
గత ఐపీఎల్‌లో చెలరేగిన ఐదుగురు ప్లేయర్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. అత్యధికంగా క్లాసెన్ రూ.23 కోట్లు చెల్లించనుంది. పాట్ కమిన్స్ రూ.18Cr, అభిషేక్ శర్మ రూ.14Cr, నితీశ్ రెడ్డి రూ.6Cr, ట్రావిస్ హెడ్‌కు రూ.14 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది.
గుజరాత్ టైటాన్స్ జట్టు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. రషీద్ ఖాన్ (రూ.18.కోట్లు), శుభ్‌మన్ గిల్ (రూ.16.5 కోట్లు), సాయి సుదర్శన్ (రూ.8.5 కోట్లు), రాహుల్ తెవాటియా (రూ.4 కోట్లు), షారుఖ్ ఖాన్ (రూ.4 కోట్లు)లను అట్టి పెట్టుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ వేలంలోకి వచ్చేశారు. డీసీ సమర్పించిన రిటెన్షన్ లిస్టులో ఆయన పేరును చేర్చలేదు. అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు), అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)లను అట్టిపెట్టుకుంది.
Sorry, no posts matched your criteria.