India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత్ దశాబ్దాలుగా USతో ఏకపక్షంగా భారీ వాణిజ్యం చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇండియా తన వస్తువులను USకు భారీ స్థాయిలో విక్రయిస్తోంది. అమెరికానే ఆ దేశానికి అతిపెద్ద కొనుగోలుదారు. US మాత్రం ఇండియాలో అధిక టారిఫ్స్‌తో తక్కువ బిజినెస్‌కే పరిమితమైంది. ఇప్పుడు సుంకాలు తగ్గిస్తామని భారత్ చెప్పినా సమయం దాటిపోయింది. అటు రష్యా నుంచి ఆయిల్ కొంటూ మమ్మల్ని టారిఫ్స్ తగ్గించమనడంలోనూ ఉపయోగం లేదు’ అని అన్నారు.
AP: ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని APSDMA తెలిపింది. మరో 24 గంటల్లో ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు విజయనగరం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
TG: గత ఏడాది పంట నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై సీఎం రేవంత్ అధికారులను ఆరా తీశారు. ఇటీవల వరదలతో ఏర్పడ్డ పంట నష్టాన్ని కూడా అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. NDRFతో పనిలేకుండా SDRF సిబ్బందిలో నైపుణ్యాలు పెంచాలని సూచించారు. రోడ్ల డ్యామేజ్‌పైనా సమగ్ర నివేదిక రూపొందించడంతో పాటు HMDA పరిధిలోని చెరువులను వెంటనే నోటిఫై చేయాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న ‘కాళేశ్వరం ప్రాజెక్టు CBI విచారణ’ అంశంపై కేంద్ర నిర్ణయం ఆసక్తికరంగా మారింది. PC ఘోష్ కమిషన్ రిపోర్టులో BJP MP, BRS ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పేరూ ఉంది. దీంతో సొంత నేతపై ఆరోపణలున్న కేసు దర్యాప్తుకు అప్పగిస్తే సెల్ఫ్ గోల్ అవుతుందా? వెయిట్ చేస్తే కాంగ్రెస్ విమర్శలతో ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? తదితర అంశాలు లెక్కలేసుకున్నాకే నిర్ణయం తీసుకోనుంది.
AP: రాష్ట్రంలో యూరియా కొరతపై ఈ నెల 6న ఆందోళనలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ నిరసనలు చేపట్టనున్నారు. కాగా టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ చేసి పక్కదారి పట్టిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో ఈసారి కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ అనుమానమే. గతేడాది శారీలు ఇవ్వని సర్కారు ఈసారి మరింత క్వాలిటీతో మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు అందిస్తామని ఇటీవలే చెప్పింది. సెప్టెంబర్ 21 – 30 మధ్య బతుకమ్మ వేడుకలు జరగనుండగా, సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. దీంతో ఇందుకు రెండు వారాల ముందే నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చు. ఈ పరిణామాలను బట్టి ఈసారీ ఆడబిడ్డలకు చీరలు అందకపోవచ్చు.
కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన <<17269129>>ఫ్రీడమ్ ప్లాన్<<>> గడువును BSNL పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తుండటంతో మరో 15 రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. నిన్నటితో గడువు ముగియగా ఈ నెల 15వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.1కే ఉచిత సిమ్‌తో పాటు 30 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.
TG: ఈనెల 21న వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయని మంత్రి జూపల్లి తెలిపారు. ‘22-24 వరకు జిల్లాల్లోని ముఖ్య ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో వేడుకలు జరుపుతాం. 27న ట్యాంక్‌బండ్‌పై కార్నివాల్ నిర్వహిస్తాం. 28న LB స్టేడియంలో గిన్నిస్ రికార్డే లక్ష్యంగా 10వేల మందితో సంబరాలు ఉంటాయి. 29న పీపుల్స్ ప్లాజా వద్ద బతుకమ్మ పోటీలు, 30న బతుకమ్మ పరేడ్ నిర్వహిస్తాం’ అని మంత్రి వెల్లడించారు.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
TG: సొంతింట్లోనే వేరు కుంపటి పెట్టినట్లుగా MLC కవిత వ్యవహారం మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హరీశ్, సంతోష్ రావు లక్ష్యంగా ఆమె చేసిన <<17582704>>ఆరోపణలు<<>> BRS వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో ఆమె తర్వాతి టార్గెట్ కేటీఆర్ కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో ఆమె ప్రాధాన్యం తగ్గించడంలో KTR పాత్ర కూడా ఉందనేది వారి వాదన. మరి ఈ పంచాయితీకి KCR ఫుల్‌స్టాప్ పెడతారేమో చూడాలి.
Sorry, no posts matched your criteria.