News November 3, 2025

అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3వేల కోట్ల ఆస్తులు అటాచ్

image

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన రూ.3వేల కోట్లకుపైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఆయన నివాసంతో పాటు ముంబై, ఢిల్లీ, నోయిడా, పుణే, హైదరాబాద్, చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోని కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.3,084 కోట్లు అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

News November 3, 2025

బస్సు ప్రమాదం.. ప్రభుత్వం పరిహారం ప్రకటన

image

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అంతకుముందు కేంద్రం <<18184274>>పరిహారం<<>> ప్రకటించింది.

News November 3, 2025

డిఫరెంట్ లుక్‌లో సీనియర్ హీరోయిన్

image

పై ఫొటోలో కనిపిస్తున్న అలనాటి హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ‘అమ్మోరు’లో అమ్మవారిగా, ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ. ఇదేంటి ఇలా మారిపోయారని అనుకుంటున్నారా? కొత్త సినిమా కోసం ఆమె ఇలా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఈ ఫొటోను దర్శకుడు ఆర్జీవీ Xలో పోస్ట్ చేశారు. ఆయన తెరకెక్కిస్తోన్న ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాలో రమ్య నటిస్తున్నారు. ఆమె లుక్ ఎలా ఉంది?

News November 3, 2025

మెగ్నీషియంతో జుట్టుకు మేలు

image

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్‌, చిక్కుళ్లు, అరటి, జామ, కివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News November 3, 2025

బస్సు ప్రమాదంపై మోదీ విచారం.. పరిహారం ప్రకటన

image

TG: మీర్జాగూడ <<18184089>>ప్రమాదంపై<<>> ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

News November 3, 2025

బస్సు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

image

మీర్జాగూడ <<18183773>>బస్సు<<>> ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పవన్ సైతం సానుభూతి ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

News November 3, 2025

ఈనెల 5న మెగా జాబ్ మేళా

image

AP: అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావొచ్చు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ జాబ్ మేళాలో 18 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

News November 3, 2025

ఎటు చూసినా మృతదేహాలే..

image

TG: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి <<18183773>>బస్సు<<>> ప్రమాద మృతుల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో క్షతగ్రాతులను బెంచ్‌లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం.

News November 3, 2025

శివారాధన సోమవారమే ఎందుకు?

image

సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తన రూపాన్ని పూర్తిగా కోల్పోకుండా కాపాడి శివుడు సోమనాథుడయ్యాడు. నెలవంకను శిరస్సున ధరించి చంద్రశేఖరుడయ్యాడు. అందుకే ఈరోజున శివారాధన చేస్తే శివ సాక్షాత్కారం అందడమే కాక చంద్రుడి అనుగ్రహంతో ప్రశాంతత కలుగుతుందని శివ మహాపురాణం చెబుతోంది. సోమవారం ఈశ్వరుడిని ఏవిధంగా సేవించినా తప్పక మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
☞ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 3, 2025

ఘోరం.. ఆనవాళ్లు లేకుండా మారిన బస్సు

image

రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ ఢీకొట్టి మీద పడటంతో <<18183932>>బస్సు<<>> పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా కుడివైపు ఉండే భాగం ఆనవాళ్లు లేకుండా అయింది. దీంతో ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. టన్నుల కొద్దీ బరువు ఉండే కంకర మీద పడటంతో ప్రయాణికులు దాని కింద సమాధి అయిపోయారు. జేసీబీల సాయంతో టిప్పర్‌ను బస్సుపై నుంచి తొలగించారు. మృతదేహాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ఉన్నట్లు సమాచారం.