News October 31, 2024

ఆ ఆస్తిని పేద పిల్లలకు పంచాలి: మంత్రి సత్యకుమార్

image

AP: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తుల సమస్యను ఇద్దరు తోడుదొంగలు అంతర్జాతీయ సమస్యగా మార్చారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. తనకు రక్షణ కల్పించాలన్న చెల్లి కొత్త నాటకం మాయాబజార్‌ను తలపిస్తోందని ట్వీట్ చేశారు. ‘అక్రమంగా సంపాదించిన వ్యక్తులను సమాజం బహిష్కరించాలి. ఆస్తులను నలుగురు పిల్లలకు కాదు, కోట్లాది పిల్లలకు పంచాలి. అప్పుడే నిజమైన దీపావళి’ అని పేర్కొన్నారు.

News October 31, 2024

OTTలోకి వచ్చేస్తోన్న కొత్త మూవీ

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ OTT స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. నవంబర్ 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సోషల్ సబ్జెక్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.245 కోట్ల వసూళ్లు రాబట్టింది.

News October 31, 2024

దావత్ ప్లాన్ ఉందా?.. RSP సెటైరికల్ ట్వీట్

image

జన్వాడ ఫాంహౌస్ కేసు నేపథ్యంలో BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
*దీపావళికి దావత్ ప్లాన్ ఉంటే బ్రీత్ అనలైజర్లు, డ్రగ్ టూల్ కిట్లు దగ్గర ఉంచుకోండి.
*తాగాలనుకుంటే మందు బాటిళ్ల బిల్లులు ఉంచుకోండి.
*మందు పార్టీకి పర్మిషన్ ఉండాలని మంత్రులు అంటున్నారు కనుక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వండి.
*గిట్టనివాళ్లు రేవ్ పార్టీ అనే ప్రమాదముంది. అప్రమత్తంగా ఉండండి.

News October 31, 2024

అదానీ రూ.20వేల కోట్ల లోన్.. పంచుకోవడానికి రెడీగా బ్యాంకులు!

image

అదానీ పెట్రో కెమికల్ యూనిట్‌ రూ.20వేల కోట్ల లోన్‌ను పంచుకొనేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు క్యూ కట్టాయని తెలిసింది. ఈ PVC ప్రాజెక్టుకు 9.25% వడ్డీతో 15 ఏళ్ల క్రెడిట్‌లైన్‌‌ను SBI ఆమోదించింది. ఇప్పటికే కొన్ని రూ.వందల కోట్లను విడుదల చేసింది. ఎక్స్‌పోజర్ తగ్గించుకొనేందుకు రూ.7000 కోట్ల వరకు ఉంచుకొని మిగతాది పంచేయాలని SBI నిర్ణయించుకుంది. BOB, PNB, UBI, CBI, ICICI, AXIS దీనికి రెడీగా ఉన్నాయి.

News October 31, 2024

TTD ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ ప్రచారం.. స్పందించిన ప్రభుత్వం

image

AP: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫేక్ అకౌంట్ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. కాగా నిన్న 24 మంది సభ్యులతో కూడిన నూతన టీటీడీ బోర్డును ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

News October 31, 2024

రూ.21కోట్లకు పూరన్ రిటెన్షన్!

image

నికోలస్ పూరన్ IPL 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో టాప్ రిటెన్షన్ స్థానాన్ని పొందినట్లు వార్తలొస్తున్నాయి. పూరన్‌ను ఏకంగా రూ.21 కోట్లకు రిటెయిన్ చేసుకుందని, అతనికిదే కెరీర్లో అత్యధికమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా పూరన్ కోల్‌కతాలో LSG ఓనర్ సంజీవ్ గోయెంకాతో సమావేశమైన తర్వాత రూ.18 కోట్లకు బదులు రూ.21 కోట్లు పొందినట్లు తెలుస్తోంది. ఇతర ఆటగాళ్ల ధరల్లోనూ స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం.

News October 31, 2024

‘ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన!

image

కర్ణాటక ప్రభుత్వం శక్తి స్కీమ్‌లో భాగంగా అక్కడి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పునరాలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలోని మహిళలు డబ్బు చెల్లించి ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని మహిళలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని ఆయన వివరించారు.

News October 31, 2024

థియేటర్‌లో సినిమా చూసిన ముఖ్యమంత్రి

image

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ థియేటర్‌లో సినిమా చూశారు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీని ఆయన ఇవాళ వీక్షించారు. ‘మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని చిత్రంలో బాగా చూపించారు. ఇందులో కార్తికేయన్, సాయిపల్లవి అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌కు నా హ్యాట్సాఫ్’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ చిత్రాన్ని చూశారు.

News October 31, 2024

టపాసులు కాల్చితే రంగులెందుకు వస్తాయి?

image

టపాసులు కాల్చినప్పుడు ఆకాశంలో రకరకాల రంగులు వస్తుంటాయి. క్రాకర్స్‌లో ఉండే లోహాల వల్ల ఆ రంగులు వస్తాయి. అల్యూమినియం, మెగ్నీషియం మండితే తెలుపురంగులో వెలుగు వస్తుంది. లిథియం క్లోరైడ్(రెడ్), కాపర్ క్లోరైడ్(లైట్ బ్లూ), సోడియం క్లోరైడ్(ఆరెంజ్) వేర్వేరు రంగులు ఇస్తాయి. ఇంకా భిన్నమైన రంగుల కోసం మెటల్ సాల్ట్స్‌, వాటి మిశ్రమంతో క్రాకర్స్‌ తయారు చేస్తారు.

News October 31, 2024

క్రికెటర్ ఇంట్లో దొంగతనం

image

ఇంగ్లండ్ క్రికెట్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. అక్టోబర్ 17న ENG నార్త్ ఈస్ట్‌లోని తన ఇంట్లో‌కి మాస్క్‌లతో వచ్చిన కొందరు జువెలరీ, కొన్ని విలువైన వస్తువులు చోరీ చేశారని స్టోక్స్ వెల్లడించారు. చోరీ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారని, అదృష్టం కొద్దీ వాళ్లకు ఏమీ కాలేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ ఘటన వాళ్లను మానసికంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు.