News September 2, 2025

కోళ్లలో కొక్కెర వ్యాధితో ప్రమాదం

image

కోళ్లలో వైరస్ వల్ల వచ్చే కొక్కెర వ్యాధి ప్రమాదకరమైందని పశు వైద్యులు చెబుతున్నారు. ఇది అన్ని వయసుల కోళ్లకూ సోకుతుంది. దీన్ని రాణిఖేత్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన కోళ్లలో 80-90% చనిపోతాయి. వ్యాధి సోకిన కోడి ముక్కు నుంచి కారే ద్రవాల వల్ల, వ్యాధి క్రిములతో కలుషితమైన మేత, నీరు, గాలి ద్వారా ఇతర కోళ్లకూ వ్యాపిస్తుంది. వేగంగా ప్రబలి ఫారమ్/గ్రామంలోని కోళ్లన్నీ మరణించి తీవ్రనష్టం వాటిల్లుతుంది.

News September 2, 2025

పూజలో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి?

image

పవిత్రమైన పూజ విధానంలో ప్రతి వస్తువును సరైన స్థానంలో ఉంచడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. పూజ గదిలో దేవునికి ఎడమ వైపున నీటితో నిండిన కలశం, గంట, ధూపం వేసే పాత్రలు, నూనె దీపాలు ఉంచాలి. ఇక దేవునికి కుడి వైపున ఆవు నెయ్యితో వెలిగించిన దీపం, సువర్ణ జలంతో నింపిన శంఖం ఉంచాలి. దేవుని విగ్రహం లేదా చిత్రపటం ఎదురుగా హారతి కర్పూరం, పసుపు, కుంకుమ వంటి పూజ సామగ్రిని ఉంచాలి.

News September 2, 2025

నేవీలో 260 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

నేవీలో 260 పోస్టులకు 2026 జూన్‌లో ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువును sep 8వరకు పొడిగించారు. వివిధ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలు వెల్లడిస్తారు.

News September 2, 2025

వినాయకుడికి ‘ఏక దంతమే’ ఎందుకు?

image

గణేశుడికి ఓ దంతం విరిగిపోయి ఉంటుంది. దాని గురించి 3 పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వినాయకుడు తన దంతాన్ని విరిచి కలంగా చేసుకొని భారతాన్ని రాశారనేది వాటిలో ప్రధానమైనది. శివుడిని కలవడానికి వెళ్లినప్పుడు అడ్డుకున్నందుకు పరశురాముడు తన గొడ్డలితో విఘ్నేశ్వరుడిని కొట్టగా ఓ దంతం విరిగిందనేది మరో కథనం. మరికొన్ని పురాణాలు గజముఖాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దంతం విరిగిందని చెబుతున్నాయి.

News September 2, 2025

అధిక సాంద్రత పత్తిసాగు వల్ల లాభాలు

image

ఒకేసారి పూత, కాయలు రావడం వల్ల పంట తొందరగా చేతికి వస్తుంది. గులాబి రంగు పురుగు తాకిడి తగ్గుతుంది. పంట కాలం త్వరగా పూర్తవ్వడం వల్ల నీటి వసతి ఉంటే రెండో పంటగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చు. దీని వల్ల అదనపు ఆదాయం వస్తుంది. కూలీలు కూడా త్వరగా పత్తి ఏరవచ్చు. ఈ పద్ధతిలో ఎకరాకు సుమారు 30-40% అధిక దిగుబడికి ఛాన్సుంది. దీనికి తక్కువ కాలపరిమితి, భూమికి అనువైన రకాలను, హైబ్రిడ్ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

News September 2, 2025

పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. మంచి పాలనతో APలో NDA ప్రభుత్వాన్ని బలపరిచేందుకు కృషి చేస్తున్నారు. మీరు దీర్ఘాయుష్షుతో జీవించాలి’ అని ఆకాంక్షించారు. ‘మా పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని పవన్‌తో ఉన్న ఫొటోను అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

News September 2, 2025

8 రోజుల్లో రూ.4,580 పెరిగిన గోల్డ్ రేట్

image

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.210 పెరిగి రూ.1,06,090కు చేరింది. కాగా 8 రోజుల్లో రూ.4,580 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 ఎగబాకి రూ.97,250 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 పెరిగి రూ.1,36,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 2, 2025

IFSలకు పోస్టింగులు.. సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు

image

AP క్యాడర్-2023 బ్యాచ్ IFS అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కొల్లూరు వెంకట శ్రీకాంత్‌కు వెంకటగిరి సబ్ DFOగా, కొప్పుల బాలరాజుకు లక్కవరం సబ్ DFOగా, నీరజ్ హన్స్‌కు డోర్నాల సబ్ DFOగా, గరుడ్ సంకేత్ సునీల్‌కు ప్రొద్దుటూర్ సబ్ DFOగా, బబితా కుమారికి గిద్దలూరు సబ్ DFOగా పోస్టింగులు ఇచ్చింది. వీరంతా CM చంద్రబాబు, Dy.CM పవన్‌ను మర్యాదపూర్వకంగా కలవగా వారు అభినందించారు.

News September 2, 2025

పవన్ బర్త్ డే.. OG నుంచి స్పెషల్ పోస్టర్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘OG’ సినిమా డైరెక్టర్ సుజీత్ స్పెషల్ విషెస్ తెలియజేశారు. ‘ఎంతో మందికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్పిరేషన్‌. మీ కోట్లాది అభిమానుల్లో నేనూ ఒకడిని. మీరే నా తొలి హీరో. ఇప్పుడు నా OG’ అని పేర్కొంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ముంబైలోని తాజ్ హోటల్ ఎదురుగా వింటేజ్ ‘DODGE’ కార్‌పై పవన్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ‘OG’ సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

News September 2, 2025

నెలవారీ కోటా రేషన్ పంపిణీ పునః ప్రారంభం

image

TG: రాష్ట్రంలో సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్‌లో ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ చేయగా, మళ్లీ ఈ నెల నుంచి పాత పద్ధతిలో నెలవారీ కోటాను ఇస్తున్నారు. జులై, ఆగస్టులో కొత్త కార్డులు పొందిన వారికి కూడా ఈ నెల నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నారు. ఈ నెల 15 వరకు పంపిణీ కొనసాగనుంది. మొత్తం 3.2 కోట్ల మంది లబ్ధిదారులకు 2.02లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు.