News September 1, 2025

ఫామ్ హౌస్‌కు క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు!

image

TG: ఎమ్మెల్సీ <<17582704>>కవిత<<>> సంచలన ఆరోపణలు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న రేవంత్ ఆదేశాలపై కేసీఆర్, కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో కవిత చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తారని చర్చ జరుగుతోంది.

News September 1, 2025

నిమ్స్‌లో ఉచిత గుండె ఆపరేషన్లు

image

TG: పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు నిమ్స్‌లో బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ టెస్టులు చేయనున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 21 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైతే ఉచిత గుండె ఆపరేషన్లు చేస్తామన్నారు. ఈ ఖర్చును ఆరోగ్యశ్రీ, CMRF ద్వారా ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రతి మంగళ, గురు, శుక్రవారాల్లో వైద్యులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

News September 1, 2025

కాల భైరవ మంత్రాలు

image

* కష్టాలు తొలగడానికి: ఓం హూం జూం భం కాలభైరవాయ సంకష్టనాశాయ నమః
* వ్యాధి నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ వ్యాధినివారణాయ నమః
* గ్రహదోష నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ గ్రహస్వరూపాయ గ్రహాణాంపతయే నమః
* దుఃఖ నివారణకు: ఓం హూం జూం భం కాలభైరవాయ దుఃఖ నివారణాయ నమః
* వివాహ సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ మాంగళ్యరూపాయ నమః

News September 1, 2025

కవిత దృష్టిలో దెయ్యాలు వీరేనా?

image

TG: BRSలో కవిత కల్లోలం మరింత ముదిరింది. KCR చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో వ్యాఖ్యానించిన ఆమె, ఇవాళ ఏకంగా హరీశ్, సంతోష్ <<17582704>>పేర్లను<<>> బయటపెట్టడం సంచలనంగా మారింది. ఆమె చెప్పిన దెయ్యాలు వీరేనా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అటు కవిత ఆరోపణలను లెక్క చేయబోమని చెబుతూ వస్తున్న BRS నేతలు.. తాజా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా హరీశ్, సంతోష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

News September 1, 2025

గుడిలో గంట ఎందుకు కొడతారు?

image

మనం గుడికి వెళ్లగానే గంట కొడతాం. మరి ఎందుకు కొట్టాలన్న సందేహానికి స్కంద పురాణంలో సమాధానం ఉంది. గంట మోగించడం వల్ల మనం చేసిన వంద జన్మల పాపాలు తొలగిపోతాయి. మనసులో ఉండే కల్లోలాలను లయబద్ధమైన గంట ధ్వని తొలగించి శాంతిని చేకూరుస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే గంట కొట్టినప్పుడు వచ్చే శబ్ద కంపనాలు వాతావరణంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయని ఓ నమ్మకం.

News September 1, 2025

వరల్డ్ కప్ విజేతలకు భారీ నజరానా

image

మహిళల ODI WC విజేతలకు ICC భారీ నజరానా ప్రకటించింది. విన్నర్స్‌కు రూ.39.50 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నట్లు తెలిపింది. గత WC(2022)లో ఇది ₹11.65 కోట్లు మాత్రమే. రన్నరప్‌కు రూ.19.78 కోట్లు, సెమీ ఫైనలిస్టులకు రూ.9.75 కోట్లు, 5, 6 స్థానాలకు రూ.4.50 కోట్లు, 7,8 స్థానాలకు రూ.2.20 కోట్లు, టోర్నీలో ఆడిన ప్రతి జట్టుకూ అదనంగా రూ.2 కోట్లు అందించనుంది. మొత్తంగా రూ.122 కోట్లు ప్రైజ్ మనీగా బహూకరించనుంది.

News September 1, 2025

3 రోజుల ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ సంజయ్

image

AP: నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే <<17552037>>కేసులో<<>> సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌ను ఏసీబీ విచారించనుంది. వారం రోజులు విచారణకు అనుమతివ్వాలన్న పిటిషన్‌పై విచారించిన ఏసీబీ కోర్టు 3 రోజుల పాటు ఆయనను కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపట్నుంచి అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఉ.8- సా.6 గంటల వరకు ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించింది.

News September 1, 2025

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి స్పెషల్ పోస్టర్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. రేపు బర్త్ డే సందర్భంగా పవన్‌కు విషెస్ తెలియజేస్తూ రాకింగ్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News September 1, 2025

సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారు?

image

దేవుళ్లు, దేవతలకు వాహనాలతోపాటు ఆయుధాలు కూడా ఉంటాయి. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎంతో ప్రత్యేకం. ఈ ఆయుధ ప్రస్తావన శివపురాణంలోని కోటి యుద్ధ సంహితలో ఉంది. పూర్వం రాక్షసుల దురాగతాలు పెరిగినప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దీంతో రాక్షసులను ఓడించే దివ్య ఆయుధం కోసం ఆయన శివుడిని ప్రార్థించారు. దీంతో ముక్కంటి సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణువుకు అందించారని శాస్త్రాలు చెబుతున్నాయి.

News September 1, 2025

చెప్పులో దూరిన పాము.. చూడకుండా ధరించడంతో!

image

వర్షాల వల్ల సర్పాలు, కీటకాలు ఇళ్ల బయట ఉంచిన చెప్పులు, హెల్మెట్స్‌లో తలదాచుకుంటుంటాయి. అలా బెంగళూరులో మంజు ప్రకాశ్ అనే యువకుడు ఇంటి బయట ఉంచిన చెప్పులను పరిశీలించకుండా ధరించాడు. దీంతో అందులో ఉన్న పాము కాటేసింది. గతంలో ఓ ప్రమాదం వల్ల ప్రకాశ్ తన కాలులో స్పర్శ కోల్పోవడంతో కాటేసినట్లు తెలియలేదు. అరగంట పాటు ఆ చెప్పులతోనే నడిచి ఇంటికెళ్లిన కొద్దిసేపటికే చనిపోయాడు. పాము కూడా మరణించింది.