News September 2, 2025

TODAY HEADLINES

image

* జపాన్, చైనా పర్యటన ముగించుకున్న మోదీ
* అసెంబ్లీకి వచ్చేందుకు వైసీపీ సిద్ధమా: చంద్రబాబు
* వరదలలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: రేవంత్
* హరీశ్, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డి వల్లనే కేసీఆర్‌కు అవినీతి మరకలు: కవిత
* గవర్నర్ కోటా కాంగ్రెస్ MLC అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్
* పెద్ద రాష్ట్రాల్లో ఏపీదే అత్యధిక వృద్ధి రేటు: TDP
* అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 800 మందికి పైగా మృతి

News September 2, 2025

అలా అయితే హరీశ్ వేరే పార్టీ పెట్టుకుంటారు: కోమటిరెడ్డి

image

TG: కవిత విషయంపై రేపు ఆలోచిద్దామని KCR అన్నట్లు తెలిసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుంటే హరీశ్ రావు ఊరుకోరన్నారు. ఆయన వేరే పార్టీ పెట్టుకుంటారని జోస్యం చెప్పారు. అయితే తాము కేసీఆర్, కవిత కుటుంబ గొడవలో తలదూర్చమని అన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనని కామెంట్ చేశారు. ఇక కవిత తమ సీఎం గురించి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

News September 2, 2025

IBM క్వాంటం కంప్యూటర్‌కు గ్రీన్ సిగ్నల్

image

AP: అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌లో IBM క్వాంటం కంప్యూటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కే గేట్స్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. చదరపు అడుగుకు రూ.30 అద్దె చెల్లించేలా IBMతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. IBM రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగేళ్లపాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్‌ను కేటాయించనుంది.

News September 1, 2025

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

image

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది. అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు <<17393463>>రద్దు<<>> చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

News September 1, 2025

అధికారులపై అవినీతి ఆరోపణలు.. CM సీరియస్

image

TG: కొందరు అధికారులు భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో అలసత్వం వహిస్తున్నారని CM రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ‘బిల్డ్ నౌ’ అనుమతులపై CM సమీక్ష నిర్వహించారు. ‘పర్మిషన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తున్న ఆఫీసర్లను సరెండర్ చేయాలి. అలాగే ఇరిగేషన్ అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులపై అవినీతి ఆరోపణలు సహించేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

News September 1, 2025

కవితపై బీఆర్ఎస్ శ్రేణుల ఫైర్

image

TG: BRS పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? అన్న <<17582811>>కవితపై<<>> ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. లిక్కర్ స్కాం కేసు సమయంలో కార్యకర్తలు మద్దతుగా నిలిచారని, SMలో తప్పుడు ప్రచారాలను ఖండించారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు KCR పెట్టిన పార్టీనే విమర్శించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అటు పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని, కావాలనే ఆమెను సైడ్ చేస్తున్నారని కవిత అభిమానులు అంటున్నారు. మీ కామెంట్?

News September 1, 2025

త్వరలో ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్

image

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో రిలీజ్ చేసి తెలిపారు. ఇందులో చరణ్, బుచ్చిబాబు సాన, ఏఆర్ రెహ్మాన్ ఉన్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానున్నట్లు టాక్.

News September 1, 2025

పెద్ద రాష్ట్రాల్లో ఏపీదే అత్యధిక వృద్ధి రేటు: TDP

image

AP: సూపర్ సిక్స్ సంక్షేమమే కాదు, అభివృద్ధిలోనూ రాష్ట్రం సూపర్‌గా దూసుకెళ్తోందని టీడీపీ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో జీఎస్టీ వసూళ్లలో 21శాతం పెరుగుదల నమోదైందంటూ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్ట్‌ను ట్వీట్ చేసింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీదే అత్యధిక వృద్ధి రేటని స్పష్టం చేసింది. అదే సమయంలో జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఆగస్టులో 12శాతం వృద్ధి సాధించింది.

News September 1, 2025

KTR సంచలన ట్వీట్

image

TG: కవిత వ్యాఖ్యలకు కౌంటర్‌గా BRS <<17583241>>పోస్ట్<<>> చేసిన హరీశ్ రావు వీడియోను KTR రీట్వీట్ చేశారు. ‘ఇది మా డైనమిక్ లీడర్ హరీశ్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్’ అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే ‘KCR ప్రియశిష్యుడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇరిగేషన్ గురించి ఎంతో నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నా’ అని కొనియాడారు. హరీశ్‌పై కవిత కామెంట్స్‌ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

News September 1, 2025

YCP నేతలు చీరలు కట్టుకుని బస్సులు ఎక్కాలి: అచ్చెన్న

image

AP: మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోందో లేదో తెలియాలంటే YCP నేతలు చీరలు ధరించి బస్సులు ఎక్కితే తెలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను TDP నిలబెట్టుకుందని చెప్పారు. ‘అధికారంలో ఉన్నప్పుడు YCP నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోంది. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాం’ అని ఆయన తెలిపారు.