News October 31, 2024

‘ఇంతకు మించి’.. చైనా సమస్యపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

image

LAC వద్ద భారత్, చైనా సైనికుల ఉపసంహరణ దాదాపుగా ముగిసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డ్రాగన్ కంట్రీతో ‘ఇంతకు మించి’ పరిష్కారాలను కోరుకుంటున్నామని, అందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించారు. అరుణాచల్‌‌లోని తవాంగ్‌లో ఆయన సర్దార్ పటేల్ జయంతి, దీపావళిని సైనికులతో కలిసి జరుపుకున్నారు. మేజర్ బాబ్ ఖాథింగ్ శౌర్య మ్యూజియాన్ని ఆరంభించారు. ఈశాన్య భారతం భద్రతకు ఆయనెంతగానో కృషి చేశారని గుర్తుచేశారు.

News October 31, 2024

భారీ నష్టాలు.. రూ.3లక్షల కోట్లు లాస్!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీపావళికి రాకెట్లలా దూసుకుపోతాయనుకుంటే తోకపటాకులా తుస్సుమనడం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. మధ్యాహ్నం ఒంటిగంటకు బీఎస్ఈ సెన్సెక్స్ 523 పాయింట్లు పతనమై 79,420, ఎన్ఎస్ఈ నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,203 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైంది. IT స్టాక్స్ ఘోరంగా క్రాష్ అవుతున్నాయి. TECHM, HCLTECH, INFY, TCS 3%మేర నష్టపోయాయి.

News October 31, 2024

టీజర్ రాకపోయేసరికి.. మెగా ఫ్యాన్స్ నిరాశ

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’ మేకర్స్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈరోజు మ.12.06గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ఉదయం చెప్పి తీరా సమయానికి ఇంకాస్త సమయం కావాలని ట్వీట్ చేశారు. దీంతో నిరాశకు గురైన కొందరు ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ కాదు ‘డేట్ ఛేంజర్’ అని సెటైర్లు వేస్తున్నారు. లేటైనా ఫర్వాలేదు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు.

News October 31, 2024

ఏ సినిమాకు వెళ్తున్నారు?

image

దీపావళి కానుకగా సినీ ప్రియుల కోసం ఈరోజు పలు సినిమాలు రిలీజయ్యాయి. వాటిల్లో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’, దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్’, శివకార్తికేయన్-సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ సినిమాలకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో చాలామంది ఈ దీపావళికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మీరు సినిమాకు వెళ్తున్నారా? దేనికో కామెంట్ చేయండి.

News October 31, 2024

స్వీట్లు పంచుకున్న భారత్-చైనా సైనికులు

image

దేశ సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. LAC వెంట భారత బలగాలు దీపావళి ఉత్సవాలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నాయి. కాగా ఎల్ఏసీ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ఇటీవల ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య గస్తీ ఒప్పందం కుదిరింది. దీంతో లద్దాక్‌లోని దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి.

News October 31, 2024

దీపావళి కానుకగా ‘పుష్ప 2’ పోస్టర్ రిలీజ్

image

దీపావళి పండుగ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 5న బిగ్ స్క్రీన్‌లో కలుసుకుందాం అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్న పోజ్ ఆకట్టుకుంటోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News October 31, 2024

ఇందిరాగాంధీ, పటేల్‌కు CM నివాళులు

image

TG: ఈరోజు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ ఉప ప్రధాని వల్లభభాయ్ పటేల్‌ జయంతి కావడంతో సీఎం రేవంత్ వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.

News October 31, 2024

రేపు ‘ఉచిత గ్యాస్ సిలిండర్’ ప్రారంభం

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అర్హులకు అందనున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా గ్యాస్ సిలిండర్ అందజేయనుంది. కాగా ఈనెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి.

News October 31, 2024

IPLతో అత్యధికంగా ఆర్జించింది వీరే

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL ద్వారా ఇప్పటివరకు రూ.194.6 కోట్లు సంపాదించారు. టోర్నీ చరిత్రలో హిట్ మ్యాన్‌దే అత్యధిక ఆర్జన. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ (రూ.188.84 కోట్లు), విరాట్ కోహ్లీ (188.2 కోట్లు), రవీంద్ర జడేజా (125.01 కోట్లు), సునీల్ నరైన్ (113.25 కోట్లు) ఉన్నారు. సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్, శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యువరాజ్ సింగ్ కూడా అత్యధికంగా ఆర్జించారు.

News October 31, 2024

ఆ ఆస్తిని పేద పిల్లలకు పంచాలి: మంత్రి సత్యకుమార్

image

AP: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తుల సమస్యను ఇద్దరు తోడుదొంగలు అంతర్జాతీయ సమస్యగా మార్చారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. తనకు రక్షణ కల్పించాలన్న చెల్లి కొత్త నాటకం మాయాబజార్‌ను తలపిస్తోందని ట్వీట్ చేశారు. ‘అక్రమంగా సంపాదించిన వ్యక్తులను సమాజం బహిష్కరించాలి. ఆస్తులను నలుగురు పిల్లలకు కాదు, కోట్లాది పిల్లలకు పంచాలి. అప్పుడే నిజమైన దీపావళి’ అని పేర్కొన్నారు.