News November 9, 2025

అవనీ లేఖరాకు మరో స్వర్ణం

image

2025 పారా షూటింగ్ ప్రపంచ కప్‌లో షూటింగ్‌లో అవని లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1లో స్వర్ణం సాధించారు. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడంతో అవని కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి. మొదట ఆర్చరీ నేర్చుకున్న ఆమె తర్వాత షూటింగ్‌కు మళ్లారు. రెండు ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ పారాఅథ్లెట్‌గా కీర్తి గడించింది. వరుస విజయాలు సాధిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు అవని.

News November 9, 2025

ఆడపిల్ల పెళ్లికి రూ.65వేల సాయం: యోగి

image

యూపీలో భవన నిర్మాణ కార్మికులకు యోగి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘కన్యా వివాహ్ సహాయతా యోజన’ కింద ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేయనుంది. సాధారణ వివాహానికి రూ.65వేలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీకి రూ.75వేలు, సామూహిక వివాహాలకు రూ.85వేలు ఇవ్వనుంది. వీటితో పాటు వేడుక ఖర్చులకు రూ.15వేలు అదనంగా అందించనుంది. భవన నిర్మాణ కార్మికులు సమాజానికి వెన్నెముక అని యోగి కొనియాడారు.

News November 9, 2025

ఓటుకు రూ.7వేలు ఇస్తున్నారు: బండి సంజయ్

image

TG: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెస్ రూ.5వేలు, BRS రూ.7వేలు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే KCR మెడలను వంచామని, కాంగ్రెస్ మెడలూ BJP వంచుతుందని వ్యాఖ్యానించారు. హిందువుల దమ్మేంటో జూబ్లీహిల్స్ ప్రజలు చూపించాలన్నారు.

News November 9, 2025

రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్‌నాథ్

image

TG సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘<<18211719>>కాంగ్రెస్ అంటే ముస్లింలు<<>>.. ముస్లింలంటే కాంగ్రెస్ అని రెండుమూడు రోజుల కిందట TG సీఎం అన్నారు. రాజకీయాల్లో ఇంకా ఎంత వరకు దిగజారాలని కాంగ్రెస్ కోరుకుంటోంది?’ అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారని, దీనిపై వారు తీవ్రంగా ఆలోచించాలని కోరారు. దేశంలో అభివృద్ధి చేయగలిగేది NDA మాత్రమేనని చెప్పారు.

News November 9, 2025

లిల్లీ పూల సాగు – అనువైన రకాలు

image

లిల్లీ పూలను విడి పువ్వులుగా, కట్ ఫ్లవర్స్‌గా, దండలకు, బొకేల తయారీకి, సుగంద ద్రవ్యాల తయారీకి ఉపయోగిస్తారు. లిల్లీ పూలలో అనేక రకాలున్నాయి.
☛ సింగిల్ రకాలు : వీటిలో పూల రేకులు ఒక వరసలో అమరి ఉంటాయి.
☛ ఉదా: కలకత్తా సింగిల్, హైదరాబాద్ సింగిల్, మెక్సికన్ సింగిల్, ఫులే రజిని, ప్రజ్వల్, రజత్ రేఖ, శ్రింగార్, అర్కా నిరంతర. వీటిని విడి పువ్వులుగా, పూల దండల కోసం, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి వినియోగిస్తారు.

News November 9, 2025

NFUకు భారత్ కట్టుబడి ఉంది : రాజ్‌నాథ్ సింగ్

image

భారత్ ఏ దేశంపైనా ముందుగా అణు దాడి చేయకూడదనే NFU (No First Use) సూత్రానికి కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. సంయమనం, సంసిద్ధత రెండింటిపై భారత్ ఆధారపడి ఉంటుందన్నారు.

News November 9, 2025

సమాజం కోసం ఏర్పడిందే RSS: మోహన్ భాగవత్

image

RSS సమాజం కోసం ఏర్పడిందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ దేనికీ వ్యతిరేకం కాదు. అది అధికారాన్ని కోరుకోదు. సమాజంలో ప్రాధాన్యతను ఆశించదు. దేశ కీర్తి పెంచేందుకు సేవ చేయాలని కోరుకుంటుంది. మొదట్లో RSSను ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు’ అని అన్నారు. RSS 100ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

News November 9, 2025

డిసెంబర్ 15న IPL వేలం!

image

ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15న నిర్వహించే అవకాశం ఉందని TOI పేర్కొంది. గత రెండు వేలంపాటలను దుబాయ్, సౌదీ అరేబియాలో జరపగా ఈసారి ఇండియాలోనే నిర్వహించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రిటెన్షన్ డెడ్‌లైన్ ఈనెల 15న ముగియనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకునే ప్లేయర్లను ప్రకటించాలి. అయితే CSK, RR జడేజా, శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.

News November 9, 2025

లిల్లీ పూల సాగు – అనువైన రకాలు

image

☛ సెమి-డబుల్ రకాలు: వీటిలో పూల రేకులు 2-3 వరుసలలో అమరి ఉంటాయి. ఉదా: CV. సెమీ-డబుల్.
☛ డబుల్ లిల్లీ రకాలు: ఈ పూల రేకులు 3 కన్నా ఎక్కువ వరుసలలో అమరి ఉంటాయి.
☛ ఉదా: సువాసిని, స్వర్ణ రేఖ, హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, వైభవ్, పెర్ల్ డబుల్. ఈ రకాలను ఎక్కువగా బొకేల తయారీలో వాడతారు. ☛ రైతులు ఏ ఉద్దేశంతో వీటిని సాగు చేయాలనుకుంటున్నారో అందుకు అనువైన రకాన్ని వ్యవసాయ నిపుణుల సూచనలతో ఎన్నుకోవడం మంచిది.

News November 9, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ(<>NIH<<>>) 3 ప్రాజెక్ట్ సైంటిస్ట్, SRF, JRF పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పీజీ, పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్/హైడ్రాలజీ/అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://nihroorkee.gov.in