News November 9, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్‌లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.

News November 9, 2025

HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

image

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<>HCL<<>>) 64 జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు NOV 27 నుంచి DEC 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.hindustancopper.com/

News November 9, 2025

పాడి పశువుల కొనుగోళ్లు – ఈ జాగ్రత్తలతో మేలు

image

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.

News November 9, 2025

హనుమాన్ చాలీసా భావం – 4

image

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా ||
ఓ దేవా! నీవు బంగారు కాంతులీనే దేహంతో, అత్యంత శోభాయమానమైన సుందర వస్త్రాలను ధరించి విరాజిల్లుతావు. నీ చెవులకు ధరించిన మనోహరమైన కుండలాలు, మృదువుగా మెలికలు తిరిగిన (కుంచితమైన) నీ కేశాలు నీ రూపానికి అసాధారణ సౌందర్యాన్ని చేకూర్చుతాయి. నీ దివ్యమైన రూపం దృష్టిని ఆకర్షించి, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 9, 2025

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలో భక్తులు ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 80,560 మంది దర్శించుకున్నారు. 31,195 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు లభించింది. కాగా ఇవాళ సుప్రభాత సేవలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

News November 9, 2025

ప్రీమెచ్యూర్ మెనోపాజ్ గురించి తెలుసా?

image

40 ఏళ్ల కంటే ముందే రుతుక్రమం ఆగిపోతే, దీన్ని ‘ప్రీమెచ్యూర్ మెనోపాజ్’ అంటారు. ప్రపంచంలో ఇతర మహిళల కంటే భారతీయ మహిళళ్లో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రేటు కాస్త ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల ఆర్థికస్థితి, పోషకాహార లోపం, కుటుంబంలో మానసిక ఒత్తిడి, పెళ్లి చిన్న వయసులోనే అవ్వడం, విడాకులు వంటివి మహిళలలో ప్రీమెచ్యూర్ మెనోపాజ్‌‌కు కారణమవుతాయి. కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటివి దీనికి కారణం కావొచ్చు.

News November 9, 2025

గ్రూప్-3.. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

TG: 1,388 గ్రూప్-3 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ రేపటి నుంచి ఈ నెల 26 వరకు కొనసాగనుంది. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో రోజూ 10.30AM నుంచి 1.30PM, తిరిగి 2PM నుంచి 5.30PM వరకు పరిశీలన జరగనుంది. విద్యార్హత సర్టిఫికెట్లు, హాల్‌టికెట్, ఆధార్/ఏదైనా ప్రభుత్వ ఐడీ, అప్లికేషన్ ఫామ్ తదితర పత్రాలను తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు https://www.tgpsc.gov.in/ సంప్రదించవచ్చు.

News November 9, 2025

విధ్వంసం.. 13 బంతుల్లో 54 రన్స్

image

హాంకాంగ్ సిక్సెస్-2025లో ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో మ్యాచులో బంగ్లా ఓపెనర్ హబీబుర్ రెహ్మాన్ ఊచకోత కోశారు. 13 బంతుల్లోనే 54 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. ఆయన ఏకంగా 8 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. అంటే బౌండరీల ద్వారానే 52 రన్స్ రాబట్టారు. మరో ప్లేయర్ హొస్సైన్ 8 బంతుల్లో 27 రన్స్ చేయడంతో BAN 6 ఓవర్లలో 128 పరుగులు చేసింది. SA 25 రన్స్ తేడాతో ఓడిపోయింది.

News November 9, 2025

ఒలింపిక్స్ 2028: IND vs PAK మ్యాచ్ లేనట్లే!

image

2028 నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానున్న సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నీలు అనగానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండాల్సిందే. కానీ ఈ ఈవెంట్‌లో ఇరు జట్లు తలపడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కడం కష్టంగా మారడమే దీనికి కారణం. ఒక్కో ఖండం నుంచి ఒక్కో <<18233382>>జట్టును<<>> ఎంపిక చేయాలని ఐసీసీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

News November 9, 2025

కొలికపూడిపై చర్యలు తీసుకోవాలి.. CBNకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక

image

AP: ఎంపీ చిన్నితో వివాదంలో తప్పంతా MLA కొలికపూడిదేనంటూ TDP క్రమశిక్షణ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ఎన్నికైనప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. తన ఆరోపణలపై కొలికపూడి ఒక్క ఆధారం సమర్పించలేదని, సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలని సీఎంకు విన్నవించినట్లు సమాచారం. అయితే వారిద్దరినీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కమిటీకి CBN చెప్పారు.