News October 31, 2024

రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మరుసటి రోజు విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో చంద్రబాబు పర్యటిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.826 కోట్లతో చేపడుతున్న రహదారి మరమ్మతు పనులను ప్రారంభిస్తారు.

News October 31, 2024

భారత్ పర్యటనకు సౌతాఫ్రికా టీమ్ ఎంపిక

image

టీమ్ ఇండియాతో టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఎంపిక చేసింది. 16 మంది సభ్యులతో కూడిన టీమ్‌కు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహిస్తారు. జట్టు: మార్క్రమ్ (C), కొయెట్జీ, డొనొవన్, రీజా, జాన్సెన్, క్లాసెన్, క్రూగర్, మహరాజ్, మిల్లర్, మపాంగ్వనా, పీటర్, రికెల్‌టన్, ఆండీ సైమ్‌లేన్, సిపామ్లా, ట్రిస్టన్ స్టబ్స్, బార్ట్‌మాన్. కాగా ఇరు జట్ల మధ్య వచ్చే నెల 8 నుంచి 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

News October 31, 2024

Stock Market: మళ్లీ నష్టాలు

image

దీపావ‌ళికి ముందు ఐటీ రంగ షేర్లు 3 శాతం ప‌త‌న‌మ‌వ్వ‌డంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా రెండో రోజు న‌ష్టాల‌బాట పట్టాయి. సెన్సెక్స్ 553 పాయింట్ల న‌ష్టంతో 79,389 వ‌ద్ద‌, నిఫ్టీ 135 పాయింట్ల న‌ష్టంతో 24,205 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. Tech Mahindra, HCL Technologies, Infosys, TCS, Wipro భారీగా న‌ష్ట‌పోయాయి. బేర్ మార్కెట్‌లోనూ Cipla, L&T, Dr Reddy’s Labs, Hero Motocorp, ONGC లాభ‌ప‌డ్డాయి.

News October 31, 2024

నవంబర్ 9న ‘గేమ్ ఛేంజర్’ టీజర్

image

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 9న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తామని రైలు పట్టాలపై రామ్‌చరణ్ చొక్కా లేకుండా కూర్చున్న ఫొటోను పంచుకుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

News October 31, 2024

పువ్వులతోనే దేవుడిని ఎందుకు పూజించాలి?

image

మనం నిత్యం భగవంతుడికి పువ్వులతోనే పూజ చేస్తుంటాం. ఏ పూజ అయినా పుష్పాలదే ప్రాధాన్యత. పుష్పాల్లో సర్వ దేవతలు ఉంటారని ప్రతీతి. పువ్వుల్లో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నమవుతారట. దేవుడికి పువ్వుల సువాసన అంటే మహా ఇష్టమని అంటారు. పుష్పం త్రివర్గ సాధనం కాబట్టి సంపద, స్వర్గం, మోక్షాన్ని కలిగిస్తుందని భక్తుల నమ్మకం. దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

News October 31, 2024

మహారాష్ట్ర: ఆ 12 సీట్ల‌పై MVAలో అలజడి

image

మ‌హారాష్ట్రలో విప‌క్ష మ‌హావికాస్ అఘాడీలో 12 సీట్లు కాక‌రేపుతున్నాయి. నామినేష‌న్ల గ‌డువు పూర్త‌వ్వ‌డంతో 288 స్థానాల్లో 12 స్థానాల్లో MVAలోని రెండేసి పార్టీలు నామినేష‌న్లు వేశాయి. దీంతో ఫ్రెండ్లీ పోరు తప్పదా? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తాయి. ఇప్ప‌టికే 2 కూట‌ములు, 6 పార్టీల‌ గుర్తుల విష‌యంలో ప్ర‌జ‌ల్లో గందర‌గోళం ఉంది. నామినేషన్ల ఉపసంహరణలోపు సమస్యల్ని పరిష్కరించుకుంటామని MVA నేతలు చెబుతున్నారు.

News October 31, 2024

హృదయ విదారకం: కుమారుడి తెగిన తలతో రోదిస్తున్న తల్లి

image

తెగిన తన కుమారుడి తలను పట్టుకుని ఓ అమ్మ రోదిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. యూపీలోని గౌరబాద్‌షాపూర్ పరిధిలోని కబీరుద్దీన్ గ్రామంలో రెండు వర్గాల మధ్య భూ తగాదా ఉంది. ఈ క్రమంలో రామ్ జీత్ కుటుంబానికి, ఆయన ప్రత్యర్థులకు గొడవ జరిగింది. మారణాయుధాలతో రామ్ జీత్ కుమారుడు అనురాగ్ (17) తలను ప్రత్యర్థులు నరికేశారు. ఆ తలను ఒడిలోకి తీసుకుని ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించింది

News October 31, 2024

రోడ్లపై బాణసంచా పేల్చడం నిషేధం

image

TG: దీపావళి సందర్భంగా పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం నిషేధమని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పేల్చాలని చెప్పారు. ఆ తర్వాత పేల్చినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ నిబంధనలు నేటి నుంచి వచ్చే నెల 2 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

News October 31, 2024

జుట్టు, చర్మం, గోళ్లను అందంగా మార్చే ‘బయోటిన్’

image

ఆరోగ్యానికి ఆహారమే ప్రధానం. అందులోంచే శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ అందుతాయి. పొల్యూషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ సహా అనేక కారణాలతో జుట్టు ఊడిపోతుంది. గోళ్లు పెళుసుగా మారతాయి. చర్మం నిగారింపు కోల్పోతుంది. బయోటిన్ ఈ మూడింటినీ పరిష్కరిస్తుందని స్టడీస్ పేర్కొంటున్నాయి. ప్రతిరోజూ విటమిన్ సీ, జింక్‌తో కలిపి దేహానికి బయోటిన్ అందేలా మీల్స్ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నాయి.

News October 31, 2024

కర్రలతో కొట్టుకొనే స్థితి నుంచి స్వీట్లు తినిపించుకొనే స్థాయికి..

image

భారత్, చైనా దౌత్యనీతిలో టెక్టానిక్ షిఫ్ట్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక కలవడం కష్టమే అనుకుంటే మిత్రబంధం ఒక్కసారిగా మెరుగైంది. కొవిడ్ టైమ్‌లో గల్వాన్‌లో చైనీయులను భారత జవాన్లు తరిమికొట్టారు. పిడిగుద్దులు, కర్రలు, రాడ్లతో చుక్కలు చూపించారు. ఇప్పుడు డిస్‌ఎంగేజ్‌మెంట్ ఒప్పందం కుదరడంతో స్వీట్లు తినిపించి జైశ్రీరామ్ అనిపించారు. భారత్ ఇదే ధోరణిలో సరిహద్దు సమస్యను పూర్తిగా పరిష్కరించుకోనుందా? మీ కామెంట్.