India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జన్వాడ ఫాంహౌస్ కేసు నేపథ్యంలో BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
*దీపావళికి దావత్ ప్లాన్ ఉంటే బ్రీత్ అనలైజర్లు, డ్రగ్ టూల్ కిట్లు దగ్గర ఉంచుకోండి.
*తాగాలనుకుంటే మందు బాటిళ్ల బిల్లులు ఉంచుకోండి.
*మందు పార్టీకి పర్మిషన్ ఉండాలని మంత్రులు అంటున్నారు కనుక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వండి.
*గిట్టనివాళ్లు రేవ్ పార్టీ అనే ప్రమాదముంది. అప్రమత్తంగా ఉండండి.
అదానీ పెట్రో కెమికల్ యూనిట్ రూ.20వేల కోట్ల లోన్‌ను పంచుకొనేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు క్యూ కట్టాయని తెలిసింది. ఈ PVC ప్రాజెక్టుకు 9.25% వడ్డీతో 15 ఏళ్ల క్రెడిట్‌లైన్‌ను SBI ఆమోదించింది. ఇప్పటికే కొన్ని రూ.వందల కోట్లను విడుదల చేసింది. ఎక్స్‌పోజర్ తగ్గించుకొనేందుకు రూ.7000 కోట్ల వరకు ఉంచుకొని మిగతాది పంచేయాలని SBI నిర్ణయించుకుంది. BOB, PNB, UBI, CBI, ICICI, AXIS దీనికి రెడీగా ఉన్నాయి.
AP: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫేక్ అకౌంట్ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. కాగా నిన్న 24 మంది సభ్యులతో కూడిన నూతన టీటీడీ బోర్డును ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
నికోలస్ పూరన్ IPL 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో టాప్ రిటెన్షన్ స్థానాన్ని పొందినట్లు వార్తలొస్తున్నాయి. పూరన్‌ను ఏకంగా రూ.21 కోట్లకు రిటెయిన్ చేసుకుందని, అతనికిదే కెరీర్లో అత్యధికమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా పూరన్ కోల్‌కతాలో LSG ఓనర్ సంజీవ్ గోయెంకాతో సమావేశమైన తర్వాత రూ.18 కోట్లకు బదులు రూ.21 కోట్లు పొందినట్లు తెలుస్తోంది. ఇతర ఆటగాళ్ల ధరల్లోనూ స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం.
కర్ణాటక ప్రభుత్వం శక్తి స్కీమ్‌లో భాగంగా అక్కడి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పునరాలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలోని మహిళలు డబ్బు చెల్లించి ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని మహిళలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని ఆయన వివరించారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ థియేటర్‌లో సినిమా చూశారు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీని ఆయన ఇవాళ వీక్షించారు. ‘మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని చిత్రంలో బాగా చూపించారు. ఇందులో కార్తికేయన్, సాయిపల్లవి అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌కు నా హ్యాట్సాఫ్’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ చిత్రాన్ని చూశారు.
టపాసులు కాల్చినప్పుడు ఆకాశంలో రకరకాల రంగులు వస్తుంటాయి. క్రాకర్స్‌లో ఉండే లోహాల వల్ల ఆ రంగులు వస్తాయి. అల్యూమినియం, మెగ్నీషియం మండితే తెలుపురంగులో వెలుగు వస్తుంది. లిథియం క్లోరైడ్(రెడ్), కాపర్ క్లోరైడ్(లైట్ బ్లూ), సోడియం క్లోరైడ్(ఆరెంజ్) వేర్వేరు రంగులు ఇస్తాయి. ఇంకా భిన్నమైన రంగుల కోసం మెటల్ సాల్ట్స్, వాటి మిశ్రమంతో క్రాకర్స్ తయారు చేస్తారు.
ఇంగ్లండ్ క్రికెట్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. అక్టోబర్ 17న ENG నార్త్ ఈస్ట్‌లోని తన ఇంట్లోకి మాస్క్‌లతో వచ్చిన కొందరు జువెలరీ, కొన్ని విలువైన వస్తువులు చోరీ చేశారని స్టోక్స్ వెల్లడించారు. చోరీ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారని, అదృష్టం కొద్దీ వాళ్లకు ఏమీ కాలేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ ఘటన వాళ్లను మానసికంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు.
IPL: భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. పంత్ కోసం ధోనీ CSK యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను ఆ టీం వదులుకోవాలని నిర్ణయించుకుందని cricbuzz తెలిపింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, మెక్‌గుర్క్, పొరెల్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్ వచ్చింది. దీపావళి కానుకగా ఈరోజు మధ్యాహ్నం 12.06గంటలకు అంటూ యూనిట్ ఓ ట్వీట్ చేసింది. అయితే గతంలో దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఈరోజు వచ్చేది టీజర్ అని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అడ్వాణీ హీరోయిన్ నటిస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sorry, no posts matched your criteria.