News September 2, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

✒ ఈ నెలాఖరున డీజీపీ జితేందర్ పదవీ విరమణ.. కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి?
✒ ఐసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి.. ఈ నెల 5లోపు ఫీజు చెల్లింపు, 15, 16 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్
✒ రాష్ట్రంలో గత 8 నెలల్లో 181 మంది అవినీతి అధికారుల అరెస్ట్
✒ రాష్ట్ర GST వసూళ్లలో 12% వృద్ధి
✒ నాగారం భూదాన్ భూముల కేసులో రూ.4.80 కోట్ల ఆస్తుల జప్తు

News September 2, 2025

రాహుల్ ‘హైడ్రోజన్ బాంబ్’ వ్యాఖ్యలు.. BJP కౌంటర్

image

ఓటు చోరీపై హైడ్రోజన్ <<17581906>>బాంబ్‌<<>> వదలబోతున్నట్లు LoP రాహుల్ గాంధీ వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఆయన చెబుతున్న ఆటమ్ బాంబ్ తుస్సుమంటుంది. ఎన్నికలకు ఆటమ్, హైడ్రోజన్ బాంబ్స్‌తో సంబంధమేంటి? ఓటరు జాబితాలో 21 లక్షలకు పైగా మృతుల పేర్లు ఉన్నాయి. అవి అలాగే ఉండాలా? ECకి అఫిడవిట్ ఎందుకు ఇవ్వట్లేదు? లీగల్ యాక్షన్ ఉంటుందని భయమా?’ అని BJP నేతలు కౌంటర్ ఇచ్చారు.

News September 2, 2025

యుద్ధ్ అభ్యాస్: US చేరుకున్న ఇండియన్ ఆర్మీ

image

ఇండియా-US జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్‌లో పాల్గొనేందుకు భారత ఆర్మీ బృందం అలాస్కా చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. US బలగాలతో కలిసి హెలిబోర్న్ ఆపరేషన్స్, మౌంటేన్ వార్‌ఫేర్, జాయింట్ టాక్టికల్ డ్రిల్స్‌ చేస్తుందని వెల్లడించింది. సైనిక విన్యాసాలు ఈనెల 14 వరకు జరగనున్నాయి. ట్రంప్ టారిఫ్స్‌తో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న వేళ ఈ ఎక్సర్సైజ్ ప్రాధాన్యం సంతరించుకుంది.

News September 2, 2025

T20Iలకు గుడ్‌బై చెప్పిన స్టార్క్

image

ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టెస్టులు, వన్డేలపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. టీమ్ ఇండియాతో టెస్టు టూర్, యాషెస్ సిరీస్, 2027 వన్డే WC తనకు ముఖ్యమని పేర్కొన్నారు. కాగా 35 ఏళ్ల స్టార్క్ తన కెరీర్‌లో 65 టీ20లు ఆడి 79 వికెట్లు తీశారు. తన యార్కర్లతో స్టార్ బ్యాటర్లకు సైతం ముచ్చెమటలు పట్టిస్తారు.

News September 2, 2025

ఘోరం.. ఒకే ఊరిలో 1,000 మంది మృతి

image

ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. డార్ఫర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఓ గ్రామంలో 1,000 మందికి పైగా చనిపోయారని సూడాన్ లిబరేషన్ మూమెంట్ వెల్లడించింది. కొంతకాలంగా వర్షాల ధాటికి మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని, దాని ప్రభావంతో ఓ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొంది. అంతర్జాతీయ సమాజం తమకు సాయం చేయాలని వేడుకుంది.

News September 2, 2025

టీచర్లు టెట్ పాస్ అయితేనే..: సుప్రీంకోర్టు

image

ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనీసం ఐదేళ్లు సర్వీసు ఉన్నవారంతా టెట్ పాస్ కావాల్సిందేనని తెలిపింది. ఇందుకోసం రెండేళ్ల గడువు విధించింది. ఆ లోపు అర్హత సాధించని వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా ఉమ్మడి ఏపీలో 2012లో తొలిసారి టెట్ నిర్వహించారు. అంతకుముందు ఉద్యోగంలో చేరిన 30వేల మందిపై ప్రభావం పడనుంది.

News September 2, 2025

‘కాళేశ్వరం’లో అవినీతి ఉందని కవిత CBIకి చెబుతారా?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు, సంతోశ్ రావు <<17582704>>అవినీతికి<<>> పాల్పడ్డారని కవిత ఆరోపించడం సంచలనంగా మారింది. దీంతో కాంగ్రెస్ ఎప్పటినుంచో చేస్తున్న ఆరోపణలు నిజమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని కవిత CBIకి చెబుతారా అని హస్తం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. హరీశ్ రావు అవినీతికి పాల్పడి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారని BRS అభిమానులు కవితను నిలదీస్తున్నారు.

News September 2, 2025

CPS రద్దు చేయాలని ఉద్యోగుల పోరుబాట

image

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్, విజయవాడలో నల్ల దుస్తులతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, CPS రద్దు చేస్తే సీఎం రేవంత్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. అటు CPS రద్దు చేయకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఏపీ ఉద్యోగులు స్పష్టంచేశారు.

News September 2, 2025

ALERT: అతిభారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం కారణంగా నేడు, రేపు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ TGలోని HNK, JGL, BPL, NRML, KNR, KMM, MHBD, MUL, NZB, PDPL, SRCL, WGL జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, JNG, ADB, KMR, ASF, MNCL, MDK, NLG, SDP, SRPT జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు APలోని VJM, VZG, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయంది.

News September 2, 2025

తిరుమల బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ ఇదే

image

AP: తిరుమలలో ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 23న సాయంత్రం మీన లగ్నంలో అంకురార్పణతో ఉత్సవాలు మొదలవుతాయి. నిత్యం ఉదయం 8-10 గంటల వరకు, సాయంత్రం 7-9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. 25, 26, 27 తేదీల్లో మధ్యాహ్నం 1-3 గంటల వరకు స్నపన తిరుమంజసం నిర్వహిస్తారు. 28న గరుడసేవ, 29న స్వర్ణ రథోత్సవం, OCT 1న మహా రథోత్సవం, 2న చక్రస్నానం ఉంటాయి.