India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దీపావళి సందర్భంగా ఇళ్లలో, షాపుల్లో లక్ష్మీ పూజలు చేస్తుంటారు. అయితే, పూజ చేసేందుకు సరైన సమయాన్ని పురోహితులు సూచించారు. వేద పంచాంగం ప్రకారం ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం 5:36 నుంచి 8:11 వరకు, శుభ ముహూర్తం సాయంత్రం 5:31 నుంచి 9:55 గంటల వరకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5:31-9:55 గంటల మధ్య లక్ష్మీపూజ చేయడం శుభప్రదమని వెల్లడించారు.
జనసేన కోటాలో టీటీడీ పాలకమండలిలో ముగ్గురికి అవకాశం లభించింది. తెలంగాణకు చెందిన బొంగునూరి మహేందర్ రెడ్డి, పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీ, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఆనంద్ సాయికి చోటు కల్పించారు. మహేందర్ రెడ్డి 2009 నుంచి యువరాజ్యంలో చురుగ్గా పని చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ సాయి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆర్కిటెక్ట్‌గా పని చేశారు.
భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతం గంభీర్‌పై ఓ చీటింగ్ కేసులో విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గంభీర్ పలు రియల్ ఎస్టేట్ సంస్థల జాయింట్ వెంచర్‌కు డైరెక్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఆ కంపెనీ తమను మోసం చేసిందంటూ అందులో ఫ్లాట్లు కొన్నవాళ్లు చీటింగ్ కేసు పెట్టారు. అటు గంభీర్ తన పరిధికి మించి కంపెనీ నుంచి డబ్బు అందుకున్నట్లు కోర్టు గుర్తించింది.
AP: రాష్ట్రంలో వచ్చే నెల 2 నుంచి ‘మిషన్ పాట్‌హోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరంభిస్తోంది. సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా ఎస్.కోటలో రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రోడ్లకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు, గుంతలు పూడ్చడం, కల్వర్టుల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ఇందుకోసం రూ.860 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. జనవరి నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించింది.
* లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే క్రాకర్స్ కొనండి.
* వాహనాల దగ్గర, కరెంట్ వైర్ల కింద, డ్రైనేజీ సమీపంలో బాణసంచా కాల్చడం ప్రమాదకరం.
* గాలి వీచే సమయంలో రాకెట్ల వంటి పైకి ఎగిరే టపాసులు కాల్చకండి.
* కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్‌లో వేయండి.
* ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలున్న వారు టపాసులకు దూరంగా ఉండండి. నాణ్యమైన మాస్క్‌లు ధరించండి.
> SHARE
TG: దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది సొంత స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇల్లు ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ నిబంధన వల్ల ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇస్తే 30లక్షల దరఖాస్తులు బుట్టదాఖలు కావాల్సి ఉంటుంది.
దీపావళి పర్వదినాన ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలని వేద పండితులు చెబుతున్నారు. ఇంటి గడపకు ఇరువైపులా, వంట గది, ధాన్యాగారం, తులసికోట, రావిచెట్టు కింద దీపం పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ఆలయాలు, మఠాలు, గోశాలలు, వృక్షాలు, ఇంట్లోని ప్రతి మూలలోనూ దీపాలు వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు. నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలంటున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దివ్యమైన వెలుగుల పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూగాలని కోరుకున్నారు. లక్ష్మీగణేశుల ఆశీర్వాదంతో అందరూ సంపన్నమవ్వాలని ప్రార్థించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రజలకు విషెస్ చెబుతున్నారు. ఏపీ Dy CM పవన్ కళ్యాణ్ పాక్, బంగ్లా, అఫ్గాన్‌లోని హిందువులకూ శుభాకాంక్షలు చెప్పడం తెలిసిందే.
ఈ పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటిది మంచిర్యాల(D) జన్నారం(M) రోటిగూడకు చెందిన సంతోష్ 7 ఉద్యోగాలు సాధించారు. అతడి పేరెంట్స్ లచ్చన్న, రాజవ్వ రైతులు. 2023లో రైల్వేలో పాయింట్‌మెన్, సింగరేణిలో జూ.అసిస్టెంట్, 2024లో గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జూ.లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు సాధించారు. తాజాగా TGPSCలో జూ.లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికైన సంతోష్ అందులోనే చేరుతానని తెలిపారు.
HYD రోడ్లు అంటే ఏమాత్రం స్థలం కనిపించినా అందులోకి దూసుకెళ్లే వాహనాలే చాలామందికి గుర్తొస్తాయి. అయితే HYDలో ట్రాఫిక్ రూల్స్ తు.చ తప్పకుండా పాటించే వాళ్లూ ఉన్నారండోయ్. జూబ్లీహిల్స్ రోడ్ నం.45 ఫ్లైఓవర్ కింద వాహనాలు లైన్ డిసిప్లెన్ పాటిస్తూ వెళుతున్న పైఫొటో నెట్టింట వైరలవుతోంది. ‘నమ్మలేకపోతున్నాం’ అని కొందరంటే, ‘ఇది హైదరాబాద్‌లో జరిగిందా?’ అని ఇంకొందరు ఆశ్చర్యపోతున్నారు.
Sorry, no posts matched your criteria.