News September 2, 2025

నెలవారీ కోటా రేషన్ పంపిణీ పునః ప్రారంభం

image

TG: రాష్ట్రంలో సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్‌లో ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ చేయగా, మళ్లీ ఈ నెల నుంచి పాత పద్ధతిలో నెలవారీ కోటాను ఇస్తున్నారు. జులై, ఆగస్టులో కొత్త కార్డులు పొందిన వారికి కూడా ఈ నెల నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నారు. ఈ నెల 15 వరకు పంపిణీ కొనసాగనుంది. మొత్తం 3.2 కోట్ల మంది లబ్ధిదారులకు 2.02లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు.

News September 2, 2025

పెను విషాదం.. 1100 మంది మృతి

image

అఫ్గానిస్థాన్‌లో నిన్న సంభవించిన <<17581135>>భూకంపం<<>> పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 1100 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో 3,500 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది. కాగా భూకంప బాధితులకు భారత ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. తక్షణ సాయంగా 15 టన్నుల ఫుడ్ మెటీరియల్, 1000 కుటుంబాలకు సరిపడే టెంట్స్‌ను కాబూల్‌కు పంపింది. ఇవాళ రిలీఫ్ మెటీరియల్ పంపనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.

News September 2, 2025

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు

image

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మరో 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో <>TGలో<<>> నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోని శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

News September 2, 2025

కవిత BRSను టార్గెట్ చేశారా?

image

కవిత ప్లాన్ ప్రకారం <<17582811>>BRS<<>>ను టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ అభిమానులు విమర్శిస్తున్నారు. BRS ప్లీనరీలో బీజేపీపై విమర్శలు చేయకపోవడం అసంతృప్తికి గురి చేసిందని కొన్ని నెలల క్రితం కవిత KCRకు లేఖ రాశారు. ఆ లెటర్‌ను లీక్ చేశారని విమర్శలు గుప్పించారు. KCR నాయకత్వం తప్ప ఎవరి లీడర్షిప్‌నూ అంగీకరించబోనని పరోక్షంగా KTRను టార్గెట్ చేశారు. మొన్న జగదీశ్ రెడ్డి, నిన్న హరీశ్, సంతోశ్ రావుపై ఫైరయ్యారు.

News September 2, 2025

భారత్‌తో సిరీస్‌కు కమిన్స్ దూరం

image

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ న్యూజిలాండ్, భారత్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌లకు దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. వెన్ను గాయంతో ఆయన బాధపడుతున్నట్లు తెలిపింది. యాషెస్ సిరీస్‌కూ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో వన్డేలు, అక్టోబర్ 29, 31, నవంబర్ 2, 6, 8 తేదీల్లో టీ20లు జరగనున్నాయి.

News September 2, 2025

తమ్ముడికి మెగాస్టార్ ఎమోషనల్ విషెస్

image

పవన్‌కు చిరంజీవి బర్త్‌డే విషెస్ చెప్పారు. ‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, AP Dy.CMగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ’ అని వారిద్దరి అరుదైన ఫొటోను ట్వీట్ చేశారు.

News September 2, 2025

ఉద్యోగినితో ఎఫైర్.. ‘నెస్లే’ CEOపై వేటు

image

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్విస్ ఫుడ్ జెయింట్ ‘నెస్లే’ కంపెనీ తమ CEO లారెంట్ ఫ్రెయిక్స్‌పై వేటు వేసింది. మహిళా ఉద్యోగితో శారీరక సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలతో విచారణకు ఆదేశించింది. అతని స్థానంలో ఫిలిప్ నవ్రాటిల్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ‘ఇది కచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయం. కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారనే లారెన్స్‌ను ఫైర్ చేశాం’ అని నెస్లే కంపెనీ ప్రకటించింది.

News September 2, 2025

‘కాళేశ్వరం’పై CBI విచారణ జరపాలని కేంద్రానికి లేఖ

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కోరింది. అంతర్రాష్ట్ర అంశాలు, కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పైనా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేసింది. సీబీఐపై నిషేధం విధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఎత్తివేస్తూ నేడో రేపో సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉంది.

News September 2, 2025

రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

image

TG: సీఎం రేవంత్ రేపటి నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు మహబూబ్‌నగర్(D) దేవరకద్రలో ఓ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం భద్రాద్రి జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎల్లుండి కామారెడ్డి జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తారని సమాచారం. లోకల్ బాడీ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు వీలును బట్టి దాదాపు అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తారని తెలుస్తోంది.

News September 2, 2025

ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్

image

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB), బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను తగ్గించాయి. దీంతో ఈ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఉపశమనం కలగనుంది. PNB అన్ని టెన్యూర్స్‌పై MCLRను 15 బేసిస్ పాయింట్స్ మేర తగ్గించింది. అటు BOI ఓవర్‌నైట్ రేట్ మినహా అన్ని టెన్యూర్స్‌పై 5-15 పాయింట్స్ కోత విధించింది. పోటీని తట్టుకుని నిలబడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.