News September 1, 2025

ఈ నెల 6న యూరియా కొరతపై వైసీపీ ఆందోళనలు

image

AP: రాష్ట్రంలో యూరియా కొరతపై ఈ నెల 6న ఆందోళనలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ నిరసనలు చేపట్టనున్నారు. కాగా టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ చేసి పక్కదారి పట్టిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

News September 1, 2025

ఇందిరమ్మ చీరలు ఈసారైనా చేరేనా..?

image

తెలంగాణలో ఈసారి కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ అనుమానమే. గతేడాది శారీలు ఇవ్వని సర్కారు ఈసారి మరింత క్వాలిటీతో మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు అందిస్తామని ఇటీవలే చెప్పింది. సెప్టెంబర్ 21 – 30 మధ్య బతుకమ్మ వేడుకలు జరగనుండగా, సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. దీంతో ఇందుకు రెండు వారాల ముందే నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చు. ఈ పరిణామాలను బట్టి ఈసారీ ఆడబిడ్డలకు చీరలు అందకపోవచ్చు.

News September 1, 2025

ఫ్రీడమ్ ప్లాన్.. గడువు పొడిగించిన BSNL

image

కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన <<17269129>>ఫ్రీడమ్ ప్లాన్<<>> గడువును BSNL పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తుండటంతో మరో 15 రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. నిన్నటితో గడువు ముగియగా ఈ నెల 15వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.1కే ఉచిత సిమ్‌తో పాటు 30 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.

News September 1, 2025

ఈనెల 21 నుంచి బతుకమ్మ వేడుకలు: జూపల్లి

image

TG: ఈనెల 21న వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయని మంత్రి జూపల్లి తెలిపారు. ‘22-24 వ‌ర‌కు జిల్లాల్లోని ముఖ్య ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో వేడుకలు జరుపుతాం. 27న ట్యాంక్‌బండ్‌పై కార్నివాల్ నిర్వహిస్తాం. 28న LB స్టేడియంలో గిన్నిస్ రికార్డే లక్ష్యంగా 10వేల మందితో సంబరాలు ఉంటాయి. 29న పీపుల్స్ ప్లాజా వద్ద బతుకమ్మ పోటీలు, 30న బతుకమ్మ పరేడ్ నిర్వహిస్తాం’ అని మంత్రి వెల్లడించారు.

News September 1, 2025

BIG ALERT: 3 రోజులు అతి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

News September 1, 2025

సొంతింట్లోనే కవిత వేరు కుంపటి?

image

TG: సొంతింట్లోనే వేరు కుంపటి పెట్టినట్లుగా MLC కవిత వ్యవహారం మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హరీశ్, సంతోష్ రావు లక్ష్యంగా ఆమె చేసిన <<17582704>>ఆరోపణలు<<>> BRS వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో ఆమె తర్వాతి టార్గెట్ కేటీఆర్ కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో ఆమె ప్రాధాన్యం తగ్గించడంలో KTR పాత్ర కూడా ఉందనేది వారి వాదన. మరి ఈ పంచాయితీకి KCR ఫుల్‌స్టాప్ పెడతారేమో చూడాలి.

News September 1, 2025

అంతర్గత కలహాలతోనే హరీశ్‌ను టార్గెట్ చేశారు: మహేశ్ కుమార్

image

TG: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్పష్టమైందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘తప్పు కేసీఆర్ చేశారా? హరీశ్ రావు చేశారా? అనేది అనవసరం. స్కామ్ జరిగిందని స్పష్టమైంది. మామా అల్లుళ్ల వాటా ఎంతో తేలాలి. కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్‌కు చేరింది. కుటుంబ తగాదాలను కాంగ్రెస్‌పై రుద్దడమేంటి? అంతర్గత కలహాలతోనే హరీశ్ రావును టార్గెట్ చేశారు’ అని అన్నారు.

News September 1, 2025

ప్రభాస్‌తో సినిమా కోసం అనుష్క వెయిటింగ్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మరో సినిమా చేయాలని హీరోయిన్ అనుష్క శెట్టి భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత అదే రేంజ్‌లో ఉండే కథ వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కచ్చితంగా డార్లింగ్‌తో మళ్లీ కలిసి నటించే రోజు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అనుష్క నటించిన ‘ఘాటీ’ మూవీ ఈ నెల 5న థియేటర్లలో విడుదల కానుంది.

News September 1, 2025

కవితపై చర్యలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్?

image

TG: పార్టీ అగ్రనేతలపై సంచలన <<17582704>>ఆరోపణలు<<>> చేసిన MLC కవితపై BRS చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె PRO పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో కవిత కామెంట్స్‌ను పోస్ట్ చేశారు. దీంతో వాటిని డిలీట్ చేసిన బీఆర్ఎస్.. PROను అందులో నుంచి తొలగించింది. అటు BRS ఫాలోవర్లు కవిత X, ఇన్‌స్టా అకౌంట్లను అన్‌ఫాలో కొడుతున్నారు. కవిత విషయంలో అధినేత KCR ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కేడర్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

News September 1, 2025

నందీశ్వరుడు ఎవరు?

image

మహాశివుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. ఓసారి అతను శ్రీశైలం వచ్చి కఠోర తపస్సు చేశాడు. నంది దీక్షకు మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకు మరో 10వేల ఏళ్లు తపస్సు శక్తిని ప్రసాదించమని నంది అర్థించగా శివుడు తథాస్తు అన్నాడు. 10వేల వేళ్ల తపస్సు తర్వాత నందికి నీలకంఠుడు గణాధిపత్యం ఇచ్చాడు. తనకు సన్నిహితంగా, శ్రీశైలంలో కొలువుదీరేలా అనుగ్రహించాడు. శ్రీశైలఖండం కావ్యంలో ఈ కథ ఉంది.