News May 8, 2025

సైనికులకు సంఘీభావంగా సీఎం ర్యాలీ

image

‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. Dy.CM భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున యువత తరలివచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకూ ప్రభుత్వం ర్యాలీ చేపడుతోంది.

News May 8, 2025

Women Wellness: మంచి భార్య అనిపించుకోవాలని..!

image

మంచి భార్య, మంచి కోడలు అనిపించుకోవడానికి మహిళలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీన్నే గుడ్‌వైఫ్ సిండ్రోం అంటారు. ప్రతి విషయంలోనూ సర్దుకుపోవడం, సంతోషాలను త్యాగం చేయడం గుడ్‌వైఫ్ సిండ్రోం లక్షణాలు. కుటుంబం కోసం తమ బాధలను తొక్కిపెట్టేస్తుంటారు. దీంతో వారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ ఆనందాల్ని వదులుకోకుండానే మంచిభార్యగా ఉండొచ్చు. భాగస్వామి బాధ్యతగా ఉంటే భార్యకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

News May 8, 2025

ప్రయాణికుడిపై దాడి.. రైల్వే సిబ్బందిపై వేటు

image

రైళ్లలో అధిక ధరలకు ఫుడ్ అమ్ముతున్నారని కంప్లైంట్ చేసిన వ్యక్తిపై క్యాటరింగ్ సిబ్బంది <<16346283>>దాడి<<>> చేసిన ఘటనలో రైల్వే శాఖ చర్యలకు దిగింది. ప్రయాణికుడిపై దాడికి దిగిన సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా వారి క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది.

News May 8, 2025

రోహిత్ రిటెర్మెంట్‌పై కపిల్ దేవ్ రియాక్షన్

image

టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఈ ఫార్మాట్‌లో హిట్ మ్యాన్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చెప్పారు. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదని, రోహిత్ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు కెప్టెన్‌గా రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే అయినా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కాగా కొత్త కెప్టెన్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

News May 8, 2025

మిస్ వరల్డ్ పోటీలకు నగరం సిద్ధం

image

TG: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమైంది. 72వ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు 109 దేశాల నుంచి కంటెస్టెంట్స్ నగరానికి చేరుకున్నారు. రేపటిలోగా అందరూ చేరుకునే అవకాశముంది. ఈ పోటీల్లో నందిని గుప్తా(భారత్), అథెన్నా క్రాస్బీ(అమెరికా), ఎమ్మా మోరిసన్(కెనడా) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ నెల 31న హైటెక్స్‌లో ఫినాలే జరగనుంది.

News May 8, 2025

Working women: ఉద్యోగం చేస్తున్నారా? మీ హక్కులు తెలుసుకోండి

image

ప్రస్తుతకాలంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగింది. అయితే చాలామందికి పని ప్రదేశంలో హక్కుల గురించి తెలీదు. వీరి కోసం సమాన పనికి సమాన వేతనం, ప్రసూతి ప్రయోజనాల హక్కు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా POSH చట్టం, సురక్షిత పని ప్రదేశం వంటి హక్కులు ఉన్నాయి. పెద్ద కంపెనీల నుంచి చిన్న షాపులో పనిచేసే అందరు మహిళా ఉద్యోగులకు రాజ్యాంగం ఈ హక్కులు కల్పించింది. ఇవి మహిళల గౌరవం, స్వేచ్ఛ, సమానత్వాన్ని చాటుతున్నాయి.

News May 8, 2025

ల్యాండ్ మైన్స్ పేలిన ఘటనలో ట్విస్ట్!

image

కర్రె గుట్ట కూంబింగ్‌లో ల్యాండ్ మైన్స్ పేలి జవాన్లు మరణించిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ల్యాండ్ మైన్స్ పేలుడు జరగలేదని మావోయిస్టులతో ఎదురుకాల్పుల్లో మరణించారని సమాచారం. సుమారు నాలుగు గంటల పాటు కాల్పులు చోటు చేసుకున్నాయి. మృతులను RSI సుధీర్, సందీప్, పవన్‌గా గుర్తించారు. మృతదేహాలను వరంగల్ MGM మార్చురీకి తరలించగా డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర ఆసుపత్రికి చేరుకున్నారు.

News May 8, 2025

పాక్ ఆరోపణల్లో ఆశ్చర్యం లేదు: మిస్రీ

image

రఫేల్ సహా భారత రక్షణ సంపదను ధ్వంసం చేశామన్న పాకిస్థాన్ ప్రభుత్వ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వ్యంగ్యంగా స్పందించారు. ‘పాక్ ప్రధాని, ఉప ప్రధాని, రక్షణ మంత్రి ఈ తరహా ప్రకటనలు చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆ దేశం పుట్టడంతోనే అబద్ధాలు మొదలుపెట్టింది. దేశ విభజన అనంతరమే కశ్మీర్‌లోకి చొరబడి ఆక్రమించిన పాక్, అక్కడ ఉన్నది తమ బలగాలు కావని UN సహా ప్రపంచాన్ని బుకాయించింది’ అని గుర్తు చేశారు.

News May 8, 2025

ప్రధానితో వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడి భేటీ

image

వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడితో సింధు జలాల ఒప్పందం భారత్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది. 1960లో భారత్, పాక్ మధ్య జరిగిన సింధు ట్రీటీలో ప్రపంచ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా ఆ అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేసింది. ఈ ఒప్పందం ప్రకారం డ్యామ్ ఎత్తు పెంచే సమయంలో తప్ప పాక్‌కు నీటి తరలింపు నిలిపివేసేందుకు అవకాశం లేదు.

News May 8, 2025

ఫేస్ టేపింగ్ చేస్తున్నారా?

image

ముఖంపై ముడతలు తగ్గాలని చాలామంది ఫేస్ టేపింగ్ టెక్నిక్ వాడతారు. ముడతలు ఉన్న ప్రాంతాల్లో టేపులను వేసి, రాత్రంతా ఉంచుతారు. దీనివల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ ఫేస్ టేపింగ్ ఎక్కువగా వాడితే ముఖంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇలా కాకుండా స్కిన్ కేర్‌పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటేనే చర్మం అందంగా, యవ్వనంగా మెరిసిపోతుందని సూచిస్తున్నారు.