News September 2, 2025

సినీ ముచ్చట్లు

image

* బాహుబలి మూవీపై త్వరలో డాక్యుమెంటరీ రిలీజ్ కాబోతున్నట్లు హీరోయిన్ అనుష్క శెట్టి వెల్లడించారు. తన పోర్షన్ షూటింగ్ పూర్తైందని తెలిపారు.
* శ్రీదేవి నటించిన బాలీవుడ్ మూవీ ‘చాల్‌బాజ్’ సీక్వెల్‌లో ఆమె కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సినీ వర్గాల టాక్.
* భవిష్యత్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లేకుండా ఏ మూవీ తీయను. అతడు ఇండస్ట్రీకి దూరమైతేనే ఇతర ఆప్షన్స్ పరిశీలిస్తా: డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్

News September 2, 2025

భారత్‌లో 2026 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్

image

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2026 ఆగస్టులో ఢిల్లీ వేదికగా ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(BWF) ప్రకటించింది. ఈ ఏడాది పారిస్‌లో జరిగిన పోటీల్లో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. కాగా భారత్ చివరిగా 2009లో హైదరాబాద్‌ వేదికగా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ 15 పతకాలు సాధించింది.

News September 2, 2025

రాష్ట్రంలో త్వరలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. తమిళనాడు తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ(TEP)ని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ అడ్వైజర్ కె.కేశవరావు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా TEPని రూపొందించాలని సూచించారు.

News September 2, 2025

సరికొత్త రికార్డ్ సృష్టించిన UPI

image

ఈ ఏడాది ఆగస్టులో UPI ద్వారా రికార్డు స్థాయిలో 2 వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తెలిపింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఇది 34% ఎక్కువ. గత నెల మొత్తం రూ.24.85 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. సగటున రోజుకు 64.5 కోట్ల ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయి. కాగా జులైలో 1947 కోట్ల ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.25.08 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి.

News September 2, 2025

త్వరలో మణిపుర్‌లో పర్యటించనున్న మోదీ!

image

PM మోదీ ఈనెల రెండో వారంలో మణిపుర్‌లో పర్యటిస్తారని తెలుస్తోంది. వందలాది ప్రాణాలు పోతున్నా PM పట్టించుకోవట్లేదని విపక్షాలు విమర్శిస్తున్న వేళ ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని సమాచారం. 2023 మే 3న అక్కడి తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.

News September 2, 2025

ఆగస్టులో రూ.1.86 లక్షల కోట్ల GST వసూళ్లు

image

కేంద్రం ఆగస్టులో రూ.1.86 లక్షల కోట్ల GST కలెక్ట్ చేసింది. గతేడాది AUGతో పోల్చితే 6.5% పెరుగుదల నమోదైంది. అయితే జులై వసూళ్ల(రూ.1.96 లక్షల కోట్లు)తో చూస్తే తక్కువే. పెద్ద రాష్ట్రాల్లో రూ.28,900 కోట్ల కలెక్షన్స్‌తో మహారాష్ట్ర టాప్‌లో నిలిచింది. గ్రోత్ రేట్ పరంగా సిక్కిమ్(39%) ముందుంది. ఓవరాల్‌గా ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్ల ట్యాక్స్ వసూలైన విషయం తెలిసిందే.

News September 2, 2025

మీకు కన్నడ వచ్చా: రాష్ట్రపతిని ప్రశ్నించిన సీఎం

image

కర్ణాటక పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘మీకు కన్నడ వచ్చా?’ అని ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య అడిగారు. ‘కన్నడ నా మాతృ భాష కాకపోయినా అన్ని భాషలను గౌరవిస్తాను. ప్రతిఒక్కరు తమ భాషను కాపాడుకోవాలి. కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా’ అని ప్రెసిడెంట్ బదులిచ్చారు. కాగా కర్ణాటకలో ఉండేవారు తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలని ఇటీవల సిద్దరామయ్య చెప్పడం వివాదాస్పదమైంది.

News September 2, 2025

సెప్టెంబర్ 2: చరిత్రలో ఈ రోజు

image

1956: నటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ జననం
1965: భారత తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ జననం
1968: నటి, రాజకీయ నాయకురాలు జీవిత జననం
1971: నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జననం (ఫొటోలో)
2009: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం(ఫొటోలో)
2022: తెలంగాణ ఉద్యమ నేత మందాడి సత్యనారాయణరెడ్డి మరణం

News September 2, 2025

30 ఏళ్ల జర్నీ.. చంద్రబాబు స్పెషల్ పోస్ట్

image

AP: తొలిసారి AP CMగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు Xలో స్పెషల్ పోస్ట్ చేశారు. ‘ముప్ఫై ఏళ్ల ప్రయాణం. ప్రజలకు సేవ చేసేందుకు నేను 30 రెట్లు కృతనిశ్చయంతో ఉన్నాను. నాకు అభినందనలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్, Dy.CM పవన్ కళ్యాణ్ తదితరులకు కృతజ్ఞతలు. నా జర్నీలో భాగమై స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా నన్ను నడిపిస్తున్న రాష్ట్ర ప్రజలకు ఈ మైల్‌స్టోన్‌ అంకితం’ అని పేర్కొన్నారు.

News September 2, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.